Share News

CM Chandrababu: విజయనగరం జిల్లా గొర్లలో వరుస మరణాలపై సమగ్ర విచారణ

ABN , Publish Date - Oct 20 , 2024 | 04:40 PM

గొర్లలో డయేరియాతో 8 మంది చనిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ(ఆదివారం) ఏపీ సచివాలయంలో మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్న పరిస్థితిని, బాధిత ప్రజలకు అందుతున్న వైద్య సాయాన్ని అధికారుల ద్వారా తెలుసుకున్నారు.

CM Chandrababu: విజయనగరం జిల్లా గొర్లలో వరుస మరణాలపై సమగ్ర విచారణ

హైదారాబాద్/అమరావతి: విజయనగరం జిల్లా గొర్లలో వరసగా మరణాలు సంభవించడంపై సీనియర్ ఐఏఎస్ అధికారితో విచారణ జరిపిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గొర్లలో ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సమీక్ష చేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గొర్లలో డయేరియాతో 8 మంది చనిపోయిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ(ఆదివారం) ఏపీ సచివాలయంలో మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా అధికారులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్న పరిస్థితిని, బాధిత ప్రజలకు అందుతున్న వైద్య సాయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ మరణాలు ఎలా సంభవించాయనే అనే అంశంపై వైద్య శాఖ అధికారులతో మాట్లాడారు. గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, సురక్షిత తాగునీరు అందజేస్తున్నామని జిల్లా అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకి వెల్లడించారు.


అసలు ఘటనకు కారణాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగా సీనియర్ ఐఏఎస్ అధికారి కె. విజయానంద్‌తో ఈ ఘటనపై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మరణాలకు అసలు కారణం ఏంటి, ఆయా ప్రభుత్వ శాఖల పరంగా ఉన్న సమస్యలు ఏంటి అనే అంశాలను తెలుసుకోవడానికి సమగ్ర విచారణ జరపాలని సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు.


ఆ ప్రాంతంలో నీటిని ఎప్పటికప్పుడు పరీక్షలకు పంపాలని....సమస్య పరిష్కారం అయ్యేవరకు తాగునీరు సరఫరా చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. వైద్య శిబిరాలు కొనసాగించాలని సీఎం సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్, ఆర్ డబ్ల్యూఎస్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.ప్రజలకు ధైర్యం చెప్పి.. సమస్య పరిష్కారం అయ్యేవరకు వారికి అండగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.


ఆందోళన వద్దు.. సహకారం అందిస్తాం: మంత్రి కొండపల్లి

గుర్లలో తాగునీరు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఆదేశించారు. అసలు డయేరియా దేనికారణంగా ప్రబలిందో అర్థం కావడంలేదని అధికారులు తెలిపారు. పూర్తిగా వివరాలు సేకరించి ప్రజలు కోలుకునేలా చూడాలని మంత్రి ఆదేశించారు. బాధితులు భయపడాల్సిన పనిలేదని, భయం ఎక్కువ ఉంటే బీపీ, షుగర్‌ పెరుగుతాయని అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ, సహకారాలు అందిస్తుందని తెలిపారు. మెరుగైన వైద్యం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.


ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకు ఇవ్వలేదు

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ బకాయిలు ఎందుకు ఇవ్వలేదు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ అసిస్టెంట్స్‌కు వేతనాలు ఇవ్వలేదని.. గతంలో వైసీపీ చేసిన బకాయిలు ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై నెపం నెట్టుతారా.. అని ప్రశ్నించారు. ప్రజలు భయాందోళన చెందేలా వైసీపీ నేతల వ్యాఖ్యలున్నాయని మంత్రి కొండపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.


ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు: కిమిడి నాగార్జున

విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున మాట్లాడుతూ.. జిల్లాలో డయేరియా కేసుల విషయంలో ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేలా వైసీపీ నేతల వ్యాఖ్యలు ఉన్నాయని, తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఐదేళ్ల వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలు కూలిపోయాయని.. ఐదేళ్లలో ఆరోగ్య శ్రీ బిల్లులు చెల్లించారా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఇంత వరకు ఎందుకు గ్రామాన్ని సందర్శించలేదని కిమిడి నాగార్జున నిలదీశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Amaravati: అతనికి మరణ శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి.. బద్వేల్ ఘటనపై సీఎం చంద్రబాబు

Minister Kondapalli: ప్రజలు భయాందోళన చెందేలా ప్రతిపక్షాల వ్యాఖ్యలు..

AP News: ఏబీఎన్‌తో మంత్రి ఆనం ఆసక్తికర వ్యాఖ్యలు..

For more AP News and Telugu News

Updated Date - Oct 20 , 2024 | 04:55 PM