Share News

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీని వదలని వర్షాలు

ABN , Publish Date - Dec 19 , 2024 | 08:02 AM

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం బలపడటంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీని వదలని వర్షాలు

అమరావతి: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. తీవ్ర అల్పపీడనం వాయవ్య దిశగా కదులుతోంది. దీంతో ఏపీకి మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉందని అధికారులు తెలిపారు. కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. వర్షం కారణంగా రహదారులు జలమయమయ్యాయి. రహదారులపై భారీగా వర్షం నీరు చేరడంతో పాదచారులు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు.

కుండపోత వర్షానికి పంట పొలాలు జలమయమయ్యాయి. వర్షం ధాటికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కాలువలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడుతున్నాయి. తీవ్ర అల్పపీడనం నెమ్మదిగా కదులుతుండటంతో తీరాన్ని చేరేవరకు లేదా మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. కాగా వర్షాల హెచ్చరికల నేపథ్యంలో రైతులు వరి కోతలను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. రెండు, మూడు రోజుల క్రితం కోసిన వరి పైరును కుప్పలు వేసుకుంటున్నారు.


అధికార యంత్రాంగం సన్నద్ధం

తీవ్ర అల్పపీడనం ప్రభావంతో అధిక వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమైంది.. కలెక్టరేట్‌తో పాటు అనకాపల్లి, నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయాల్లో హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధికారులను ఆదేశించారు. మండలస్థాయి అధికారులు ఎవరూ సెలవు పెట్టవద్దని, మండల కేంద్రాల్లోనే ఉండి, ప్రజలకు అవసరం మేరకు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. సముద్రంలో చేపల వేటను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్టు తెలిపారు. మత్స్యకారులు రానున్న రెండు రోజులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని కలెక్టర్‌ పేర్కొన్నారు.


చేపల వేటకు వెళ్లొద్దు

దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతంలో తాజాగా మరో అల్పపీడనం ఏర్పడిందని, ఇది మరో 48 గంటల్లో బలపడి సముద్రతీరం వైపు పశ్చిమ వాయువ్య దిశగా పయనించనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం కారణంగా ఉరుములు, మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా మరో బలమైన అల్పపీడనంగా రూపుదిద్దుకుంది. తీర ప్రాంతాల్లో మూడు రోజుల పాటు 35 నుండి 45 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.


అధికార యంత్రాంగం సన్నద్ధం

తీవ్ర అల్పపీడనం ప్రభావంతో అధిక వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. ప్రజలకు అవసరం మేరకు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. సముద్రంలో చేపల వేటను తాత్కాలికంగా నిషేధిస్తున్నట్టు తెలిపారు. మత్స్యకారులు రానున్న రెండు రోజులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Cabinet meeting: సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో క్యాబినెట్ సమావేశం..

Pawan Kalyan: ‘జల్‌జీవన్‌’లో జనం భాగస్వామ్యం

Kakinada: డమ్మీ పిస్టల్‌తో బెదిరించి.. బంగారం దోచేసి..!

Read Latest AP News and Telugu News

Updated Date - Dec 19 , 2024 | 09:43 AM