Share News

AP Politics: బాపట్ల జిల్లాలో మరోసారి వైసీపీ, టీడీపీ నేతల ఘర్షణ.. అసలేం జరుగుతోంది..!

ABN , Publish Date - Feb 16 , 2024 | 08:34 PM

పీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార వైసీపీ (YSRCP) తెలుగుదేశం (TDP) నేతలపై దాడులకు తెగబడుతోంది. మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని అనుకున్నదే తడవుగా వైసీపీ రౌడీ మూకలు పలు కుయుక్తులకు పాల్పడుతున్నారు.

AP Politics: బాపట్ల జిల్లాలో మరోసారి వైసీపీ, టీడీపీ నేతల ఘర్షణ.. అసలేం జరుగుతోంది..!

బాపట్ల జిల్లా: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార వైసీపీ (YSRCP) తెలుగుదేశం (TDP) నేతలపై దాడులకు తెగబడుతోంది. మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని అనుకున్నదే తడవుగా వైసీపీ రౌడీ మూకలు పలు కుయుక్తులకు పాల్పడుతున్నారు. ప్లాన్‌లో భాగంగా ఏపీ వ్యాప్తంగా దాడులకు తెగబడుతోంది. నిన్న (గురువారం) పల్నాడు జిల్లాల్లో కొంతమంది టీడీపీ నేతలపై వైసీపీ నేతలు దాడులు చేశారు. ఈ ఘటన మరువక ముందే.. బాపట్ల జిల్లాలో కూడా వైసీపీ నేతలు దాడి చేయడానికి కుట్ర పన్నారు. ‘బాబు షురిటీ - భవిష్యత్ గ్యారెంటీ’ ప్రచారానికి వెళ్లిన తెలుగుదేశం నేతలపై దాడికి తెగబడ్డారు. దీంతో నిజాంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

నిజాంపట్నంలోని ఓ దేవాలయంలో టీడీపీ నాయకులు పూజలు చేస్తుండగా వైసీపీ అల్లరి మూకలు హల్ చల్ చేసి టీడీపీ నేతలపై దాడి చేశారు. దేవాలయానికి తాళాలు వేసి టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకట రమణ అనుచరులు దాడికి యత్నించారు. మోపిదేవికి రాబోయే ఎన్నికల్లో వైసీపీ హై కమాండ్ టికెట్ ఇవ్వలేదని, ఇంకా ఏ రాజకీయ పార్టీ ఇక్కడకు రావడానికి వీల్లేదని చిందులు తొక్కారు. మద్యం మత్తులో అసభ్య పదజాలంతో చెలరేగిపోయారు. దాంతో టీడీపీ - వైసీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. రెండు పార్టీల గొడవతో గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో నిజాంపట్నానికి వైసీపీ, టీడీపీ నేతల క్యాడర్ చేరుకుంది. ఈ విషయం తెలియడంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

Updated Date - Feb 16 , 2024 | 08:34 PM