Share News

Minister Anam: వైసీపీ నేత మా ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించాడు: మంత్రి ఆనం..

ABN , Publish Date - Oct 20 , 2024 | 01:10 PM

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిన్న (శనివారం) సాయంత్రం తన స్వగృహంలో మండలాల వారీ సమావేశాలు చేపట్టారు.

Minister Anam: వైసీపీ నేత మా ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించాడు: మంత్రి ఆనం..

నెల్లూరు: వైసీపీ నేతల వల్ల తనకు ప్రాణహాని ఉందని, తనపై రెక్కీ నిర్వహించేందుకు కొంతమందిని ఆ పార్టీ పెద్దలు పంపినట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Minister Anam Ramanarayana Reddy) ఆరోపించారు. తన ఇంట్లో జరిగిన టీడీపీ (TDP) పార్టీ సమావేశంలో వైసీపీ (YSRCP) నేత అక్రమంగా ప్రవేశించి రెక్కీ నిర్వహించడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. ఫ్యాన్ పార్టీ నేతలు ఎలాంటి దాడులు చేసేందుకు సిద్ధమైన భయపడేది లేదని మంత్రి స్పష్టం చేశారు.


నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిన్న (శనివారం) సాయంత్రం తన స్వగృహంలో మండలాల వారీ సమావేశాలు చేపట్టారు. అయితే సమావేశానికి స్వామి మాలలో ఓ వైసీపీ నేత హాజరయ్యారు. అతడిని వైసీపీ నేతగా గుర్తించిన టీడీపీ శ్రేణులు, ఆనం అనుచరులు గట్టిగా నిలదీశారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. మంత్రి ఆనం అంతరంగాలు, ఇంటి వివరాలు, పార్టీ కార్యక్రమాలు తెలుసుకునేందుకు వచ్చినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. అనంతరం అతడిని మూడో పట్టణ పోలీసులకి అప్పగించారు.

Guntur: యువతిని ఎత్తుకెళ్లిపోయిన రౌడీ షీటర్.. చివరికి..


తనపై రెక్కీ నిర్వహించడంపై మంత్రి ఆనం తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. " నా నివాసంలో పార్టీ శ్రేణులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నాం. వైసీపీ ఎంపీటీసీ ఒకరు స్వామి మాలలో నేరుగా సమావేశంలో చొరపడ్డాడు. ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయో, పరిసర ప్రాంతాలపై రెక్కీ చేశాడు. మావాళ్లు అతన్ని గుర్తించి నా వద్దకి తెచ్చారు. అతని మాటలు అనుమానాస్పదంగా అనిపించాయి. పోలీసులకు అప్పగించాం. గత వైసీపీ ప్రభుత్వంలో నా సెక్యూర్టీని తొలగించారు. నేను మంత్రి అయ్యాక సీఎం చంద్రబాబును సోమశిలకు తీసుకువచ్చాను. వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతోంది. దాన్ని సహించలేక వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మేకపాటి సోదరులు ఒక్క అభివృద్ధి పనీ పూర్తి చేయలేకపోయారు. ప్రజల భద్రతతో‌పాటు, మా భద్రత గురించీ ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాకు ఆయుధాల లైసెన్సులు ఉన్నాయి. ఇకపై ఆయుధాలతో తిరిగే విషయాన్ని కుటుంబసభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం" అని చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి:

TDP Police: దివ్వెల మాధురి తిరుమల పొలీసుల నోటీసులు..

Andhra Pradesh:నడిరోడ్డుపై వదిలేశారు.. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాకం..

Anitha: విద్యార్థిని మరణం విషాదకరం: హోం మంత్రి అనిత

Updated Date - Oct 20 , 2024 | 01:12 PM