Share News

AP NEWS: వర్రా రవీందర్ రెడ్డిపై మరో కేసు.. కారణమిదే

ABN , Publish Date - Nov 28 , 2024 | 04:15 PM

వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి అనుచరుడు వర్రా రవీంద్రారెడ్డిపై మరో కేసు నమోదైంది. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌పై వర్రా అసభ్యకరంగా పోస్టులు పెట్టారని, వాటిని తొలగించమని అడిగితే కులం పేరుతో దూషించారని, అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే చంపుతామని బెదిరించారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది.

AP NEWS: వర్రా రవీందర్ రెడ్డిపై మరో కేసు.. కారణమిదే

బాపట్ల జిల్లా: వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి అనుచరుడు, ఆ పార్టీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ వర్రా రవీంద్రారెడ్డిపై మరో కేసు నమోదైంది. రవీందర్ రెడ్డిపై పెదనందిపాడు పోలీస్ స్టేషన్‌లో ఇవాళ(గురువారం) కేసు నమోదైంది. ప్రభుత్వ పెద్దలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారని ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పీటీ వారంట్‌పై వర్ర రవీందర్ రెడ్డిని బాపట్లకు పోలీసులు తీసుకువస్తున్నారు. కడప జైలు నుంచి బాపట్ల జిల్లా కోర్టుకు వర్రాను తరలిస్తున్నారు. సాయంత్రం బాపట్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వర రవీందర్ రెడ్డిని పోలీసులు హాజరుపరచనున్నారు.


కడప జిల్లాలో మరో కేసు..

కాగా.. గతంలో వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి అనుచరుడు వర్రా రవీంద్రారెడ్డిపై మరో కేసు నమోదైంది. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌పై వర్రా అసభ్యకరంగా పోస్టులు పెట్టారని, వాటిని తొలగించమని అడిగితే కులం పేరుతో దూషించారని, అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే చంపుతామని బెదిరించారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. కడప జిల్లా సిద్దవటం మండలం ఎస్‌.రాజంపేట గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త వెంకటాద్రి నందలూరు పోలీసుస్టేషన్‌లో వర్రా రవీంద్రారెడ్డి, సజ్జల భార్గవరెడ్డి, సిరిగిరెడ్డి అర్జున్‌రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఆ కేసును పులివెందులకు బదిలీ చేశారు.సోషల్‌ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వర్రా రవీంద్రారెడ్డిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేసి కడప సెంట్రల్‌ జైలుకు తరలించిన విషయం తెలిసిందే.


ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్‌ ..

అలాగే.. వర్రా రవీంద్రారెడ్డిని తప్పించిన కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్‌ అయిన విషయం విదితమే. వారిని డీఐజీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఈనెల 6వ తేదీన వర్రాను కడప పోలీసులు అరెస్టు చేసి కడపకు తీసుకెళ్లి 41ఏ నోటీసు ఇచ్చి వదిలేశారు. అనంతరం ప్రభుత్వ పెద్దల నుంచి తీవ్ర హెచ్చరికలు రావడంతో వెంటనే వర్రా రవీంద్రారెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ సమయంలో పులివెందుల నియోజకవర్గానికి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు వర్రాకు ఇక్కడ జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు చేరవేసినట్లు తెలిసింది. ఈ ఘటనలో ఇప్పటికే కడప జిల్లా ఎస్పీ బదిలీ, సీఐ సస్పెండ్‌ అయ్యారు.


వర్రా రవీంద్రరెడ్డికి రిమాండ్..

మరోవైపు.. వర్రా రవీంద్రరెడ్డి జ్యుడీషియల్‌ రిమాండ్‌ను న్యాయస్థానం మరో 14 రోజులు పొడిగించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌ సహా మరికొందరిపై వర్రా సోషల్‌మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. ఈ వ్యవహారంలో పులివెందుల పోలీసులు వర్రాను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు ఆదేశించారు. రిమాండ్‌ గడువు ముగియడంతో కడప నాల్గో అదనపు జిల్లా కోర్టు (ఎస్సీ, ఎస్టీ కోర్టు) మరో రెండు వారాలు పొడిగించింది. అతడిని విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది.


దీంతో ఆయన సదరు కేసు పూర్వాపరాలను పూర్తిగా తెలుసుకోవడానికి 26వ తేదీకి వాయిదా వేశారు. కాగా.. కడప సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న వర్రా రవీంద్రరెడ్డిపై కాకినాడ కోర్టులో నడుస్తున్న కేసుకు సంబంధించి అక్కడి న్యాయాధికారి సోమవారం అతడిని వర్చువల్‌గా విచారించినట్లు తెలిసింది. ఇంకోవైపు.. కడప వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి పీఏ బండి రాఘవరెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను కడప ఎస్సీ, ఎస్టీ కోర్టు(నాల్గవ అదనపు జిల్లా కోర్టు) బుధవారానికి వాయిదా వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

Payyavula Keshav: దయనీయంగా ఏపీ ఆర్థిక పరిస్థితి.. ఏపీ అప్పులపై పయ్యావుల క్లారిటీ

Rains: ఆ ప్రాంతాల్లో తుఫాన్.. రెడ్ అలర్ట్ జారీ

Minister Anam: తిరుమలలో చాలా మార్పులు వచ్చాయి: మంత్రి ఆనం

Kadapa: జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మధ్య కొలిక్కిరాని చర్చలు

Read Latest AP News and Telugu News

Updated Date - Nov 28 , 2024 | 04:27 PM