Balaraju: జనసేన ఎమ్మెల్యే సడెన్ ఎంట్రీ.. దొరికిపోయిన ఉద్యోగి.. ఇంతకీ ఏం జరిగిందంటే..!?
ABN , Publish Date - Jul 30 , 2024 | 12:15 PM
Andhrapradesh: ఆయనో ప్రజాప్రతినిధి.. అయినా సరే సామాన్యుడిలా అవతారం ఎత్తాడు..! అసలేం జరుగుతోందని తెలుసుకోవడానికి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లగా.. అక్కడ ఓ ఉద్యోగి చేస్తున్న పని పట్ల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పని సమయాల్లో ఇంతటి నిర్లక్షమా అంటూ విరుచుకుపడ్డారు. ఓ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అలా వస్తారని ఊహించి ఉండరు అక్కడి సిబ్బంది.
అమరావతి, జూలై 30: ప్రజాప్రతినిధులు అంటే ప్రజాసేవకులు అని అర్థం..! బాధ్యతాయుతమైన పదవికి వన్నె తెచ్చేలా ప్రవర్తిస్తుంటారు..! పెద్ద పదవి ఉన్నప్పటికీ సామాన్యులుగా చలామణి అవుతూ ప్రజలతో మమేకమవుతుంటారు. అలాగే తమకిచ్చిన బాధ్యతలను శాయశక్తులా పూర్తి చేసేందుకు యత్నింటారు. తమ తమ నియోజవర్గాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ అక్కడి పరిస్థితులను తెలుసుకుంటుంటారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఎమ్మెల్యే కూడా అతి సామన్యుడిగా వెళ్లి.. పనివేళలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ ఉద్యోగి పట్ల ఎలాంటి చర్యలు తీసుకోన్నారో చూసేద్దాం రండి..!
AP News: పడవ ప్రమాదంలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
ఇదీ అసలు కథ..!
ఆయనో ప్రజాప్రతినిధి.. అయినా సరే సామాన్యుడిలా అవతారం ఎత్తాడు..! అసలేం జరుగుతోందని తెలుసుకోవడానికి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లగా.. అక్కడ ఓ ఉద్యోగి చేస్తున్న పని పట్ల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పని సమయాల్లో ఇంతటి నిర్లక్షమా అంటూ విరుచుకుపడ్డారు. ఓ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అలా వస్తారని ఊహించి ఉండరు అక్కడి సిబ్బంది. ఆకస్మికంగా రావడంతో వారి బండారం బయటపడింది. ఇంతకీ సామాన్యుడిలా ప్రభుత్వ కార్యాలనికి వెళ్లింది ఎవరో కాదు పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.
Hyderabad: ఇంటి పత్రాలు రెడీగా ఉంచుకోండి...
ఎమ్మెల్యే దెబ్బకు...!
కేటీఆర్ పురం ఐటీడీఏ కార్యాలయానికి జనసేన (Janasena) ఎమ్మెల్యే బాలరాజు ఓ సామాన్యుడిలా వెళ్లారు. మొహానికి మాస్కు పెట్టుకుని ఆఫీసులో తనిఖీకి వెళ్లారు. అయితే ఆ సమయంలో ఓ ఉద్యోగి.. పనిని పక్కన పెట్టేసి తాపీగా ఫోన్‌లో పబ్జి గేమ్ ఆడుకుంటూ ఎమ్మెల్యే కళ్లకు చిక్కాడు. సదరు ఉద్యోగి సాయికుమార్‌గా తెలుస్తోంది. ఆ ఉద్యోగి వెనకాలే ఉండి చాలా సేపు అతడు చేస్తున్న పనిని ఎమ్మెల్యే గమనించారు. పనివేళల్లో పబ్జీ గేమ్ ఆడుతున్న ఉద్యోగిని ఎమ్మెల్యే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అంతేకాకుండా అతడిని సస్పెండ్ చేయాలని అధికారులకు ఎమ్మెల్యే బాలరాజు ఆదేశాలిచ్చారు. మరోవైపు ఈ మొత్తం వ్యవహారాన్ని ఎమ్మెల్యే అనుచురులు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో అది కాస్త ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి...
TPCC Chief: కొలిక్కొచ్చిన టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ.. ప్రకటన ఎప్పుడంటే..!?
AP Tourism: పర్యాటకులకు శుభవార్త.. ఆ జలపాతాల సందర్శనకు అనుమతి..
Read Latest AP News And Telugu News