AP Election Results 2024: ఎటు చూసినా ఎగిరిన పసుపు జెండా!
ABN , First Publish Date - Jun 04 , 2024 | 05:05 AM
అవును.. అనుకున్నట్లే జరిగింది..! ఏపీ ప్రజలు కూటమికే ఓటేశారు.. కనివినీ ఎరుగని రీతిలో సీట్లు కట్టబెట్టి అధికారమిచ్చారు. పేరుగాంచిన ప్రాంతీయ, జాతీయ మీడియా.. సర్వే సంస్థలు చేసిన సర్వేలన్నీ అక్షరాలా నిజమయ్యాయి. ఊహించిన దానికంటే ఎక్కువే సీట్లు దక్కాయని టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నాయి. ఇక ఎక్కడా చూసినా పసుపు జెండాలే రెపరెపలాడుతున్నాయి.
Live News & Update
-
2024-08-11T16:19:19+05:30
జగన్ మార్చిన నియోజకవర్గాల అభ్యర్థులంతా ఓటమి
వైసీపీ ముఖ్య నేతల వారసులంతా ఓటమి
చంద్రగిరిలో చెవిరెడ్డి కొడుకు మోహిత్‌రెడ్డి ఓటమి
తిరుపతిలో భూమన కుమారుడు అభినయ్‌రెడ్డి ఓటమి
బందర్‌లో పేర్నినాని కొడుకు కృష్ణమూర్తి ఓటమి
జీడీ నెల్లూరులో నారాయణస్వామి కూతురు కృపాలక్ష్మి ఓటమి
కూటమి దెబ్బకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా మంత్రులంతా ఓటమి పాలు.
-
2024-08-11T16:19:18+05:30
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల సంబరాలు...
-
2024-08-11T16:19:17+05:30
కౌంటింగ్ సెంటర్ల నుంచి బయటకు వెళ్లిపోయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ
-
2024-08-11T16:19:16+05:30
వినుకొండలో టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు 611ఓట్ల అధిక్యం
అనంతపురం అర్బన్‌లో టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ 6568 ఓట్ల అధిక్యం
పీలేరులో 5,840 ఓట్ల లీడ్‌లో టీడీపీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి
-
2024-08-11T16:19:15+05:30
విజయనగరం అసెంబ్లీ స్థానంలో తొలి రౌండ్ ముగిసేసరికి టిడిపి అభ్యర్ధి అధితీ గజపతి 1800 ఓట్ల ఆధిక్యం
అద్దంకిలో మొదటి రౌండ్ లో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ 1,838 ఓట్ల ఆధిక్యం
రాజానగరంలో జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ 1255 ఓట్లతో అధిక్యం
-
2024-08-11T16:19:14+05:30
సత్తెనపల్లిలో టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ 860 ఓట్ల అధిక్యం
అనకాపల్లి లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి సిఎం రమేష్ కి 9,258 ఓట్ల ఆధిక్యత
శ్రీకాకుళం లోక్‌సభ స్థానంలో టీడీపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు 7,928 ఓట్ల ఆధిక్యం
-
2024-08-11T16:19:13+05:30
ఉదయం 5గంటలకే కూటమి కౌంటింగ్ ఏజెంట్లతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్న పురంధరేశ్వరి, నాదెండ్ల మనోహర్, 3 పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు
కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలి
లెక్కింపులో ఏ అనుమానం ఉన్నా వెంటనే ఆర్వోకు ఫిర్యాదు చేయాలి
ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని నిలబడ్డాం
కూటమి కౌంటింగ్ ఏజెంట్లు సంయమనం కోల్పోవద్దు.. నిబంధనలకు పట్టుబట్టాలి
అన్ని రౌండ్లు పూర్తయ్యే వరకు ఏజెంట్లు ఎవరూ బయటకు రావొద్దు
కంట్రోల్ యూనిట్ నెంబర్ ప్రకారం సీల్‌ను ప్రతి ఏజెంట్ సరి చూసుకోవాలి
ప్రతి ఒక్కరూ 17-సీ ఫాం దగ్గర ఉంచుకుని పోలైన ఓట్లను...కౌంటింగ్ లో వచ్చిన ఓట్లను సరి చేసుకోవాలి
నిబంధనలు అమలయ్యేలా చూడటంలో ఎవరూ రాజీపడొద్దు
ప్రతి ఓటూ కీలకమే అనేది ఏజెంట్లు గుర్తుంచుకుని లెక్కింపు ప్రక్రియలో పాల్గొనాలి
-
2024-06-04T22:45:00+05:30
జీవో 48జారీ..
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అతని మంత్రివర్గ సహచరులు రాజీనామా నేపథ్యంలో జీవో ఎంఎస్ నెంబర్ 48ని ఏపీ గవర్నర్ అబ్ధుల్ నజీర్ జారీ చేశారు.
గవర్నర్ పేరుతో ఉత్తర్వులు ఇచ్చిన సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి
ఈ ఉత్తర్వులు కనుగుణంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు అతని మంత్రివర్గ సహచరులను నూతన మంత్రివర్గం ఏర్పడే వరకు ఆపధర్మంగా కొనసాగాలని నోటిఫికేషన్ జారీ
ఈ మేరకు జీవో ఎంఎస్ నెంబర్ 49ను జారీ చేసిన సీస్ జవహర్ రెడ్డి
-
2024-06-04T22:36:00+05:30
అంగన్వాడీ టీచర్ గెలిచింది
అల్లూరి జిల్లా: జిల్లాలోని రంపచోడవరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మిర్యాల శిరీషాదేవి గెలుపు ఏపీలో ఆసక్తిగా మారింది. వైఎస్సార్సీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మిపై 9,139 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన ఆమె ఈ నియోజకవర్గంలో 15 ఏళ్ల తర్వాత టీడీపీ జెండాను ఎగురవేశారు. గతంలో అంగన్వాడీ టీచర్‌గా ఉన్న శిరీష ఇప్పుడు ఎమ్మెల్యేగా ఏపీ అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.
-
2024-06-04T22:34:00+05:30
చంద్రబాబు, పవన్‌కు కేసీఆర్ శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు.
హరీశ్‌రావు అభినందనలు
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు చంద్రబాబు, పవన్‌కు అభినందనలు తెలిపారు.
-
2024-06-04T20:42:00+05:30
రాష్ట్రంలో నాది అత్యధిక మెజార్టీ: నారా లోకేష్
మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా లోకేష్ 91413 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడారు.
దారి తప్పిన రాష్ట్రాన్ని దారిలో పెడతాం
ఉద్యోగాలు లేని రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించేందుకు కృషి
ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిలో పెడతాం
1999 తర్వాత మంగళగిరిలో టీడీపీ గెలవలేదు
కానీ ఈసారి రికార్డు మెజార్టీతో విజయం సాధించాను
నాకు తెలిసి రాష్ట్రంలో నాది అత్యధిక మెజార్టీ
మంగళగిరిలో గెలిచి పవన్ కళ్యాణ్‌కు కానుకగా ఇస్తానని చెప్పాను
మంగళగిరి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తా
మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా నిలబెడతా
గత ఐదేళ్లుగా చాలా సంక్షేమ పథకాలు అమలు చేశాను
-
2024-06-04T20:31:00+05:30
మోదీ ట్వీట్‌పై చంద్రబాబు ఏమన్నారంటే..
ప్రధాని మోదీ ట్వీట్‌పై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు
మోదీకి కృతఙతలు తెలిపిన చంద్రబాబు.
ప్రధానిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతోన్న మోదీకి ఏపీ ప్రజల తరపున అభినందనలు.
ఏపీ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చి ఆశీర్వదించారు.
కూటమి పట్ల ప్రజలకున్న విశ్వాసం చూపారు.
ఏపీ అభివృద్ధి కూటమితోనే సాధ్యమని నమ్మారు.
ఏపీ పునర్ నిర్మాణం, పునర్ వైభవానికి కలిసి పని చేద్దాం.
మోదీకి కృతఙతలు తెలిపిన చంద్రబాబు
-
2024-06-04T20:24:00+05:30
పుంగనూరు కౌంటింగ్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ
4 ఈవీఎంలకు సీలింగ్ లేకపోవడంతో కౌంటింగ్ కు అభ్యంతరం తెలిపిన టిడిపి అభ్యర్థి చెల్లా రామచంద్రారెడ్డి.
గంటన్నర పాటు ఆగిపోయిన కౌంటింగ్.
కొద్దిసేపటి క్రితమే మళ్లీ మొదలైన కౌంటింగ్.
