Share News

Loksabha Polls: ఉద్యమ అధినేతకు ఆదరణ కరవు..!!

ABN , Publish Date - May 10 , 2024 | 11:06 AM

అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్ సభ ఎన్నికల కోసం కేసీఆర్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. గత నెల 24వ తేదీన మిర్యాలగూడ నుంచి బస్సుయాత్ర ప్రారంభించారు. 16 రోజుల పాటు 13 లోక్ సభ నియోజకవర్గాల్లో రోడ్ షో, కార్నర్ మీటింగ్ జరిగింది. ప్రచారానికి ఎన్నికల సంఘం బ్రేక్ ఇవ్వడంతో మే 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు బ్రేక్ పడింది. మిగతా అంతా షెడ్యూల్ ప్రచారం జరిగింది. అయినప్పటికీ కేసీఆర్ ప్రభావం అంతగా కనిపించడం లేదు.

Loksabha Polls: ఉద్యమ అధినేతకు ఆదరణ కరవు..!!
kcr

హైదరాబాద్: గతంలో దళపతి ఆదేశిస్తే చాలు గ్రామాలు గ్రామాలు కదిలాయి. పార్టీ శ్రేణులు, కార్యకర్తల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉద్యమ సమయంలోనే కాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా గులాబీ దళపతి పరపతి పనిచేసింది. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి మాత్రం కేసీఆర్ (KCR) అంటే జనాలు అంత లెక్క చేయడం లేదు. సభలు, సమావేశాలు, రోడ్ షో, కార్నర్ మీటింగ్ జరిగితే రావడం అయితే వస్తున్నారు. వచ్చిన జనం మాత్రం ఓటు వేయడం లేదు.


కేసీఆర్ ప్రచారం

అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్ సభ ఎన్నికల కోసం కేసీఆర్ (KCR) క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. గత నెల 24వ తేదీన మిర్యాలగూడ నుంచి బస్సుయాత్ర ప్రారంభించారు. 16 రోజుల పాటు 13 లోక్ సభ నియోజకవర్గాల్లో రోడ్ షో, కార్నర్ మీటింగ్ జరిగింది. ప్రచారానికి ఎన్నికల సంఘం బ్రేక్ ఇవ్వడంతో మే 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు బ్రేక్ పడింది. మిగతా అంతా షెడ్యూల్ ప్రచారం జరిగింది. అయినప్పటికీ కేసీఆర్ ప్రభావం అంతగా కనిపించడం లేదు. 2019లో బీఆర్ఎస్ పార్టీ 9 లోక్ సభ సీట్లు గెలుచుకుంది. ఈ సారి అలాంటి పరిస్థితి లేదని సొంత పార్టీ నేతలు చెబుతున్నారు.


పుంజుకున్న కాంగ్రెస్..?

గత ప్రభుత్వ తప్పిదాలు ఇంకా ప్రజల మనస్సు నుంచి తొలగిపోలేదు. అందుకే కేసీఆర్ (KCR) గొంతెత్తి అరిచినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలను ప్రతి చోట వివరిస్తున్నారు. అయినప్పటికీ ఆ అంశాలను క్షేత్రస్థాయిలో ప్రజలు పెద్దగా చర్చించడం లేదని తెలిసింది. గ్రౌండ్ రిపోర్ట్ బట్టి బీఆర్ఎస్ పార్టీకి ఒకటి, రెండు సీట్లు కూడా రావడం కష్టమేనని విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉండనుందని అంచనా వేశారు. మెజార్టీ సీట్లు సాధించేందుకు ఆ రెండు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


రంగంలోకి దిగిన కేసీఆర్

అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు గెలుచుకొని ప్రతిపక్షానికి బీఆర్ఎస్ పరిమితమైంది. లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని అనుకుంది. అందుకోసం కేసీఆర్ (KCR) రంగంలోకి దిగారు. కేసీఆర్ వెళ్లిన ప్రతి చోట ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఈ విషయాన్ని స్థానిక నేతలు డిస్కష్ చేసుకున్నారు. ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పాజిటివ్ రాదని, అందుకు సమయం పడుతుందని ఆనలిస్టులు విశ్లేషిస్తున్నారు. సో.. దీనిని బట్టి ఈ సారి ఉద్యమ పార్టీ ఖాతా తెరుస్తోందా లేదా అనే సందేహాలు వస్తున్నాయి.



Read latest
Telangana News And Telugu News

Updated Date - May 10 , 2024 | 12:18 PM