Lok Sabha Election 2024: మోదీ.. వారిద్దరి కోసమే పనిచేస్తున్నారు: రాహుల్ గాంధీ
ABN , Publish Date - May 09 , 2024 | 07:38 PM
ఈ ఎన్నికల్లో దేశంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ధీమా వ్యక్తం చేశారు. సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన జనజాతర భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, ఇన్‌చార్జి దీపా దాస్ మున్షీ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, చేవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి, మల్కాజ్‌గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
హైదరాబాద్: ఈ ఎన్నికల్లో దేశంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ధీమా వ్యక్తం చేశారు. సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన జనజాతర భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, ఇన్‌చార్జి దీపా దాస్ మున్షీ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, చేవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి, మల్కాజ్‌గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
T.High Court: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో హైకోర్టుకు టీపీసీసీ
ఈ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ గెలిస్తే రాజ్యాంగం రద్దు చేస్తారని అన్నారు. భారత రాజ్యాంగం కేవలం పుస్తకం కాదని.. అది పేద ప్రజల చప్పుడు అని ఉద్ఘాటించారు. రిజర్వేషన్లు వచ్చింది మన రాజ్యాంగం వల్లే అని రాహుల్ గాంధీ చెప్పారు.
పేదల లిస్ట్ అంతా తయారు చేస్తాం..
‘‘ప్రజలకు అధికారం ఇచ్చింది రాజ్యాంగం.ఈ రాజ్యాంగం కోసం అంబేద్కర్, గాంధీ, నెహ్రూ లాంటి వారు తమ చెమటను, రక్తాన్ని దారపోశారు. రాహుల్, రేవంత్ లాంటి నేతలు రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం.అదానీ, అంబానీ లాంటి 22 మంది కోసం మోదీ రాజ్యాంగాన్ని నడిపారు. ప్రజలకు చెందిన లక్షల కోట్లను 22 మంది పెట్టుబడి దారులకు మోదీ పంచారు. అధికారంలోకి రాగానే పేదల లిస్ట్ అంతా తయారు చేస్తాం.ప్రతి పేద ఇంటిలో ఒక మహిళకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఇస్తాం.దేశంలో సంపదకు కొదవలేదు. ఇన్ని రోజులు ప్రజల డబ్బులను మోదీ పెట్టుబడిదారులకు పంచారు. మేం పేదలకు పంచుతాం’’ అని రాహుల్ గాంధీ తెలిపారు.
తెలంగాణలో పాలన బాగుంది...
‘‘మేనిఫెస్టోలో పెట్టిన అన్ని అంశాలను అమలు చేస్తాం.తప్పుడు నిర్ణయాలతో మోదీ నిరుద్యోగం పెంచారు. విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాల కల్పిస్తాం. తెలంగాణలో పాలన చాలా బాగుంది. రేవంత్, మంత్రులు అద్భుతమైన పాలన కొనసాగిస్తున్నారని చెప్పారు. తెలంగాణ లాంటి అద్భుతమైన పాలన దేశవ్యాప్తంగా అమలు చేస్తాం’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Loksabha Polls: పెద్దపల్లిలో కీ ఓటర్స్ వీరే..?
Read latest Telangana News And Telugu News