కౌంటింగ్ వాస్తవాలపై ఇంతవరకు క్లారిటీ ఇవ్వని అధికారులు.
టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య నువ్వా నేనా రీతిలో ప్రతి రౌండ్‌లో ఫలితాలు వెల్లడి
-
2024-06-04T20:00:00+05:30
భారతీయ జనతాపార్టీ అభ్యర్థులు గెలుపు వివరాలు...
పార్లమెంటు నియోజకవర్గాలు..
1.అనకాపల్లి...సీఎం రమేష్... మెజార్టీ..+285529
2.రాజమహేంద్రవరం..శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి... మెజార్టీ..+239139
3.నరసాపురం..భూపతిరాజు శ్రీ నివాస్ వర్మ... మెజార్టీ+276812
అసెంబ్లీ...
1.ఎచ్చెర్ల... ఎన్ ఈశ్వర రావు... మెజార్టీ..+2824
2.విశాఖ నార్త్...పెన్మత్స్ విష్ణు కుమార్ రాజు.. మెజార్టీ+46656
3.కైకులూరు..కామినేని శ్రీనివాస్.. మెజార్టీ..+45273
4.విజయవాడ వెస్ట్.. సుజన చౌదరి... మెజార్టీ +47032
5.జమ్మలమడుగు.. సి ఆదినారాయణ రెడ్డి... మెజార్టీ..+17191
6.ధర్మవరం...సత్యకుమార్...మెజార్టీ..+3734
7.అనపర్తి.. నల్లిమిల్లి రామకృష్ణా రెడ్డి.. మెజార్టీ..+20850
8.ఆధోని...డాక్టర్ పార్థసారథి.. మెజార్టీ..+10288
-
2024-06-04T19:40:00+05:30
ఏపీ దశ - దిశ మార్చగలిగిన శక్తివంతుడు చంద్రబాబు
హిందూపురం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్ చేరుకున్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ....
గన్నవరం ఎయిర్ పోర్ట్‌లో నందమూరి బాలకృష్ణకు ఘన స్వాగతం పలికిన అభిమానులు,మహిళలు..
ప్రజా వ్యవస్థలో ప్రజలే న్యాయ నిర్ణీతలు
ఎవరికి పట్టం కట్టాలో ఎవరిని తిరస్కరించాలో ప్రజలకు తెలుసు
ఆంధ్ర రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కి వెళ్లింది
ఆంధ్ర రాష్ట్ర దశ - దిశ మార్చగలిగిన శక్తివంతుడు చంద్రబాబు
బీజేపీ ,జనసేన పొత్తుతో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం
తమ్ముడు పవన్ కళ్యాణ్ నా హృదయపూర్వక కృతజ్ఞతలు
-
2024-06-04T19:30:00+05:30
జగన్‌తో నాకు వ్యక్తిగత కక్ష లేదు: పవన్ కళ్యాణ్
ప్రజలకు జవాబుదారితనం చెప్పే ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడుతుంది
జగన్‌తో నాకు వ్యక్తిగత కక్ష లేదు
కక్ష సాధింపు కోసం మనకు జనం అధికారం ఇవ్వలేదు
5కోట్ల ఆంధ్రుల హక్కులకు న్యాయం చేయాలి
నా జీవితం ఎప్పుడు దెబ్బలు తినడమే
సినిమా పరంగా తొలిప్రేమ విజయం
రాజకీయాల్లో ఈ విజయం.. ప్రజల ఆకాంక్షతోనే..
మార్పు కావాలి.... పాలన మారాలని ప్రజలు కోరుకుంటున్నారు
ఉద్యోగులకు అండగా ఉంటాం
నాకు డబ్బు ముఖ్యం కాదు
నాకు కులం, మతం లేదు
కష్టాల్లో ఉండే వారికి భుజం కలపడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను
ఏపీ భవిష్యత్‌కి బలమైన పునాది వేసే సమయం ఇది
మహిళలకు, రైతులకు అండగా ఉండాలి
పాత పింఛన్ విధానం... దానికి సమానంగా కొత్త విధానం తీసుకొస్తాం
మెగా డీఎస్సీ విడుదల చేస్తాం
యువత ఈ ఇదేళ్లలో ననిగిపోయారు
ఆడ బిడ్డలు, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడ్డారు
రోడ్లు దారుణంగా తయారయ్యాయి
ప్రజలకు న్యాయం చెయ్యడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను
ఈ గెలుపుతో నాకు బాధ్యత పెంచింది
నాకు భయం వేస్తుంది... అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు
జనంకి ఎలా న్యాయం చేయాలనే నేను ఆలోచిస్తున్నాను
పిఠాపురం ప్రజలందరికీ ధన్యవాదములు
మహిళలు, యువత, అందరికీ కృతజ్ఞతలు
ఆకాశం అంత విజయం ఇచ్చారు
బాధ్యతగా పని చేస్తాం
ప్రభుత్వం ఎలా ఉండాలి, అధికార యంత్రాంగం ఎలా ఉండాలో మీకు చూపిస్తాను
-
2024-06-04T18:56:00+05:30
చంద్రబాబుకు భారీ మెజార్టీ
కుప్పంలో 48,154 ఓట్ల మెజర్టీతో చంద్రబాబు విజయం.
వైసీపీ అభ్యర్థి భరత్ పై గెలుపొందిన చంద్రబాబు
2019 ఎన్నికల కంటే 18 వేల పైచిలుకు ఓట్లు మెజార్టీ పెరుగుదల
-
2024-06-04T18:40:00+05:30
జనసేన కార్యాలయానికి చంద్రబాబు
పవన్‌ను అభినందించడానికి జనసేన కార్యాలయానికి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు
సాదరంగా స్వాగతం పలికిన పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్
సతీమణి, కుమారుడిని చంద్రబాబుకు పరిచయం చేసిన పవన్ కళ్యాణ్
భవిష్యత్తు కార్యాచరణపై చర్చించుకుంటున్న ఇరు పార్టీల అధినేతలు
కూటమి అఖండ విజయంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణుల్లో సంబరాలు
మరికాసేపట్లో పవన్‌తో చంద్రబాబు భేటీ
జనసేన కార్యాలయానికి తొలిసారిగా వచ్చిన చంద్రబాబు
కూటమి విజయంపై సంయుక్తంగా స్పందించే అవకాశం
-
2024-06-04T17:55:00+05:30
టీడీపీ నుంచి హ్యాట్రిక్ వీరులు
నందమూరి బాలకృష్ణ, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, చినరాజప్ప, అనగాని సత్యప్రసాద్, ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవి, గద్దె రామ్మోహన్, గణబాబు, వెలగపూడి రామకృష్ణ, బెందాళం అశోక్
-
2024-06-04T17:45:00+05:30
మంచి చేసినా ఓటమి
ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి
ప్రజలు బాగుండాలని మంచి చేశాం
మంచి చేసినా ఓటమిపాలయ్యాం
ఇలాంటి ఫలితాలు వస్తాయని ఊహించలేదు
మహిళలకు సంక్షేమ ఫలాలు అందించాం..
వారి ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదు
ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయి
53 లక్షల మంది తల్లులకు మంచి చేశాం
అక్క చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలియదు
26 లక్షల మంది అవ్వతాతలు, వృద్ధులు, వికలాంగులకు..
గతంలో ఎప్పుడూ జరగని విధంగా మంచి చేశ
మా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన..
చాలీచలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేశాం
అవ్వాతాతల ప్రేమ ఏమైందో తెలియదు?
కోటి ఐదు లక్షల మంది అక్క చెల్లెమ్మలకు మంచి చేశాం
వాళ్ల కష్టాల్ని మా కష్టాలుగా భావించాం
వాళ్లకు అండగా నిలిచాం: జగన్
కోటి ఐదు లక్షల మంది అక్క చెల్లెమ్మల..
ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియదు?
చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం
ఆ పిల్లలు, ఆ తల్లుల అభిమానం ఏమైందో తెలియదు’’ అని జగన్ పేర్కొన్నారు.
-
2024-06-04T17:00:00+05:30
చంద్రబాబుకు మెగాస్టార్ శుభాకాంక్షలు
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయంపై సినీనటుడు మెగాస్టార్ చిరంజివీ ట్విట్టర్(ఎక్స్) వేదికగా ట్వీట్ చేశారు. ‘‘ప్రియమైన చంద్రబాబు నాయుడుగారికి , చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న మీకు ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు. ఈ మహత్తర విజయం, మీ మీద ప్రజలకు ఉన్న నమ్మకానికి, మీ నాయకత్వ పటిమకు, రాష్ట్రానికి గత వైభవం తిరిగి తేగలిగిన మీ దక్షతకు నిదర్శనం. రాజకీయ దురంధరులైన మీ మీద, పవన్ కల్యాణ్, నరేంద్ర మోడీ గారి మీద ప్రజలు కనబరచిన విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకొని, రాజధాని లేని, గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను’’ అని చిరంజివీ పేర్కొన్నారు.
