Share News

Nellore: ఎప్పటిలాగానే పనికి వెళ్లారు.. అక్కడ యజమాని పెట్టింది తిని.. బాబోయ్..

ABN , Publish Date - Dec 16 , 2024 | 08:27 PM

వెంకటగిరి రూరల్ మండలం చిలకంపాడు గ్రామానికి చెందిన రైతు కూలీలు అదే గ్రామానికి చెందిన ఓ రైతు చేనులో పని చేసేందుకు ఇవాళ (సోమవారం) ఉదయం యథావిధిగా వెళ్లారు. మధ్యాహ్నం వరకూ ఎప్పటిలాగానే వారంతా హుషారుగా, సంతోషంగా పని చేశారు.

Nellore: ఎప్పటిలాగానే పనికి వెళ్లారు.. అక్కడ యజమాని పెట్టింది తిని.. బాబోయ్..
Agriculture Labourer

నెల్లూరు: అందరికీ అన్నం అందించే రైతు కూలీలు అదే అన్నం తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. భూ యజమాని అందించిన భోజనం చేసిన కూలీలు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక రైతులు, కూలీలంతా తీవ్ర ఆందోళకు గురయ్యారు. ఒక్కొక్కరిగా నేలకూలి అపస్మారక స్థితికి చేరుకున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా పెద్దఎత్తున చర్చకు దారి తీసింది.


వెంకటగిరి రూరల్ మండలం చిలకంపాడు గ్రామానికి చెందిన రైతు కూలీలు అదే గ్రామానికి చెందిన ఓ రైతు చేనులో పని చేసేందుకు ఇవాళ (సోమవారం) ఉదయం యథావిధిగా వెళ్లారు. మధ్యాహ్నం వరకూ ఎప్పటిలాగానే వారంతా హుషారుగా, సంతోషంగా పని చేశారు. భోజనం వేళ కావడంతో అన్నం తినేందుకు చేను నుంచి బయటకు వచ్చారు. అయితే వారంతా ఇంటి నుంచి భోజనం తెచ్చుకున్నప్పటికీ యజమాని మాత్రం వారికి ప్రత్యేకంగా ఆహారం తెప్పించారు. బయట నుంచి రుచికరమైన ఆహారం తీసుకురావడంతో వారు తెచ్చుకున్న భోజనాన్ని పక్కనపెట్టి రైతు తెచ్చిన అన్నాన్ని తిన్నారు. అనంతరం తిరిగి పనిలోకి దిగారు.


అయితే కాసేపటి తర్వాత కూలీలంతా ఒక్కొక్కరిగా అస్వస్థతకు గురికావడం మెుదలైంది. వాంతులు, కళ్లు తిరుగుతూ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. తమకేం జరుగుతుందో అర్థం వారంతా భయంతో కేకలు వేయడం మెుదలుపెట్టారు. పంట పొలాల్లోనే ఒక్కొక్కరిగా కుప్పకూలిపోయారు. మెుత్తం 13 మంది కూలీలు అపస్మారక స్థితికి చేరుకున్నారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన రైతు, తోటి కూలీలు వారిని ట్రాక్టర్ సహాయంతో హుటాహుటిన వెంకటగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


అయితే అక్కడికి వెళ్లిన బాధితులను వైద్య సిబ్బంది పట్టించుకోలేదని గ్రామస్థులు పెద్దఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. దీంతో వారిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. వారికి ప్రస్తుతం మెరుగైన చికిత్స అందుతోందని వెల్లడించారు. అయితే బాధితులను పట్టించుకోని ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బిందిపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యులను అడిగి బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఎమ్మెల్యే సూచించారు. అయితే భోజనం ఎక్కడ్నుంచి తెచ్చారో తెలియాల్సి ఉంది. కాగా, ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి:

AP News: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ.. చర్చించిన అంశాలు ఇవే..

Home Minister Anitha: వాటిని ఎదుర్కొనేందుకు పూర్తిగా సన్నద్ధం అవుతున్నాం: హోంమంత్రి అనిత..

Updated Date - Dec 16 , 2024 | 08:30 PM