Share News

Minister Anam: తక్షణమే అన్ని రక్షణ చర్యలు చేపట్టండి.. నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు మంత్రి ఆదేశం..

ABN , Publish Date - Oct 14 , 2024 | 03:14 PM

బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా నెల్లూరు జిల్లాలో పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ఆనంద్‌, రెవెన్యూ, పోలీసు అధికారులతో దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

Minister Anam: తక్షణమే అన్ని రక్షణ చర్యలు చేపట్టండి.. నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు మంత్రి ఆదేశం..
Minister Anam Ramanarayana Reddy

నెల్లూరు: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆనంద్‌, రెవెన్యూ, పోలీసు అధికారులతో దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్‌తో మంత్రి ఆనం చర్చించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సమావేశంలో రెవెన్యూ, పోలీసు అధికారులను ఆయన ఆదేశించారు.


తుపాను ప్రభావం వల్ల ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని సూచించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దని మంత్రి చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి ఆనం చెప్పుకొచ్చారు. ఆనం ఆదేశాలతో ముఖ్యంగా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో ఆర్డీవో పావని, అధికారులు పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.


బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఇవాళ(సోమవారం) బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి, రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు పశ్చిమగోదావరి, కృష్ణా, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆయన చెప్పారు.


బుధ, గురు వారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. భారీ వర్షాలతో నదులు, వాగులు, కాలువలు పొంగిపొర్లే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రోణంకి హెచ్చరించారు. అలాగే విద్యుత్ స్థంబాలు, విద్యుత్ తీగలు, చెట్లు, హోర్డింగ్స్ కింద ప్రజలు నిలుచోవద్దని చెప్పారు. ముఖ్యంగా మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Pawan Kalyan: పరిపాలన, రాజకీయాలు రెండూ వేరు.. వైసీపీపై విరుచుకుపడిన పవన్ కళ్యాణ్

Raghu Rama Case: ఎమ్మెల్యే రఘురామ కేసులో ట్విస్ట్..

Read Latest AP News and Telugu News

Updated Date - Oct 14 , 2024 | 03:16 PM