పవన్‌కు చిరంజివీ అభినందనలు
2024 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గెలిచారని తెలియగానే, చిత్ర పరిశ్రమ నుంచి ఎంతోమంది తమ సంతోషాన్ని, శుభాకాంక్షలను పవన్ కళ్యాణ్‌కి 'ఎక్స్' ద్వారా తెలియచేస్తున్నారు. ఎంతమంది తనకి శుభాకాంక్షలు చెప్పినా, తన అన్నయ్య చిరంజీవి.. కళ్యాణ్‌ని ప్రశంసించటం ఒక అనుభూతి, అదొక మరపురాని ఘట్టం.
"డియర్ కళ్యాణ్ బాబు..ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా ఉంది. నువ్వు Game Changer వి మాత్రమే కాదు, Man of the match వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది !!నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే! ఈ అద్భుతమైన ప్రజాతీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వు ఏర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నీవు ప్రారంభించే ..ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను." అని పోస్ట్ చేశారు చిరంజీవి.
-
2024-06-04T16:55:00+05:30
ఎన్నికల ఫలితాలపై సీపీఐ నారాయణ హాట్ కామెంట్స్
దాదాపు దేశం మొత్తం ఎదురుచూస్తున్న ఎన్నికల ఫలితాలపై సీపీఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు.డాక్టర్. కే. నారాయణ హాట్ కామెంట్స్ చేశారు.
దేశం మొత్తం మీద ప్రధానమంత్రి నరేంద్రమోదీ హవా కొనసాగుతుందని 400పై చిలుకు సీట్లు సాధిస్తామని ధీమాతో ఉన్నవారికి దేశ ప్రజలు గట్టి గుణపాటాన్ని నేర్పించారు.
ఒకవేళ పొరపాటున ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, ఎన్డీఏ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూటమి కళ్లెం వేసేంత స్థాయిలో సీట్లు సాధించడం ఆనందదాయకం.
ఇది ఒక రకంగా ఇండియా కూటమి నైతిక విజయం, ఎన్డీఏ కూటమి అపజయంగా నేను భావిస్తున్నా.
అలాగే ఆంధ్ర రాష్ట్ర ఎన్నికలపై మాట్లాడిన సీపీఐ నారాయణ దేశంలో అత్యధికంగా సంక్షేమ పథకాలు మా ప్రభుత్వమే అందిస్తుందన్న విర్రవీగిన వైసీపీకి గతంలో తెలుగుదేశం పార్టీకి వచ్చిన 23 సీట్ల కన్నా తక్కువ సంఖ్యలో 16 సీట్లకే పరిమిత కావడం జగన్మోహన్ రెడ్డి నియంత్రత్వ పోకడ, అహంకార వైఖరికి నిదర్శనం అన్నారు.
151 సీట్లు అందించిన రాష్ట్ర ప్రజల మేలు కన్నా కక్ష సాధింపు రాజకీయాల మీద దృష్టి సారించి రాజకీయ వ్యవస్థని అస్తవ్యస్తం చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు.
ఈ ఎన్నికల్లో గెలిచిన తెలుగుదేశం పార్టీకి తాను అభినందనలు తెలుపుతున్నట్లు, అలాగే ఈ రాజకీయ వ్యవహారంలో క్రిస్టల్ పాత్రవహించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు అభినందనలు .
ప్రభుత్వం ఏర్పాటు చేశాక గతంలో చేసిన తప్పిదాలు చేయకుండా అలాగే జగన్మోహన్ రెడ్డి లాగా వ్యవహరించకుండా ప్రజా సమస్యల మీద అమరావతి రాజధాని , పోలవరం, సాధనలో ముఖ్యపాత్ర వహింస్తారని అశీసిస్తున్నాను .
తెలంగాణ ఎన్నికల ఫలితాలుపై కూడా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తమిళనాడు తరహాలో డీఎంకే పార్టీల మిగతా అన్ని రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని తగు వ్యూహరచనలతో ముందుకెళ్లి ఉంటే తమిళనాడు తరహాలోనే తెలంగాణలో కూడా విజయం సాధించేదని, కావున ఇకనైనా కూడా కాంగ్రెస్ పార్టీ తమ సొంత నిర్ణయాలు కన్నా కూటమి పార్టీల అభిప్రాయాలను సేకరించి వారిని కూడా కలిపి ఎన్నికలకు వెళ్లి ఉంటే మరిన్ని విజయాలు కాంగ్రెస్ సాధించి ఉండేదాన్ని నా అభిప్రాయం అని సీపీఐ నారాయణ తెలిపారు
-
2024-06-04T16:53:00+05:30
ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ పరిస్థితి ఇదీ..
కడప టీడీపీ అభ్యర్థి మాధవీరెడ్డి 16282 ఓట్లతో విజయం
ప్రొద్దుటూరులో టీడీపీ అభ్యర్థి వరదరాజులరెడ్డి 22744 ఓట్లతో విజయం
కమలాపురం టీడీపీ అభ్యర్థి పుత్త కృష్ణ చైతన్య రెడ్డి 25357 ఓట్లతో విజయం
జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి 16312 ఓట్ల మెజార్టీతో విజయం
మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ 19077 ఓట్లతో విజయం
రైల్వే కోడూరులో 13 రౌండ్లు ముగిసేప్పటికి జనసేన13198 ఓట్లతో ముందంజ
బద్వేల్ 18 రౌండ్లు పూర్తయ్యేసరికి వైసీపీ అభ్యర్థి 16931 ఆధిక్యం
పులివెందులలో వైసీపీ 19వ రౌండు ముగిసే సమయానికి 56 వేలతో ముందంజ
రాజంపేటలో 20వ రౌండ్ ముగిసే సమయానికి వైసీపీ 8378 ఓట్లతో ముందంజ
రాయచోటిలో 17వ రౌండ్ ముగిసేపటికి వైసిపి 2991 ఓట్లతో ముందంజ
-
2024-06-04T16:46:00+05:30
లక్ష మెజార్టీ దిశగా నారా లోకేష్
మంగళగిరి లో 15 వ రౌండ్ పూర్తయ్యే సరికి 70 వేల 077 ఓట్లు ఆధిక్యంలో లోకేష్
మరో 7 రౌండ్లు ఓట్లు లెక్కించాల్సి ఉండటంతో లక్షకు మెజార్టీ చేరుకునే అవకాశం
మొదటి నుంచి తనకు 53 వేల 500 మెజార్టీ ఇవ్వాలని కోరిన లోకేష్
తనను 2019లో 5 వేల 300 ఓట్లతో ఓడించారని అందువల్ల 53 వేల 500 ఓట్లు ఆధిక్యం ఇవ్వాలని కోరిన లోకేష్
అంతకంటే ఎక్కువ మెజార్టీతో లోకేష్ ను గెలిపిస్తున్న మంగళగిరి ప్రజలు
-
2024-06-04T16:43:00+05:30
వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు..
వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చిన టీఎన్టీయూసీ నేతలు
వైఎస్సార్ పేరు తొలగించి, ఎన్టీఆర్ పేరున్న అక్షరాలు పెట్టిన యువత
ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీగా ఉమ్మడి ఏపీలో ప్రాచుర్యం
జగన్ సీఎం అయ్యాక... ఎన్టీఆర్ పేరు తీసి వైఎస్సార్ పేరు పెట్టిన వైసీపీ ప్రభుత్వం
ఆందోళనలు, నిరసనలు చేసినా నాడు పోలీసులను అడ్డం పెట్టి అరెస్టు చేయించిన జగన్
ఇప్పుడు కూటమి విజయం ఖరారు కావడంతో మళ్లీ ఎన్టీఆర్ పేరు పెట్టిన టీడీపీ యువత
-
2024-06-04T16:25:00+05:30
తగ్గిన జగన్ మెజార్టీ
పులివెందులలో వైఎస్ జగన్మో హన్ రెడ్డికి 60000లకు పైచిలుకు మెజార్టీ
పులివెందులలో 22 రౌండ్లు పూర్తి
జగన్మోహన్ రెడ్డికి 61176 ఓట్ల మెజార్టీ
మిగిలి ఉన్న పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు
గత ఎన్నికల కంటే భారీగా తగ్గిన జగన్ మెజార్టీ
28 వేల వరకు తగ్గిన మెజార్టీ
2019 ఎన్నికల్లో మెజార్టీ 90,110
-
2024-06-04T16:19:00+05:30
వైసీపీకి ప్రతిపక్షా హోదా లేదు: కేశినేని చిన్ని
టీడీపీ సునామీ ప్రభంజనంగా వస్తుందని మూడు నెలలు ముందుగానే తనకు తెలుసునని విజయవాడ ఎంపీ కూటమి అభ్యర్థి కేశినేని చిన్నితెలిపారు.
