Share News

Nimmala: నాడు - నేడు పథకంతో దోపిడీ.. జగన్‌పై మంత్రి నిమ్మల ఫైర్

ABN , Publish Date - Jul 06 , 2024 | 04:19 PM

Andhrapradesh: తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా విద్యకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శనివారం నాడు తాను చదివిన పూర్వ పాఠశాలను సందర్శించిన మంత్రి.. విద్యార్థులకు కిట్స్ అందజేశారు. అనంతరం నిమ్మల మీడియాతో మాట్లాడుతూ.. నాడు నేడు పథకం పేరుతో తాత్కాలిక రంగులు వేసి, హంగులు చేసి నిధులు దోపిడీ చేశారని మండిపడ్డారు.

Nimmala: నాడు - నేడు పథకంతో దోపిడీ.. జగన్‌పై మంత్రి నిమ్మల ఫైర్
Minister Nimmala Ramanaidu

పశ్చిమగోదావరి, జూలై 6: తెలుగుదేశం ప్రభుత్వం (Telugudesam Government) ద్వారా విద్యకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) అన్నారు. శనివారం నాడు తాను చదివిన పూర్వ పాఠశాలను సందర్శించిన మంత్రి.. విద్యార్థులకు కిట్స్ అందజేశారు. అనంతరం నిమ్మల మీడియాతో మాట్లాడుతూ.. నాడు నేడు పథకం పేరుతో తాత్కాలిక రంగులు వేసి, హంగులు చేసి నిధులు దోపిడీ చేశారని మండిపడ్డారు.

CMs Meet: సీఎంల మీటింగ్‌పై సర్వత్రా ఉత్కంఠ..!!


జగన్ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ఆరు లక్షల మంది విద్యార్థులు ప్రాథమిక విద్యకు దూరం అయ్యారన్నారు. విద్యతో పాటు ఎన్డీయే ప్రభుత్వం అందరికీ ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తుందని తెలిపారు. జగన్ ఐదేళ్ల పాలనలో రూ.12.50 లక్షల అప్పు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో రూ. 40 వేల కోట్ల దోపిడీ జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు గుప్పించారు.


ఇవి కూడా చదవండి...

Viral Video: పోట్లాడుకుంటూ పట్టాలపైకి వెళ్లిన ఎద్దులు.. అప్పుడే దూసుకొచ్చిన రైలు.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..

Rohit: కోట్లలో ఆస్తులు.. ఆడి కారు.. విమానంలో టూర్లు..

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 06 , 2024 | 04:24 PM