Share News

Minister Anitha: వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం

ABN , Publish Date - Jul 30 , 2024 | 03:22 PM

వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. విశాఖపట్నం నుంచి అన్ని జిల్లా ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో మహీంద్రా వాహన తయారీ సంస్థ పోలీసులను బ్లాక్‌లో పెట్టిందని గుర్తుచేశారు.

Minister Anitha: వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం
Minister Anitha

విశాఖపట్నం: వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైందని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత (Minister Anitha) ఆరోపించారు. విశాఖపట్నం నుంచి అన్ని జిల్లా ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో మహీంద్రా వాహన తయారీ సంస్థ పోలీసులను బ్లాక్‌లో పెట్టిందని గుర్తుచేశారు. పోలీసులకు వీక్ ఆఫ్ మీద పరిశీలిస్తామని అన్నారు. గత ప్రభుత్వంలో సరెండర్ సెలవులు ఇవ్వకుండా చేశారని ధ్వజమెత్తారు.

తమ ప్రభుత్వంలో సరెండర్ లివులు నిధులిస్తామని స్పష్టం చేశారు. మంగళవారం నాడు విశాఖ పోలీస్ కమిషనరేట్ హాల్లో మంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో చివరికి పోలీసుల భద్రత కోసం పక్క రాష్ట్రం నుంచి తుపాకులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. పోలీసు అకాడమీ లేని రాష్ట్ర ఏపీనే అని చెప్పారు. వైసీపీ హయాంలో అమరావతి కట్టడానికి నిధులిస్తే అమరావతిలో కట్టడం ఇష్టం లేక, కట్టడం మానేశారని అన్నారు. తమ ప్రభుత్వంలో సోషల్ మీడియా మీద దృష్టి పెడతామని మంత్రి అనిత పేర్కొన్నారు.


గంజాయి నివారణ, పోలీస్ సంక్షేమం మీద సమీక్ష నిర్వహించామని తెలిపారు పోలీసు విభాగం ఇన్వెస్టిగేషన్ టూల్ లేవని చెప్పారు. ఎక్కడ ఏం జరిగిన దాని వెనుక గంజాయి ఉందని తెలిపారు. ఈ ఐదు జిల్లాలో గంజాయి నియంత్రణకు కృషి చేస్తున్నామని వివరించారు. ఏజెన్సీలో గంజాయి పంట మీద సీసీ కెమెరాలతో నిఘా పెట్టామని అన్నారు. గంజాయి నివారణపై మంత్రివర్గ ఉప సంఘం నియమించినట్లు గుర్తుచేశారు. హోం మంత్రి, విద్యా శాఖ మంత్రి, గిరిజన శాఖ మంత్రి, అబ్కారీ మంత్రితో కలిసి ఈ ఉపసంఘం పనిచేస్తోందని వివరించారు. గంజాయి వివరాలు ఇస్తే వారికి బహుమతి ఇస్తామని ప్రకటించారు. అన్ని జిల్లాలో కూడా ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని మంత్రి అనిత వెల్లడించారు.


Also Read: Excise Department: హోలో గ్రామ్‌ పేరిట భారీ స్కామ్.. వెలుగులోకి వైసీపీ ఆగడాలు

మైనర్ బాలిక విషయంలో పోక్సో చట్టం అమలు అవుతోందని స్పష్టం చేశారు. విశాఖలో గంజాయి సేవించే వారికి అనుకూల ప్రాంతాలను గుర్తించి వాటి మీద పోలీసు దృష్టి పెట్టామని చెప్పారు. పోలీసు విభాగాలకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. డ్రగ్స్ తీసుకున్న వ్యక్తిని పరీక్షించి నిర్ధారించే పరికరాలు పోలీసు శాఖ వద్ద లేవని చెప్పారు. జగన్ ప్రభుత్వంలో అధునాతన పరికరాలు, వాహనాల నిర్వహణ సరిగా లేదని మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థ మళ్లీ పటిష్టంగా పని చేయాలని మంత్రి అనిత సూచించారు.


Also Read: Minister Nimmala: వారిపై త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటాం: మంత్రి నిమ్మల

సోషల్ మీడియాలో కొంతమంది హోంశాఖపై, వ్యక్తిగతంగా తనపై బురద జలుతున్నారని విమర్శించారు. వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. తమ ప్రభుత్వం వచ్చాక పోలీసు శాఖ పని తీరు మీద, వైసీపీ ప్రభుత్వ విఫల విధానాలపై త్వరలోనే పూర్తి సమాచారంతో మీడియా సమావేశం నిర్వహిస్తానని స్పష్టం చేశారు. పోలీసుల సంక్షేమంపై దృష్టి పెట్టామని అన్నారు. పోలీస్ అంటే భయం కాదు, భద్రత అని భరోసా రావాలన్నారు. తమ ప్రభుత్వ నేర నియంత్రణ చేస్తుందని తెలిపారు. మహిళా భద్రత మీద మరింత పటిష్టంగా పని చేయాలని సూచించారు. తిరిగి మళ్లీ గాడిలో పెట్టడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP News: గత ప్రభుత్వం గిరిజన సంక్షేమాన్ని నిర్వీర్యం చేసిందన్న అధికారులు

GVL: రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎందుకు నష్టపోయిందంటే..: జీవీఎల్

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 30 , 2024 | 04:26 PM