ఈ గెలుపు టీడీపీదే కాకుండా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కష్టం, బీజేపీ పురందేశ్వరి కష్టం వల్ల కూటమి అధికారంలోకి వచ్చింది.
అందరం ఒకే మాట మీద ఉండటం వల్ల గెలుపు సాధ్యమైంది. ప్రజలు ప్రతిపక్షమే లేకుండా చేశారు.
ప్రజల తీర్పు ఎలా ఉంటుందో ఇప్పటికైనా జగన్‌కి అర్థమై ఉంటుంది.
-
2024-06-04T16:10:00+05:30
చంద్రబాబు ఇంట్లో సంబురాలు
కూటమి ఘన విజయపై తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో సంబరాలు అంబరాన్ని అంటాయి.
నారా, నందమూరి కుటుంబ సభ్యులు, బంధువులు కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
చంద్రబాబు మనవడు దేవాన్ష్ కేక్ కట్ చేసి....తాతకు, బంధువులకు కేక్ తినిపించిన దేవాన్ష్
ఎన్డీఏ కూటమి గెలుపుపై నారా భువనేశ్వరి విజయకేతనం చూపించారు.
-
2024-06-04T14:40:29+05:30
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు బంపర్ మెజారిటీ
పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 70,354 ఓట్ల మెజారిటీతో గెలిచిన పవన్ కల్యాణ్
-
2024-06-04T14:36:12+05:30
పిఠాపురంలో రౌండ్ రౌండ్‌కి పెరుగుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆధిక్యం
16 రౌండ్లు ముగిసేసరికి 65,368 వేల ఓట్లు ముందంజలో పవన్
శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఓటమి.. టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ 50,593 ఓట్లతో భారీ విజయం
ముమ్మిడివరం టీడీపీ దాట్ల సుబ్బరాజు 13వ రౌండ్‌లో 28,470 ఓట్లతో ముందంజ
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంట్ ఎంపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ 2,01,123 ఓట్లు మెజారిటీతో ముందంజ
-
2024-06-04T14:33:20+05:30
విశాఖ లోక్‌సభ నియోజకవర్గం ఓట్ల లెక్కింపు నాలుగో రౌండ్ పూర్తయ్యేసరికి కూటమి అభ్యర్థి భరత్‌కు లక్ష ఓట్ల ఆధిక్యంతో ముందంజ
డోన్ అసెంబ్లీ 20వ రౌండ్ వరకు టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి 710 ఆధిక్యత
-
2024-06-04T14:26:38+05:30
విజయాలు ఖరారైన స్థానాలు
1. రాజమండ్రి సిటీ (టీడీపీ - ఆధిక్యం 70,318)
2. రాజమండ్రి రూరల్ (టీడీపీ - ఆధిక్యం 63,056)
3. అనపర్తి (బీజేపీ - 20,567)
4. రాజానగరం (జనసేన - ఆధిక్యం 33,674)
5. కొవ్వూరు (టీడీపీ - ఆధిక్యం 33,466)
6. గోపాలపురం (టీడీపీ - ఆధిక్యం 26,527)
-
2024-06-04T14:23:22+05:30
కురపాం అసెంబ్లీ నియోజకవర్గంలో ఘన విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి తోయక జగదీశ్వరి
ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తి.. 21,723 ఓట్ల ఆధిక్యంతో జగదీశ్వరి గెలుపు
-
2024-06-04T14:09:20+05:30
పులివెందులలో 40 వేల ఆధిక్యంలో జగన్
-
2024-06-04T14:03:21+05:30
రోజాపై బండ్ల గణేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘జబర్దస్త్ పిలుస్తుంది.. రా కదలిరా’ అంటూ ట్వీట్
-
2024-06-04T13:43:23+05:30
మంగళగిరిలో చరిత్ర సృష్టించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
టీడీపీ దశాబ్దాలుగా గెలవని పార్టీ జెండాను యువనేత విజయం
ఇక్కడ 15 సార్లు ఎన్నిక జరిగితే 2 సార్లు మాత్రమే గెలిచిన టీడీపీ
అంతకుముందు 1985లో గెలిచిన తెలుగుదేశం పార్టీ
-
2024-06-04T13:30:57+05:30
చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్
ఏపీలో తిరుగులేని విజయంపై అభినందలు తెలిపిన ప్రధాని
ఏపీలో 161 స్థానాల్లో గెలుపు దిశగా ఎన్డీయే కూటమి
-
2024-06-04T13:24:45+05:30
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి విజయం
ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్‌లో టీడీపీ సంబరాలు..
టీడీపీ కూటమి అధికారం చేపడుతున్న సందర్భంగా ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్‌లో స్వీట్లు పంచిన చింతమనేని ప్రభాకర్
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ చరిత్రలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయనున్న కేశినేని శివనాథ్ (చిన్ని)
లగడపాటి రాజగోపాల్ నెలకొల్పిన 1,13,700 ఓట్ల మెజార్టీ రికార్డును బ్రేక్ చేసిన కేశినేని శివనాథ్
మరో పది రౌండ్ మిగిలి వుండగానే లగడపాటి రికార్డ్ బద్దలు కొట్టిన కేశినేని శివనాథ్
2 లక్షల మెజారిటీ దిశగా దూసుకుపోతూ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయనున్న కేశినేని శివనాథ్
-
2024-06-04T13:24:06+05:30
మరి కాసేపట్లో సీఎం పదవికి రాజీనామా చేయనున్న జగన్ మోహన్ రెడ్డి
ఏపీ గవర్నర్ నజీర్‌ను కలిసి రాజీనామా లేఖను అందించనున్న వైసీపీ అధినేత
ఎన్డీయే కూటమి ప్రభంజనం సృష్టించడంతో మరి కాసేపట్లోనే గవర్నర్ కార్యాలయానికి జగన్
-
2024-06-04T13:19:20+05:30
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మధ్యాహ్నం 1 గంట సమయానికి మొత్తం 156 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న ఎన్డీయే కూటమి.
గోరంట్ల బుచ్చయ్య గెలుపుతో కూటమికి మొత్తం 157 సీట్లు దక్కే ఛాన్స్
టీడీపీ 129 స్థానాలు, జనసేన 20, బీజేపీ 7 స్థానాల్లో ముందంజ
వైఎస్సార్‌సీపీ 18 స్థానాల్లో ఆధిక్యం
-
2024-06-04T13:06:24+05:30
విజయవాడ ఈస్ట్ 12వ రౌండ్ పూర్తి అయ్యేసరికి గద్దె రామ్మోహన్ 24,210 అధిక మెజారిటీతో ముందంజ
పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడికి బంపర్ మెజారిటీ. 69 వేల ఆధిక్యంతో ఘన విజయం
అధికారికంగా ధృవీకరించాల్సిన ఎన్నికల అధికారులు
బనగానపల్లె అసెంబ్లీ 12వ రౌండ్లు పూర్తి. టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డికి 13,800 ఆధిక్యత
-
2024-06-04T13:00:41+05:30
విజయనగరం ఆరో రౌండ్ ముగిసే సరికి టీడీపీ అభ్యర్థి అధితీగజపతికి 17,514 ఓట్ల ఆధిక్యం
ఆదోనీలో బాణ సంచా పేలుస్తూ సంబరాలు జరుపుకున్న టీడీపీ కార్యకర్తలు
మంత్రాలయం వైసీపీ అభ్యర్థి వై.బాలనాగరెడ్డి 8వ రౌండ్ పూర్తియేరికి 15,000 ఓట్లు ఆధిక్యం
శ్రీశైలం అసెంబ్లీ 10 రౌండ్లలో వైసీపీ శిల్పా చక్రపాణి రెడ్డి 2,442 ఓట్ల ఆధిక్యత
ఎమ్మిగనూరు అసెంబ్లీలో 4వ రౌండ్ ముగిసే సరికి టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వర్ రెడ్డికి 2,394 ఓట్ల ఆధిక్యత
జగ్గయ్యపేట అసెంబ్లీ ఎనిమిదవ రౌండ్ ఫలితాలు.. టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ తాతయ్యకి 13,206 మెజారిటీతో ముందంజ
-
2024-06-04T12:54:08+05:30
విశాఖపట్నం టీడపీ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్‌కు లక్షకు పైగా మెజార్టీ.. కొనసాగుతున్న కౌంటింగ్ ప్రక్రియ..
