Share News

Somireddy:జగన్‌కు ఆ అర్హత లేదు.. సోమిరెడ్డి విసుర్లు

ABN , Publish Date - Dec 14 , 2024 | 12:47 PM

తాడేపల్లి ప్యాలెస్‌లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ ఏనాడైనా వ్యవసాయ శాఖపై సమీక్ష జరిపారా అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. వ్యవసాయ శాఖపై శ్వేతపత్రం విడుదలకు తాము సిద్ధం, జగన్ సిద్ధమా అని సవాల్ విసిరారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్‌లో వ్యవసాయానికి, రైతాంగానికి పెద్దపీట వేశామని అన్నారు.

Somireddy:జగన్‌కు ఆ అర్హత లేదు.. సోమిరెడ్డి విసుర్లు

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రైతు అనే పేరు ఉచ్చరించే అర్హత కూడా లేదని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని మొదటి స్థానానికి తీసుకెళ్లిన ఘనత జగన్‌దని విమర్శించారు. ఇవాళ(శనివారం) నెల్లూరులో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... వ్యవసాయ శాఖను చంపేసి, సూక్ష్మ సేద్యం, పోషకాలు, ఇతరత్రా రైతు ప్రోత్సాహకాలు దూరం చేశారని ఆగ్రహించారు. జగన్ వల్ల వ్యవసాయ రంగం ఎంత నష్టపోయిందో పులివెందుల రైతులే చెబుతారని అన్నారు.


వ్యవసాయ శాఖపై శ్వేతపత్రం విడుదలకు తాము సిద్ధం, జగన్ సిద్ధమా అని సవాల్ విసిరారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్‌లో వ్యవసాయానికి, రైతాంగానికి పెద్దపీట వేశామన్నారు. తాడేపల్లి ప్యాలెస్‌లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ ఏనాడైనా వ్యవసాయ శాఖపై సమీక్ష జరిపారా అని ప్రశ్నించారు. ఏ2, ఏ2 వియ్యoకుడి సాయంతో రేషన్ బియ్యం విదేశాలకు పంపి కోట్లు దండుకోవటం ఒక్కటే జగన్ చేశారని ఆరోపించారు. దేశంలో రైతులపై తలసరి సగటు అప్పు రూ. 74500 ఉంటే.. ఏపీలో 2.45లక్షలు ఉండటానికి కారణం జగన్ కాదా అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు.


జగన్‌పై మంత్రి నాదెండ్ల మనోహర్ ధ్వజం

మరోవైపు.. కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరిస్తూ.. అండగా ఉంటుందని ఏపీ పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వైసీపీ నేతలపై ట్విట్టర్(ఎక్స్) వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు రైతులకు భరోసాగా నిలుస్తున్నారో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. వైసీపీ పాలనలో గత ఖరీఫ్ సీజన్లో డిసెంబర్ 13నాటికి- 9,40,936 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరణ చేసిందని.. కూటమి ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకూ 16,34,151 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందని వివరించారు. కలెక్టరేట్ల దగ్గరకు బస్తాలు మోసుకువెళ్లి వైసీపీ నేతలు ఫొటో‌షూట్ చేశారని విమర్శించారు. గత సీజన్లో గుంటూరు, విశాఖపట్నం, అనకాపల్లి, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో కనీసం సేకరణ ఎందుకు చేపట్టలేదని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

CM Chandrababu: జమిలి అమలు అయినా.. ఎన్నికలు మాత్రం

Nara Lokesh: విద్యారంగంలో సంస్కరణలు తప్పవు

మీడియా ముందుకు ‘పుష్ప’.. అరెస్ట్‌పై ఏమన్నారంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 14 , 2024 | 12:50 PM