Bandaru Satyanarayana: రేపు మీ సాక్షికి కూడా ఇదే గతి..
ABN , Publish Date - Feb 21 , 2024 | 01:15 PM
Andhrapradesh: ఆంధ్రజ్యోతి ఫోటో గ్రాఫర్, ఈనాడు సంస్థలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి సొమ్ముతో సాక్షిని పెట్టారని.. ఆ సంస్థ నుంచి బయటకు రావాలన్నారు. రెండు నెలలు తర్వాత తాము అధికారంలో వస్తాం.. అప్పుడు సాక్షి సోదరులకు ఎవరు భద్రత కల్పిస్తారని ప్రశ్నించారు.
విశాఖపట్నం, ఫిబ్రవరి 21: ఆంధ్రజ్యోతి ఫోటో గ్రాఫర్, ఈనాడు సంస్థలపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి (Former Minister Bandaru Satyanarayana Murthy) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి సొమ్ముతో సాక్షిని (Sakshi Media) పెట్టారని.. ఆ సంస్థ నుంచి బయటకు రావాలన్నారు. రెండు నెలలు తర్వాత తాము అధికారంలో వస్తాం.. అప్పుడు సాక్షి సోదరులకు ఎవరు భద్రత కల్పిస్తారని ప్రశ్నించారు. తాము అధికారంలో వచ్చిన తర్వాత సాక్షి పేపర్ పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించాలన్నారు. ‘‘రేపు మీ సాక్షికి కూడా ఇదే గతి పడుతుంది’’ అంటూ మాజీ మంత్రి హెచ్చరించారు.
శారద పీఠానికి సీఎం జగన్ (CM Jagan) వస్తే ఇన్ని ఆంక్షలు పెట్టడం దారుణమన్నారు. ఈవెంట్ మేనేజర్‌ను పెట్టి రోడ్డు మీద ప్రజలను ఎండలో నిలబెట్టడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్ట్ నుంచి శారదపీఠం వరకు టీడీపీ (TDP) జెండాలను పోలీసులు పీకేశారని.. వైసీపీ (YCP) జెండాలను మాత్రం ఉంచారన్నారు. ముఖ్యమంత్రి వేస్తే కర్ఫ్యూ లాంటి పరిస్థితి ఉండడం ఏమిటి? జగన్ విశాఖ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కొడాలి నాని (Kodali Nani).. గంజాయి నాని.. ఆయన టీవీ ఛానల్స్, పత్రికల ప్రతినిధులపై చేసిన వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ‘‘గుడివాడ అమర్ (Minister Gudivada Amarnath).. నువ్వు విశాఖకు ఎన్ని పరిశ్రమలు తెచ్చావో చెప్పాలి గుడివాడ అమర్ పరిస్థితి గాలిలో ఉంది.. ఆయనకు టికెట్ కూడా ఇవ్వలేదు’’ అని బండారు సత్యనారాయణ మూర్తి వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...