సంతనూతలపాడు టీడీపీ అభ్యర్థికి 11వ రౌండ్‌లో 17,540 ఓట్లు ఆధిక్యం
-
2024-06-04T12:43:09+05:30
కోడుమూరు అసెంబ్లీ ఏడవ రౌండ్ ముగిసేసరికి టీడీపీ అభ్యర్థి బొగ్గుల దస్తగిరి 8,193 ఓట్ల ఆధిక్యం
దెందులూరులో ఆరవ రౌండ్ నాటికి టీడీపీకి 6,892 ఓట్ల ఆధిక్యత
చింతలపూడి 15వ రౌండ్ నాటికి టీడీపీ 24,014 ఓట్ల ఆధిక్యత
ఉంగుటూరులో ఆరవ రౌండ్‌కు జనసేన 13,591 ఓట్ల ఆధిక్యత
పాణ్యం ఎనిమిదవ రౌండ్ కంప్లీట్.. టీడీపీ అభ్యర్థి గౌరు చరితా రెడ్డి 15,484 ఓట్ల ఆధిక్యత
-
2024-06-04T12:32:44+05:30
తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరంలో ఎన్నికల ఫలితాలలో వైసీపీ ఓటమి పాలవుతోందనే బాధతో ఆత్మహత్య యత్నం చేసుకున్న వైసీపీ కార్యకర్త
కత్తితో చెయ్యి కోసుకున్న వైసీపీ కార్యకర్త కొండబత్తుల సాదు
తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రికి తరలింపు
గోపాలపురం నియోజకవర్గ కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు 9వ రౌండ్‌లో 13,270 ఓట్ల ఆధిక్యం
-
2024-06-04T12:22:44+05:30
టీడీపీ చరిత్రలో అతిపెద్ద విజయం దిశగా ఫలితాలు
-
2024-06-04T12:17:59+05:30
రాయలసీమలోనూ ఎన్డీయే కూటమి అభ్యర్థుల ప్రభంజనం
రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం 12 గంటల సమయానికి 157 అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల ముందంజ
టీడీపీ -129, జనసేన -20, బీజేపీ -7, వైసీపీ 18 చోట్ల ఆధిక్యం
-
2024-06-04T12:13:24+05:30
9న చంద్రబాబు ప్రమాణస్వీకారం
అమరావతి వేదికగా ప్రమాణస్వీకారం చేయనున్నారు
వైనాట్ 175 అని.. కేవలం 17కి పడిపోయిన వైసీపీ
అంతా దేవుడి స్క్రిప్ట్ అంటున్న ఏపీ వాసులు
-
2024-06-04T12:06:54+05:30
టీడీపీ ఖాతాలో తొలి సీటు
ఏపీ శాసనసభ ఎన్నికల్లో తొలి ఫలితం విడుదలైంది. రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఘన విజయం సాధించారు. 60వేలకు పైగా ఓట్ల మెజార్టీతో బుచ్చయ్యచౌదరి విజయం సాధించారు. 2014 నుంచి బుచ్చయ్యచౌదరి ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తూ వస్తున్నారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో 2009లో ఓటమి చెందిన బుచ్చయ్యకు.. 2014లో పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని బీజేపీ పోటీచేసింది. దీంతో బుచ్చయ్యచౌదరికి రాజమండ్రి రూరల్ టికెట్ కేటాయించింది. అప్పటినుంచి ఆ నియోజకవర్గంలో ఆయన గెలుస్తూ వస్తున్నారు. 2008 నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటినుంచి ఇప్పటిరకు నాలుగు సార్లు ఎన్నికలు జరగ్గా.. మూడు సార్లు బుచ్చయ్యచౌదరి టీడీపీ నుంచి గెలుపొందారు. రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్యచౌదరి హ్యాట్రిక్ కొట్టారు.
-
2024-06-04T11:48:38+05:30
కౌంటింగ్ కేంద్రాల నుంచి వెనుదిరిగి వెళ్లిపోయిన ప్రొద్దుటూరు, జమ్మలమడుగు వైసీపీ అభ్యర్థులు రాచమల్లు శిప్రసాద్ రెడ్డి, సుధీర్ రెడ్డి
ఓటమి చేరువ కావడంతో కౌంటింగ్ కేంద్రం నుంచి వెను తిరిగి వెళ్లిపోయిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు..
గెలుపు దిశగా ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి వరదరాజు రెడ్డి, జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి
గురజాల అసెంబ్లీ 8వ రౌండ్‌కు టీడీపీ11,967 ఆధిక్యం
చిలకలూరిపేట అసెంబ్లీ 6వ రౌండ్‌కు టీడీపీ7,800 ఓట్లు ఆధిక్యం
గుంటూరు తూర్పు 11వ రౌండ్‌కు టీడీపీ18,504 ఓట్లు ఆధిక్యం
-
2024-06-04T11:41:20+05:30
విజయనగరం చీపురపల్లిలో కిమిడి కళావెంకట్రావు 6వ రౌండ్ ముగిసే సరికి 1800 ఓట్ల ఆధిక్యం
గన్నవరం నియోజవర్గంలో సంబరాలు మునిగి తేలుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శ్రేణులు
గోపాలపురం నియోజకవర్గంలో 5వ రౌండ్ ముగిసే సరికి కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు 7,133 ఆధిక్యం
ఉండి నియోజకవర్గం 6వ రౌండ్‌లో టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు ఆధిక్యం.. మెజారిటీ 20,061
నర్సాపురంలో జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్‌కు 5వ రౌండ్‌లో 18,162 ఓట్లు మెజారిటీ
భీమవరం నియోజకవర్గంలో 7వ రౌండ్ ముగిసే సరికి జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులుకి 55,050 ఓట్లు, వైసీపీ గ్రంధి శ్రీనివాస్‌కు 23,345 ఓట్లు.
కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయిన రామచంద్రపురం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి పిల్లి సూర్య ప్రకాశ్
-
2024-06-04T11:34:50+05:30
కుప్పం నియోజకవర్గంలో 5వ రౌండ్ ముగిసే సమయానికి టీడీపీ అభ్యర్థి చంద్రబాబు నాయుడికి 9,808 మెజారిటీ
పూతలపట్టు నియోజకవర్గంలో 5వ రౌండ్ ముగిసే సమయానికి టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ 4,066 ఓట్లు మెజారిటీ
ఎన్టీఆర్ జిల్లా నందిగామ తంగిరాల సౌమ్య 4వ రౌండ్‌కి 4,682 ఓట్లతో లీడ్
దెందులూరు నాల్గవ రౌండ్ ముగిసేసరికి చింతమనేనికి 3,735 ఓట్ల ఆధిక్యత
ఉంగుటూరు నాల్గవ రౌండ్ ముగిసేసరికి జనసేనకు 8,442 ఓట్ల ఆధిక్యత
-
2024-06-04T11:23:57+05:30
టీడీపీ పోటీ చేసిన 144 స్థానాల్లో 129 స్థానాల్లో అధిక్యం
జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో 19 స్థానాల్లో అధిక్యం
బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో 7 స్థానాల్లో అధిక్యం
175 స్థానాల్లో పోటీ చేసిన వైసీపీ.. 20 స్థానాల్లో ఆధిక్యం
-
2024-06-04T11:12:06+05:30
చంద్రగిరి అసెంబ్లీ స్థానంలో పులివర్తి నాని లీడ్
రేపల్లె అసెంబ్లీ 3వ రౌండ్‌కు టీడీపీ అభ్యర్థికి11,085 ఓట్ల ఆధిక్యం
3వ రౌండ్ పూర్తి అయ్యేసరికి చోడవరం కూటమి అభ్యర్థి కేఎస్‌ఎన్ఎస్ రాజు ఆధిక్యం
సమీప వైసీపీ అభ్యర్థి కే.ధర్మశ్రీపై 6,341 ఓట్ల మెజార్టీ
-
2024-06-04T10:57:46+05:30
తూర్పు గోదావరి జిల్లాలో ప్రభంజనం దిశగా ఎన్డీయే కూటమి
మొత్తం 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న కూటమి అభ్యర్థులు
-
2024-06-04T10:56:03+05:30
అనకాపల్లి చోడవరం 3వ రౌండ్ పూర్తయ్యే సరికి కూటమి అభ్యర్థి రాజు తన సమీప వైసీపీ అభ్యర్థి కె.ధర్మశ్రీపై 6,341 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
కాకినాడ ఎంపీ జనసేన అభ్యర్థి మొదటి రౌండ్ లీడ్ 12,578 ఓట్లు
పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడుకు మూడో రెండు పూర్తి అయ్యేనాటికి 14,701 ఓట్లు మెజారిటీ
కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు 8,249 ఓట్ల మెజార్టీ
పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి నిమ్మల రామానాయుడుకు 14,701 ఓట్ల ఆధిక్యం
కాకినాడ రూరల్ రెండో రౌండ్‌లో జనసేన అభ్యర్థికి 6,812 లీడ్
వెంకటగిరి నాలుగవ రౌండ్ పూర్తయ్యేసరికి కూటమి అభ్యర్థి కురుగొండ్ల రామకృష్ణ 1,517 ఓట్ల ఆధిక్యం
-
2024-06-04T10:47:33+05:30
రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభంమైన టీడీపీ సంబరాలు
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి భారీగా చేరుకున్న టీడీపీ నేతలు, శ్రేణులు
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ప్రారంభమైన విజయోత్సవ కోలాహలం
కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటికి వెళ్లిపోతున్న వైసీపీ ఏజెంట్లు
-
2024-06-04T10:31:58+05:30
ఏపీలో 148 స్థానాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థుల ముందంజ
చతికిలపడ్డ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు
దారుణ ఓటమిని చవిచూడబోతున్న పలువురు మంత్రులు
పార్వతీపురం నియోజకవర్గంలో నాలుగో రౌండ్‌కు 11,000 లీడ్‌లో టీడీపీ ముందంజ
ఏలూరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో మూడో రౌండ్ ముగిసే నాటికి టీడీపీకి 9,871 ఓట్ల ఆధిక్యత
-
2024-06-04T10:26:56+05:30
పార్వతీపురం నియోజకవర్గంలో నాలుగో రౌండ్‌కు 11,000 లీడ్‌లో టీడీపీ ముందంజ
ఏలూరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో మూడో రౌండ్ ముగిసే నాటికి టీడీపీకి 9,871 ఓట్ల ఆధిక్యత
-
2024-06-04T10:24:14+05:30
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏకంగా 10 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న టీడీపీ కూటమి అభ్యర్థులు
-
2024-06-04T10:22:42+05:30
కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూటమి అభ్యర్థుల ముందంజ
తొలి రౌండ్ నుంచి కూటమి అభ్యర్థులకే ఆధిక్యత
మూడు రౌండ్లు ముగిసే సరికి 5 వేల పైన అభ్యర్థులు మెజారిటి
కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వెళ్లిపోయిన వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్, కైలే అనిల్
-
2024-06-04T10:02:36+05:30
కుప్పం నియోజకవర్గంలో మొదటి రౌండ్‌లో టీడీపీ అభ్యర్థి చంద్రబాబు నాయుడుకి 893 ఓట్ల ఆధిక్యం
ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ లీడ్
తెనాలి 3వ రౌండ్‌లో జనసేన అభ్యర్థి 10 వేల 71 ఓట్లు ఆధిక్యం
ఏలూరు అసెంబ్లీ టీడీపీకి మొదట రౌండ్‌లో భారీ ఆధిక్యం
కమలాపురం నియోజకవర్గంలో మొదటి రౌండ్ ముగిసేసరికి వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థికి 918 ఓట్ల ఆధిక్యం
పుంగనూరు నియోజకవర్గంలో రెండో రౌండ్లో టీడీపీ అభ్యర్థి చెల్లా రామచంద్రారెడ్డి 134 ఓట్లు మెజారిటీ
వెనుకంజలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, శాసనసభాపతి తమ్మినేని సీతారాం
అరుకు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ముందంజ
ఇచ్చాపురం టీడీపీ అభ్యర్థి బంధాలం అశోక్ 1614 ఓట్ల మెజారిటీతో ముందంజ
రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో రెండో రౌండ్ పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి కోండ్రు మురళి 839 ఓట్లతో ముందంజ
కైకలూరులో బీజేపీ అభ్యర్థి కామినేని మొదటి రౌండ్ లో 2514 ఓట్లతో ముందంజ
నంద్యాల అసెంబ్లీ నాలుగో రౌండ్‌లో కౌంటింగ్ పూర్తి
నాలుగో రౌండ్ పూర్తయ్యే సరికి ముందంజలో టీడీపీ అభ్యర్థి ఎన్ఎండీ ఫరూఖ్.. దాదాపు 5,255 ఓట్ల అధిక్యంలో ఫరూక్
-
2024-06-04T09:52:23+05:30
కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలొ 4,187 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్ది
రెండో రౌండ్ మొదలయ్యే సరికి గన్నవరంలో 2,960 ఓట్లతో యార్లగడ్డ వెంకట్రావు లీడింగ్
3,243 ఆధిక్యతతో అవనిగడ్డలో జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ ముందంజ
పామర్రులో టీడీపీ1500 ఓట్ల ఆధిక్యం
మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థి బాలశౌరికి 4600 ఆధిక్యం
-
2024-06-04T09:47:56+05:30
రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరికి ప్రస్తుతం 25,529 ఓట్ల ఆధిక్యం
రాజోలు జనసేన అభ్యర్థి 3000 కు పైగా ఆధిక్యం
ప్రత్తిపాడులో రెండో రౌండ్ ముగిసేసరికి టీడీపీ అభ్యర్థికి 3993 ఓట్ల లీడ్
-
2024-06-04T09:42:12+05:30
ఏపీలో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన కూటమి ఆధిక్యాలు
105 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న కూటమి అభ్యర్థులు
-
2024-06-04T09:30:54+05:30
గుడివాడలో వైసీపీ అభ్యర్థి కొడాలి నాని వెనుకంజ
గుడివాడలో మొదటి రౌండ్ ముగిసే సరికి టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము 1385 ఓట్ల అధిక్యం
గిద్దలూరు వైసీపీ అభ్యర్థి నాగార్జున రెడ్డికి తొలి రౌండ్‌లో 690 ఓట్ల అధిక్యత
మంగళగిరిలో టీడీపీ అభ్యర్థి నారా లోకేష్‌కు మొదటి రౌండ్ లో 4,349ఓట్ల ఆధిక్యం
-
2024-06-04T09:22:30+05:30
ఏపీలో ఎన్డీయే కూటమి 65 స్థానాల్లో ఆధిక్యం..
ఏపీలో వెనుకంజలో పలువురు మంత్రులు
రోజా, బుగ్గన, చెల్లుబోయిన పలువురు వెనుకంజ
-
2024-06-04T09:20:07+05:30
మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ మొదటి రౌండ్‌లో 4,359 ఓట్ల ఆధిక్యం
గుంటూరు తూర్పులో టీడీపీ అభ్యర్థి నసీర్ 2300 ఆధిక్యం
బాపట్ల పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి 870 ఓట్ల మెజార్టీ
బద్వేల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిపై వైసీపీ అభ్యర్థి 1492 ఓట్లు ఆధిక్యం
మైదుకూరులో వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి 911 ఓట్ల ఆధిక్యం
నెల్లిమర్ల తొలి రౌండ్ ముగిసే సరికి జనసేన అభ్యర్ధిని లోకం నాగమాధవి 800 ఓట్లు ఆధిక్యం.. వైసీపీ పక్కా గ్రామాల్లోనూ జనసేన దూకుడు
-
2024-06-04T09:19:15+05:30
రామచంద్రపురం టిడిపి ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ మొదటి రౌండ్‌లో 4000 ఓట్లతో ముందంజ
పీ. గన్నవరం నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి హరీష్ మాధుర్ 3,400 ఓట్లు మెజార్టీ
కొత్తపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావు 1172 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు
కొత్తపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావు 1172 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.
