Share News

NARA LOKESH: సాక్షి ఇప్పటికైనా వాస్తవాలు చెప్పాలి

ABN , Publish Date - Oct 18 , 2024 | 07:15 PM

సాక్షి మీడియా ఇప్పటికైనా వాస్తవాలు ప్రజలకు చెప్పాలని కోరుతున్నామని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. సాక్షి పత్రిక 2019లో తన పైన తప్పుడు రాతలు రాశారని మండిపడ్డారు. రూ. 75 కోట్ల పరువు నష్టం దావా వేశానని అన్నారు. ప్రజలపై భారంపడేలా ప్రభుత్వ వాహనాలు.. ఎకామిడేషన్ గాని వినియోగించలేదని చెప్పారు.

NARA LOKESH: సాక్షి ఇప్పటికైనా వాస్తవాలు చెప్పాలి

విశాఖపట్నం: సాక్షి మీడియా ఇప్పటికైనా వాస్తవాలు ప్రజలకు చెప్పాలని కోరుతున్నామని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. సాక్షి పత్రిక 2019లో తన పైన తప్పుడు రాతలు రాశారని మండిపడ్డారు. రూ. 75 కోట్ల పరువు నష్టం దావా వేశానని అన్నారు. ప్రజలపై భారంపడేలా ప్రభుత్వ వాహనాలు.. ఎకామిడేషన్ గాని వినియోగించలేదని చెప్పారు. తమకు ప్రజలు అవకాశం ఇచ్చారని.. ప్రజల భవిష్యత్తు కోసం పనిచేస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. తాము ప్రజా అవసరాల కోసమే వాటిని వినియోగించామని.. తమ సొంతం అవసరాలకు వేటిని వినియోగించుకోలేదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.


తమ పోరాటం ఇకపైనా కొనసాగుతుందని.. న్యాయపోరాటంలో విజయం సాధిస్తామనే నమ్మకం తమకు ఉందని అన్నారు. సాక్షిలో ఇప్పటికీ మార్పు రాలేదన్నారు. గతంలో తమపైన చేసిన ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయారని అన్నారు. తప్పుడు రాతలు రాస్తే తాము వదిలిపెట్టమని హెచ్చరించారు. ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తే తాము కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు.. దుష్ప్రచారం చేయొద్దని.. అదే విజయవాడ వరదల సమయంలో జరిగిందని అన్నారు. చట్టాలు ఉల్లంఘించిన వారిపైన రెడ్ బుక్ పనిచేస్తుందని మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు.


‘విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణ జరగదు...

‘పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయని.. మాదొక పెద్ద కుటుంబం చిన్న చిన్న సమస్యలుంటే వాటిని మాట్లాడుకుని సరి చేసుకుంటాం. టీసీఎస్ గేమ్ చేంజర్‎గా మారుతుంది. వంద రోజుల్లోపు కంపెనీని ప్రారంభిస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కూటమి ప్రభుత్వం ఉన్నంతవరకు ప్రవేటికరణ జరగదు. రూ. 500 కోట్లతో ఒక వ్యక్తి ప్యాలెస్ కట్టుకున్నారు .. దానిని ఏం చేయమంటారు చెప్పండి.. హైకోర్టు బెంచ్ కర్నూల్‎లో ఏర్పాటు చేస్తామని గతంలో చెప్పాం అది చేస్తాం. విశాఖపట్నంలో ప్రతిపాదన మొదటిసారి వచ్చింది. అన్ని శాఖలను స్టీమ్ లైన్ చేయడానికి ఎకనామిక్ బోర్డ్ ఏర్పాటు చేస్తున్నాం.. రీజనల్ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేస్తాం... మేము ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తాం.. మాకు కొంత సమయం ఇవ్వాలి’’ అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

AP News: భారీ వర్షాలు.. ప్రాజెక్టులకు జలకళ

Lokesh: ఆ ఖర్చును నా ఖాతాలో వేస్తారా: నారా లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 18 , 2024 | 07:21 PM