Share News

JNTU: జేఎన్‎టీయూలో బీఎఫ్ఎస్ఐ మైనర్‌ డిగ్రీ..

ABN , Publish Date - Jul 30 , 2024 | 12:08 PM

ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లను ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా మలచడంలో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కాలేజీ(JNTU Engineering College) మరో ముందడుగు వేసింది. ప్రత్యేకించి బ్యాంకింగ్‌ రంగానికి ఇంజనీరింగ్‌ నిపుణులను అందించేందుకు ఈ ఏడాది నుంచి బీటెక్‌తో పాటు ఒక మైనర్‌డిగ్రీని ప్రవేశపెడుతోంది.

JNTU: జేఎన్‎టీయూలో బీఎఫ్ఎస్ఐ మైనర్‌ డిగ్రీ..

- బీటెక్‌తో పాటు చదివే చాన్స్‌

- ఈ ఏడాది నుంచే క్లాసులు

హైదరాబాద్‌ సిటీ: ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లను ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా మలచడంలో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కాలేజీ(JNTU Engineering College) మరో ముందడుగు వేసింది. ప్రత్యేకించి బ్యాంకింగ్‌ రంగానికి ఇంజనీరింగ్‌ నిపుణులను అందించేందుకు ఈ ఏడాది నుంచి బీటెక్‌తో పాటు ఒక మైనర్‌డిగ్రీని ప్రవేశపెడుతోంది. ఈ మేరకు బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌(బీఎఫ్ఎస్ఐ) సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది.

ఇదికూడా చదవండి: Dengue fever: డెంగీ జ్వరం.. జరభద్రం


5 వేలమందికి ప్లేస్‌మెంట్‌ చాన్స్‌...

బ్యాంకింగ్‌ రంగంలో సుమారు 5 వేలమంది ఇంజినీరింగ్‌, మరో 5వేలమంది నాన్‌ ఇంజనీరింగ్‌ నిపుణుల అవసరముందని బీఎఫ్‌ఎస్ఐ ప్రతినిధులు జేఎన్‌టీయూ(JNTU) అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ తేడాను వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు బ్యాంకింగ్‌ అవసరాలకు అనుగుణంగా గ్రాడ్యుయేట్లకు మైనర్‌ డిగ్రీని ఆఫర్‌ చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు(Software employees) లభించే సగటు ప్యాకేజీ కంటే రెండుమూడు రెట్లు అధిక వేతనం ఈ కోర్సు పూర్తి చేసిన వారికి లభించే అవకాశం ఉందని బీఎఫ్‌ఎస్ఐ ప్రతినిధులు వెల్లడించారు.

city5.2.jpg


కాగా, ఈ కోర్సు పూర్తికి సుమారు రూ.40 వేల వరకు ఖర్చవుతుందని, మొదటి ఏడాది బీఎ్‌సఎ్‌ఫఐ ఉచితంగా ఆఫర్‌ చేసినట్లు జేఎన్టీయూ ఇంజినీరింగ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నర్సింహారెడ్డి తెలిపారు. బీటెక్‌ రెండో, మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మైనర్‌ డిగ్రీని ఆఫర్‌ చేస్తామని, త్వరలో ప్రవేశ పరీక్ష నిర్వహించి కోర్సును ప్రారంభిస్తామని పేర్కొన్నారు.


ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 30 , 2024 | 12:08 PM