పెద్దాపురం 2000 టీడీపీ ఆధిక్యం
అనకాపల్లి, రాజమండ్రి పార్లమెంట్‌లలో బీజేపీ ఆధిక్యం.. పురందేశ్వరి ఆధిక్యం 8984
-
2024-06-04T09:12:37+05:30
ఉదయం 9 గంటలకు 48 చోట్ల కూటమి అభ్యర్థులు ముందంజ
టీడీపీ -39, జనసేన-7, బీజేపీ-2 చోట్ల లీడ్
వైఎస్సార్‌సీపీకి3 స్థానాల్లో ఆధిక్యం
-
2024-06-04T09:10:15+05:30
కళ్యాణదుర్గం మొదటి రౌండ్‌లో 3300 మెజార్టీతో టీడీపీ అభ్యర్ధి అమ్మిలినేని సురేంద్రబాబు ముందంజ
పోస్టల్ బ్యాలెట్‌లో నగరి టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్ ముందంజ
తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ మొదటి రౌండ్ పూర్తి అయ్యే సరికి 359 ఆధిక్యత
రాజమండ్రి కూటమి ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి ఆధిక్యత
-
2024-06-04T09:05:09+05:30
కడప పార్లమెంటులో మొదటి రౌండ్‌లో వైసీపీ అభ్యర్థి ఎంపీ అవినాష్ రెడ్డి 4,362 ఓట్ల ఆధిక్యం
టీడీపీ అభ్యర్థి భూఫేష్ రెడ్డికి 2088
కాంగ్రెస్ అభ్యర్థి షర్మిలకు 1101
-
2024-06-04T09:01:47+05:30
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మొదటి రౌండ్లో 4,136 లీడ్
జగ్గంపేట టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ 3,500 ఓట్లు మెజారిటీ
మూడో రౌండ్‌లో గోరంట్ల 4,905 ఆధిక్యత
ఆచంట నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ 1513 ఓట్లతో లీడింగ్
-
2024-06-04T08:59:24+05:30
గుంటూరు పార్లమెంట్ తొలిరౌండ్‌లో టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ 3971 లీడ్‌లో ఉన్నారు
-
2024-06-04T08:57:44+05:30
గజపతినగరంలో టీడీపీ ఆధిక్యం
కుప్పంలో చంద్రబాబు నాయుడు పోస్టల్ బ్యాలెట్‌లో 1359ఓట్లు మెజారిటీ ముందంజ
జీడీ నెల్లూరులో టీడీపీ అభ్యర్థి డాక్టర్ థామస్ పోస్టల్ బ్యాలెట్‌లో 800 ఓట్ల మెజారిటీ ముందంజ
తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ పోస్టల్ బ్యాలెట్‌లో 500 ఓట్ల ఆధిక్యం
ముమ్మిడివరం టీడీపీ అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు 3 వేల ఆధిక్యం
తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి వరప్రసాద్ 359 లీడ్
జగ్గంపేట టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ 3,500 ఓట్లు మెజారిటీ
ఆచంట నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ 1513 ఓట్లతో లీడింగ్
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మొదటి రౌండ్లో 4136 లీడ్
అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేశ్ లీడింగ్
గన్నవరం నియోజవర్గంలో యార్లగడ్డ వెంకట్రావు 870 ఓట్లు ముందంజ
-
2024-06-04T08:51:09+05:30
పిఠాపురంలో తొలి రౌండ్‌లో పవన్ కల్యాణ్ ఆధిక్యం
మైలవరం నియోజక వర్గంలో తొలి రౌండ్‌లో వసంత కృష్ణ ప్రసాద్‌కు స్వల్ప ఆధిక్యత
మొదటి రౌండ్ లో ఆదిక్యంలో ఉన్న విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని
-
2024-06-04T08:50:31+05:30
రాష్ట్ర వ్యాప్తంగా 28 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ ముందంజ
5 స్థానాల్లో జనసేన ముందంజ
ఖాతా తెరవని వైసీపీ
-
2024-06-04T08:45:18+05:30
దగ్గుపాటి పురంధేశ్వరి లీడ్, లావు శ్రీకృష్ణదేవరాయలు లీడ్
నంద్యాల ఎంపీ టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి 113 ఓట్లతో ఆధిక్యం
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి 2870 ఓట్ల ఆధిక్యం
వెనుకంజలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
-
2024-06-04T08:42:12+05:30
ఏపీలో కౌంటింగ్ నేపథ్యంలో సోషల్ మీడియాపై ఫోకస్
రెచ్చగొట్టే పోస్టులుపెడితే కఠిన చర్యలంటూ వార్నింగ్ ఇచ్చిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
బెదిరింపు పోస్టులు పెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిక
కేసులు నమోదు చేసి రౌడీషీట్లు ఓపెన్ చేస్తామని, అడ్మిన్‌లు అలర్ట్‌గా వార్నింగ్
-
2024-06-04T08:39:28+05:30
కుప్పంలో చంద్రబాబు నాయుడు పోస్టల్ బ్యాలెట్‌లో 1600 ఓట్లు మెజారిటీతో ముందంజ
జీడీ నెల్లూరులో టీడీపీ అభ్యర్థి డాక్టర్ థామస్ పోస్టల్ బ్యాలెట్‌లో 800 ఓట్ల మెజారిటీ
పల్నాడు జిల్లాలో కౌంటింగ్ పరిశీలకులు రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ
చంద్రబాబు నివాసానికి చేరుకున్న వంగవీటి రాధ
-
2024-06-04T08:33:56+05:30
రాష్ట్రంలో 17 స్థానాల్లో టీడీపీ, నాలుగు స్థానాల్లో జనసేనా ఆధిక్యం
-
2024-06-04T08:32:39+05:30
షర్మిల రెడ్డి, ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్
ప్రత్యేక ప్రార్థనలు అనంతరం కడప కౌంటింగ్ కేంద్రం వద్దకు బయలుదేరిన షర్మిల
-
2024-06-04T08:30:17+05:30
మండపేటలో టీడీపీ అభ్యర్థి ముందంజ
నోవా కాలేజ్‌లో కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన టీడీపీ పార్లమెంట్అభ్యర్థి కేశినేని చిన్ని, విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సృజన చౌదరి
-
2024-06-04T08:23:32+05:30
పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఆధిక్యం.. 1549 ఓట్ల లీడ్‌లో మాజీ సీఎం
-
2024-06-04T08:19:47+05:30
పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌లో రాజమండ్రి రూరల్‌లో బుచ్చయ్య చౌదరి లీడింగ్
నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్థి నారాయణ ఆధిక్యం
-
2024-06-04T08:10:53+05:30
ఏపీ వ్యాప్తంగా నరాలు తెగ ఉత్కంఠ
ఆరంభ ట్రెండ్స్ ఎదురుచూస్తున్న జనం
ఎక్కడ చూసినా టెన్షన్.. టెన్షన్..
-
2024-06-04T07:52:26+05:30
రాష్ట్రం మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా 2,387 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక 25 లోక్‌సభ స్థానాల నుంచి 454 మంది అభ్యర్థులు పోటీ చేశారు. తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి అత్యధికంగా 46 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని చోడవరం అసెంబ్లీ స్థానం నుంచి కేవలం ఆరుగురు అభ్యర్థులు మాత్రమే పోటీ చేశారు.
-
2024-06-04T07:48:12+05:30
ఏపీ వ్యాప్తంగా ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్..
