Share News

Bandaru Satyanarayana: ఎవడబ్బ సొమ్మని వాలంటీర్లకు డబ్బులిస్తున్నావ్

ABN , Publish Date - Feb 23 , 2024 | 04:05 PM

Andhrapradesh: ఎన్నికలను పర్యవేక్షించేది రెవెన్యూ శాఖ అని.. రెవెన్యూ శాఖ మంత్రి బరితెగించి వాలంటీర్‌లను ఎన్నికలు ప్రచారం చేయండని చెప్పడం ఏంటి అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎవడబ్బ సోమ్ము తో డబ్బులిస్తున్నావ్ వాలంటీర్లకు. వాలంటీర్లకు ఇచ్చేది మీ బాబు సొమ్ము కాదు. ధర్మాన, జగన్ ఇంట్లో సొమ్ము ఇవ్వడం లేదు.. ప్రభుత్వ సోమ్ము ఎన్నికల ప్రచారం కోసం ఎలా వాడుతారు’’ అని ప్రశ్నించారు.

Bandaru Satyanarayana: ఎవడబ్బ సొమ్మని వాలంటీర్లకు డబ్బులిస్తున్నావ్

శ్రీకాకుళం, ఫిబ్రవరి 23: ఎన్నికలను (AP Elections 2024) పర్యవేక్షించేది రెవెన్యూ శాఖ అని.. రెవెన్యూ శాఖ మంత్రి బరితెగించి వాలంటీర్‌లను ఎన్నికలు ప్రచారం చేయండని చెప్పడం ఏంటి అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ (Former Minister Bandaru Satyanarayana) విరుచుకుపడ్డారు.

శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎవడబ్బ సోమ్ము తో డబ్బులిస్తున్నావ్ వాలంటీర్లకు. వాలంటీర్లకు ఇచ్చేది మీ బాబు సొమ్ము కాదు. ధర్మాన, జగన్ ఇంట్లో సొమ్ము ఇవ్వడం లేదు.. ప్రభుత్వ సోమ్ము ఎన్నికల ప్రచారం కోసం ఎలా వాడుతారు. ప్రజల డబ్బు... దళారులకు, బ్రోకర్లుకు, వాలంటీర్లకు ఇస్తున్నారు. ఇది సరిపోక వాలంటీర్లకు బహుమతులిస్తున్నారు. వాలంటీర్లను ఎన్నికల కోసం వినియోగిస్తే కల్లుమూసుకోని కూర్చోం. నోటిఫికేషన్ వచ్చాక వాలంటీర్లు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కాల్లు విరగ్గోడతారు మా కార్యకర్తలు. వాలంటీర్లు వైసీపీ ఏసుకున్న బ్రోకర్లు.. వారిని ప్రభుత్వ డబ్బుతో ఎన్నికల ప్రచారం చేయమంటారా?. టీడీపీ - జనసేన కార్యకర్తలు చూస్తూ ఊరుకోం. 80 సంవత్సరాలు దాటిన వారికి ఇంట్లో ఓటింగ్ ఇస్తే వాలంటీర్లు బెదిరిస్తున్నారు. వైసీపీకి ఓటింగ్ వేయకపోతే పెన్షన్ ఇవ్వమని వృద్ధులను బెదిరిస్తున్నారు. ఈసికి ఫిర్యాదు చేశాం. ప్రభుత్వ డబ్బుతో పార్టీ ప్రాచారం చేయడంపై ధర్మాన క్షమాపణ చెప్పాలి. మీకు అంత సరదా ఉంటే వాలంటీర్లుకు మీ పార్టీ నుంచి జీతాలు ఇచ్చుకుని ప్రభుత్వం నుంచి తప్పించండి. మీ దౌర్జన్యాలను ఎండగట్టడమే మా ‘‘రా..కదలి రా’’ ఉద్దేశం. నోటిఫికేషన్ వచ్చాకా.. ధర్మాన, సీతారాంలు మీరూ ఓ కార్యకర్తే? భయపెడితే ఇక్కడ ఎవ్వరూ భయపడరు. ధర్మానకు అధికారులు ఎవరూ చెప్ప లేదేమో. ఎన్నికల కమీషన్.. వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో దూరంగా ఉంచాలని చెప్పింది. వాలంటీర్ల వల్ల అనేకమంది ఇబ్బంది పడుతున్నారు. నా సొంత డ్రైవర్ వాలంటీర్ వల్ల చనిపోయారు. పనికిమాలిన, జేబులు కోట్టుకునేవారిని, బ్లాక్ టిక్కెట్లు అమ్మే వారిని వాలంటీర్లుగా నియమించారు. వారికి పేద ప్రజల డబ్బులు ఇస్తున్నారు’’ అంటూ బండారుసత్యానారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 23 , 2024 | 04:05 PM