Buddha Venkkana : అప్పుడు నోరు మెదపలేదేం?!
ABN , Publish Date - Dec 30 , 2024 | 04:33 AM
అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరి, బ్రాహ్మణిలను అకారణంగా వైసీపీ కుక్కలు తిడితే నోరు మెదపని పేర్ని నాని.. నేడు తప్పు చేసి దొరికిపోయి..
పేర్ని నానిపై బుద్దా వెంకన్న ఫైర్
విజయవాడ (వన్‌టౌన్), డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరి, బ్రాహ్మణిలను అకారణంగా వైసీపీ కుక్కలు తిడితే నోరు మెదపని పేర్ని నాని.. నేడు తప్పు చేసి దొరికిపోయి.. తప్పించుకోవడానికి చిలకపలుకులు పలుకుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. భార్య పేరుతో గోడౌన్ కట్టి, అక్కడ తప్పుడు పనులు చేయడం ద్వారా పేర్ని నానియే తన భార్యను కేసులో ఇరికించారని వెంకన్న విమర్శించారు. నాడు అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరి, బ్రాహ్మణిని వైసీపీ నాయకులు కొడాలి నాని, వల్లభనేని వంశీ తప్పుగా మాట్లాడారని, తాను వారిని సంకరజాతి కుక్కలు అని తిట్టినందుకు పేర్ని నాని తనపై కేసు పెట్టారని వెంకన్న గుర్తు చేశారు. పేర్ని నానీకి తన భార్యపై నిజంగా ప్రేమ ఉంటే గోడౌన్‌ను తన పేరున పెట్టుకునేవారని, పోనీ భార్య పేరున పెట్టినప్పుడైనా అక్కడ తప్పుడు పనులు చేయకుండా ఉండాల్సిందని చెప్పారు. తప్పుచేసి దొరికిపోయి, ఇప్పుడు భార్యను అడ్డం పెట్టుకుని దొంగ ఏడుపులు ఎందుకన్నారు. అప్పట్లో వైసీపీ నాయకులు మహిళలను నీచంగా మాట్లాడినదానికి పేర్ని నాని ఇప్పటికైనా లెంపలు వేసుకుంటారని భావించానని, అది చేయకుండా ఎదురు నీతులు చెబుతున్నారని విమర్శించారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌పై సినిమా తీయటానికి పేర్ని నానీని కలిసి రాంగోపాల్ వర్మ చర్చ జరపటం వాస్తవం కాదా? అని బుద్దా ప్రశ్నించారు.
నాడు లోకేశ్, వెంకన్నపై ఫిర్యాదు చేసిన పేర్ని నాని
యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేశ్ 2023, ఆగస్టులో గన్నవరం వచ్చారు. అక్కడ జరిగిన సభలో బుద్దా వెంకన్న తన ప్రసంగంలో భువనేశ్వరి, బ్రాహ్మణిని దూషించిన కొడాలి నాని, వల్లభనేని వంశీపై విరుచుకుపడ్డారు. దీనిపై పేర్ని నాని ఆత్కూరు పోలీసుస్టేషన్‌లో లోకేశ్, బుద్దా వెంకన్నపై ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు. ఈ కేసులకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లను వెంకన్న ఆదివారం ప్రదర్శించారు.