8 గంటలకు అన్ని కేంద్రాల్లో లెక్కింపు మొదలైంది
కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు
-
2024-06-04T07:30:09+05:30
తాడేపల్లిలో సీఎం నివాసానికి వెళ్లే మార్గంలో భారీగా భాద్రతా బలగాలు మోహరింపు
కౌంటింగ్ ప్రక్రియ నేపథ్యంలో అధనపు భద్రతను ఏర్పాటు చేస్తున్నట్టు చెపుతున్న అధికారులు
-
2024-06-04T07:15:10+05:30
కౌంటింగ్ సెంటర్లలో ఏజెంట్లపై కఠిన ఆంక్షలు
కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లిన ఏజెంట్ లెక్కింపు పూర్తయ్యేంత వరకు బయటకు రాకుండా నిబంధన
గతంలో రిలీవింగ్ ఏజెంట్లను అనుమతించిన ఎన్నికల సంఘం
ఈ సారి రిలీవింగ్ ఏజెంట్ల నిబంధన ఎత్తివేత
ఏజెంట్ల వద్ద పెన్ను లేదా పెన్సిల్ మరియు తెల్ల కాగితం మాత్రమే ఉండేలా నిబంధన
-
2024-06-04T06:35:57+05:30
మరికాసేపట్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు
కౌంటింగ్ కేంద్రానికి పోస్టల్ బ్యాలెట్ బాక్సులను తరలిస్తున్న అధికారులు
కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న ఏజెంట్లు, అభ్యర్థులు
-
2024-06-04T06:26:12+05:30
అసెంబ్లీ స్థానాలు - 175
పార్లమెంటు నియోజకవర్గాలు - 25
లెక్కించాల్సిన ఓట్లు - 3,33,40,560
మహిళలు - 1,69,08,684
పురుషులు - 1,64,30,359
థర్డ్ జెండర్లు - 1,517
-
2024-06-04T06:08:38+05:30
తొలి ఫలితం కొవ్వూరు, నరసాపురం
111 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మధ్యాహ్నం ఒంటి గంట కల్లా తుది ఫలితాలు వెలువడతాయి. కొవ్వూరు, నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి తొలి విజేతల ప్రకటన ఉంటుంది. ఈ రెండు చోట్ల అత్యల్పంగా 13 రౌండ్లలోనే ఫలితం తెలిసిపోతుంది. ఇక...అత్యధికంగా భీమిలి, పాణ్యం నియోజకవర్గాల్లో 26 రౌండ్లు ఉండడంతో ఫలితాలు వెలువడడానికి 9 నుంచి 10 గంటలు పట్టే అవకాశం ఉంది. అదేవిధంగా రాజమహేంద్రవరం, నరసాపురం లోక్‌సభ నియోజకవర్గాల్లో 13 రౌండ్లు ఉన్నాయి. ఇక్కడ ఫలితాల వెల్లడికి ఐదు గంటల సమయం పడుతుంది. అదే విధంగా అమలాపురం పార్లమెంటులో లెక్కింపునకు 27 రౌండ్లు పడుతుంది., ఫలితాలు వచ్చేందుకు 9 గంటల సమయం పడుతుంది. సాయంత్రం 6 గంటలకు ఇక్కడ ఫలితం తేలుతుంది.
-
2024-06-04T06:04:17+05:30
ఏపీలో అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధింపు
మరో 2 గంటల్లో మొదలు కానున్న ఓట్ల లెక్కింపు ఘట్టం
-
2024-06-04T05:50:17+05:30
111 నియోజకవర్గాల్లో 5 గంటల్లో ఫలితాలు..
కౌంటింగ్ మొదలైన ఐదుగంటల్లోనే 111 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితం తేలిపోతుంది. 20 రౌండ్ల లోపే తీర్పు తెలిసిపోతుంది. ఇక.. 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లు, 3 నియోజకవర్గాల్లో 25 రౌండ్లకుపైగానే కౌంటింగ్ సాగనుంది. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ల విషయంలో 102 నియోజకవర్గాల్లో 1 నుంచి 2 రౌండ్లు, 48 నియోజకవర్గాల్లో 3 రౌండ్లు, 25 నియోజకవర్గాల్లో 4 రౌండ్ల కౌంటింగ్ ఉండనుంది.
-
2024-06-04T05:41:42+05:30
ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌కు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు సర్వం సిద్ధమయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 543 ఎంపీ స్థానాలకు కౌంటింగ్ జరగనుంది.
-
2024-06-04T05:37:51+05:30
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్..
ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. ఆ ప్రక్రియ ఎనిమిది గంటలకు మొదలై అరగంట పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్లకు, ఈవీఎంలకు హాళ్లు వేరుగా ఉండవు. కానీ, పార్లమెంటు నియోజకవర్గాల్లో వేర్వేరు హాళ్లు ఉండటంతో.. ఉదయం 8 గంటల నుంచి అటు ఈవీఎంలు, ఇటు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఒకేసారి మొదలు పెడతారు.
-
2024-06-04T05:37:02+05:30
ఒక్కో రౌండ్ 20, 25 నిమిషాలు..
మొదటి రౌండ్ ఫలితం వెల్లడికి 30,35 నిమిషాలు పడుతుంది. ఆ తర్వాత నుంచి ప్రతి 20,25 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం వెలువడుతుంది. ఇక.. పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఒక రౌండ్ ఫలితం వెలువడానికి 2 గంటల నుంచి రెండున్న గంటల సమయం కూడా పట్టవచ్చు.
-
2024-06-04T05:26:03+05:30
కౌంటింగ్ కేంద్రాలివే...
రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాలు...401 హాళ్లలో కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు 2,446 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు 557 టేబుళ్లు సిద్ధం చేశారు. పార్లమెంటు నియోజకవర్గాలకు 2,443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్ బ్యాలెల్ టేబుళ్లు ఏర్పాటుచేశారు. 25,209 మంది ఉద్యోగులు కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొననున్నారు. 119 మంది అబ్జర్వర్లు, ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్, ఉంటారు.
-
2024-06-04T05:19:07+05:30
పోస్టల్ బ్యాలెట్ 5.15 లక్షలు
రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌తో ఓటెత్తారు. బ్యాలెట్ ద్వారా 5.15 లక్షలమంది (1.2 శాతం) ఓటు హక్కు వినియోగించుకోగా, ఇందులో 92 నుంచి 93 శాతం మంది ఉద్యోగులే ఉండటం గమనార్హం. ఉద్యోగులు, అత్యసవర సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులు అత్యధికంగా 461,945 లక్షల మంది ఉన్నారు. ఇక..85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు 26,473 మంది (85శాతం), సర్వీసు ఓటర్లు 26,721 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
-
2024-06-04T05:10:00+05:30
రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 4,13,33,702 మంది. వారిలో 3,33,40,560 మంది ఓటర్లు ఈవీఎంల్లో తమ తీర్పును భద్రపరిచారు. వీరిలో అత్యధికంగా మహిళలు 1,69,08684 మంది ఓటు వేయడం విశేషం. పురుషులు 1,64,30,359 మంది, థర్డ్‌జెండర్లు 1517 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
-
2024-06-04T04:58:59+05:30
తెల్లారింది! ఎన్నాళ్లో వేచిన ఉదయం వచ్చేసింది! అటో ఇటో తేలిపోయే సమయం ఆసన్నమైంది. ఐదేళ్ల వైసీపీ పాలనకు జనం పాతరేస్తారా? లేక... ‘వన్స్ మోర్’ అని గెలిపిస్తారా? ‘మీ అరాచకాలు భరించలేం’ అని వైసీపీకి తేల్చిచెప్పి... సంక్షేమం, అభివృద్ధి సమ్మిళితంగా సాగిస్తామనే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికే పట్టం కడతారా? ‘ఎగ్జిట్ పోల్స్’ అంచనాలు ఏ మేరకు నిజమవుతాయి? అత్యధిక సర్వేలు స్పష్టం చేసినట్లుగా కూటమినే విజయం వరిస్తుందా? లేక... ఈ అంచనా తిరగబడుతుందా? ఇన్ని ప్రశ్నలకు సమాధానం లభించే సమయం ఆసన్నమైంది! మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకల్లా ‘తుది ఫలితం’పై ఒక స్పష్టత వచ్చేస్తుంది. అప్పటిదాకా హైటెన్షన్ తప్పదు మరి!
ఓటు సునామీతో చరిత్ర సృష్టించిన రాష్ట్రం, పోలింగ్ ఫలితాల వెల్లువకు సిద్ధమైంది. 23 రోజులుగా ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓటరు తీర్పు వెలువడే సమయం వచ్చేసింది. దాదాపు 50 రోజులకుపైగా ప్రచారంలో గడిపిన అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. ఫలితాల టెన్షన్‌తో గడుపుతున్న పార్టీల్లో, ఎగ్జిట్‌పోల్స్ తీరుతో ఒక్కసారిగా హైటెన్షన్ మొదలైంది. ఏపీ చరిత్రలోనే రికార్డు స్థాయి ఓటు పడటం ఈ టెన్షన్‌ను తారస్థాయికి చేర్చింది. మహిళా ఓటు అత్యధికంగా నమోదైన ఎన్నికలు కూడా ఇవే. దీంతో వారిచ్చే తీర్పుపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. పోస్టల్ బ్యాలెట్‌తో ఉద్యోగులు పోటెత్తారు. వారి అభిమతం ఏమిటనేదే అంతటా ఆసక్తి రేపుతోంది!
-
2024-06-03T16:12:00+05:30
వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ నేమ్ బోర్డు ధ్వంసం
వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ నేమ్ బోర్డును ధ్వంసం చేసిన తెలుగుదేశం కార్యకర్తలు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనినర్శిటీగా మార్చిన జగన్ ప్రభుత్వం.
ఎన్టీఆర్ పేరు తొలగించి వైెఎస్సార్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకించిన టీడీపీ.
అధికారంలోకి రాగానే హెల్త్ యూనివర్శిటీకి తిరిగి ఎన్టీఆర్ పేరు పెడతానని చంద్రబాబు హామీ.