Share News

Indian Railways: పాము కారణంగా గంటకు పైగా నిలిచిపోయిన గూడ్స్ రైళ్లు

ABN , Publish Date - Nov 04 , 2024 | 01:35 PM

పాములను చూస్తే ఎంతో మంది భయంతో పారిపోతుంటారు. మరికొందరు వాటిని చూసి ధైర్యంగా నిలబడుతుంటారు. అలాగే ఇంకొందరు వాటి సమీపానికే వెళ్లకుండా వాటితో చెలగాటమాడుతుంటారు. ఈ క్రమంలో కొందరు చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. తాజాగా విశాఖపట్నంలో ఓ పాము కారణంగా గంటకు పైగా గూడ్స్ రైళ్లు నిలిచిపోయాయి.

Indian Railways: పాము కారణంగా గంటకు పైగా నిలిచిపోయిన గూడ్స్ రైళ్లు

విశాఖపట్నం: ఒక్కపాము.. రైళ్లన్నింటినీ నిలిపేసింది. ఈ సంఘటన విశాఖపట్నంలో జరిగింది. పాము కారణంగా గంటకు పైగా గూడ్స్ రైళ్లు నిలిచిపోయాయి. కేకే లైన్లో గంట 15 నిమిషాల పాటు ట్రాఫిక్ అంతరాయం నెలకొంది. అప్పటికే అరకుకు రైలు వెళ్లిపోవడంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కేకే లైన్లో 25KVA విద్యుత్ లైన్ పైకి ఎక్కడంతో.. విద్యుత్ షాక్ గురై పాము మృతిచెందింది. పవర్ ట్రిప్ కావడంతో రైల్వే లైన్‌కు అంతరాయం ఏర్పడింది. రైల్వే అధికారుల అప్రమత్తమై పామును తొలగించి రైల్వే అధికారులు ట్రాఫిక్ క్లియర్ చేశారు.

Updated Date - Nov 04 , 2024 | 01:35 PM