Lok Sabha Election 2024: ఈ ఎన్నికల్లో బీజేపీని డకౌట్ చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - May 07 , 2024 | 09:27 PM
ఈనెల13న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని డకౌట్ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. తెలంగాణ వర్సెస్ గుజరాత్ మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.
హనుమకొండ: ఈనెల13న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని డకౌట్ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. తెలంగాణ వర్సెస్ గుజరాత్ మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ యుద్ధంలో బీజేపీని ఓడించి కాకతీయ పౌరుషం చూపించాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ సుల్తానులను ఓడించిన కాకతీయ పౌరుషం ప్రదర్శించాలన్నారు. ఈనెల 13న జరిగే ఫైనల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.
BJP: కాంగ్రెస్ వస్తే మళ్లీ దేశమంతా బాంబులు పేలుతాయి: రఘునందన్‌రావు
తన ప్రశ్నకు సమాధానం చెప్పాకే ప్రధాని మోదీ తెలంగాణలో అడుగుపెట్టాలని అన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేశాకే మోదీ ఇక్కడ అడుగుపెట్టాలన్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లాథూర్‌కు తరలించుకు పోయారని విరుచుకుపడ్డారు. తెలంగాణకు బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని మోదీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ పరిశ్రమలను మోదీ గుజరాత్‌కు తరలించుకుపోయారని ధ్వజమెత్తారు. కాకతీయ సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్న వరంగల్‌ను అనాథగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
KTR: పిరమైన మోదీ గారూ.. దయచేసి పవిత్రమైన ఈ నేలపై విషం చిమ్మకండి..!
పదేళ్లు అధికారంలో ఉన్నమాజీ సీఎం కేసీఆర్ తెలంగాణకు ఏమీ చేయలేకపోవడంతోనే ప్రజలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బండకేసి కొట్టారని అన్నారు. కారు మళ్లా వచ్చుడు కాదని.. జుమ్మెరాత్ బజార్‌లో తూకానికి వేయడమేనని రేవంత్‌రెడ్డి సెటైర్లు గుప్పించారు. ఆయన దిగమంటే దిగడానికి కాంగ్రెస్ అల్లాటప్పాగా అధికారంలోకి రాలేదని స్పష్టం చేశారు. వరంగల్ మిర్చి అంటే ఎలా ఉంటుందో.. తనతోని పెట్టుకుంటే అలా ఉంటుందని కేసీఆర్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఆయన బస్సు యాత్ర దేనికి..? చేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ మోదీపై విమర్శలు ఎందుకు చేయట్లేదని నిలదీశారు.
ఆయన బిడ్డ కవిత బెయిల్ కోసం వరంగల్ సీటును తాకట్టు పెట్టిన చరిత్ర కేసీఆర్‌ది అని విమర్శించారు.తులసివనంలో గంజాయి మొక్క ఎర్రబెల్లి దయాకర్ రావు, అనకొండ ఆరూరి రమేష్ అని ఆరోపించారు. కాంగ్రెస్‌ను ఈ ఎన్నికల్లో దొంగదెబ్బ తీయాలని బీఆర్ఎస్ నాయకుడిని బీజేపీలోకి పంపారని విమర్శించారు. అందుకే బీఆర్ఎస్ నాయకులు ఎవరూ ప్రచారం చేయట్లేదని అన్నారు. బీఆర్ఎస్ - బీజేపీ పార్టీల కుట్రలు మీకు చెప్పడానికే వర్షం పడినా ఇక్కడికి వచ్చానని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
Secunderabad: రోజుకో కండువా.. పూటకో గుర్తు
Read Latest Telangana News And Telugu News