Share News

YS Sharmila: వైసీపీని ఏపీ నుంచి తరిమికొడదాం

ABN , Publish Date - Jan 27 , 2024 | 09:26 PM

వైసీపీ(YCP)ని ఏపీ నుంచి తరిమికొడుదామని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) పిలుపునిచ్చారు.

YS Sharmila: వైసీపీని ఏపీ నుంచి తరిమికొడదాం

నెల్లూరు: వైసీపీ(YCP)ని ఏపీ నుంచి తరిమికొడుదామని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) పిలుపునిచ్చారు. శనివారం నాడు నెల్లూరులో పర్యటించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... వైఎస్సార్ పెట్టిన ఫీజ్ రీ ఎంబర్స్ మెంట్ ఏమైంది...? అని ప్రశ్నించారు. యువతకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశారని మండిపడ్డారు. రైతులకు వైఎస్సార్ రుణమాఫీ చేశారని.. నేడు అప్పు లేని రైతు ఏపీలో లేడని ధ్వజమెత్తారు. సాగునీటి ప్రాజెక్టులు మరమ్మతులకి గురైతే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని వైఎస్ షర్మిల మండిపడ్డారు.

ఎన్నికల సమయంలో అయినా ప్రత్యేక హోదా కోసం పోరాడాలని.. ఇప్పుడు కూడా రాకుంటే మరో ఐదేళ్లు ఎదురుచూడాల్సి ఉంటుందని తెలిపారు. తన పుట్టినిల్లు కాబట్టి రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఇక్కడ రాజకీయాలు చేస్తున్నానని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ ఆశయాలని కాపాడే పార్టీ కాంగ్రెస్... కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. ఏపీ ప్రత్యేక హోదాపై రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక తొలి సంతకం పెడుతారని స్పష్టం చేశారు. ఏపీ అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ రావాలని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

Updated Date - Jan 27 , 2024 | 09:27 PM