AP Elections: సొంత ఇలాకాలో సాక్షాత్తు సీఎం జగన్ సతీమణికి చేదు అనుభవం..
ABN , Publish Date - Apr 30 , 2024 | 09:59 AM
Andhrapradesh: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతికి చేదు అనుభవం ఎదురైంది. స్వయంగా వైసీపీ నేతనే భారతిని నిలదీసిన పరిస్థితి. ఇదంతా జరిగింది కూడా సొంతగడ్డ పులివెందుల నియోజకవర్గంలోనే. పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం జగన్ పోటోకు సంబంధించి ఈ ఘటన చోటు చేసుకుంది.
కడప, ఏప్రిల్ 30: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jaganamohan Reddy) సతీమణి వైఎస్ భారతికి (YS Bharathi) చేదు అనుభవం ఎదురైంది. స్వయంగా వైసీపీ నేతనే భారతిని నిలదీసిన పరిస్థితి. ఇదంతా జరిగింది కూడా సొంతగడ్డ పులివెందుల (Pulivendula) నియోజకవర్గంలోనే. పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం జగన్ పోటోకు సంబంధించి ఈ ఘటన చోటు చేసుకుంది.
పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె మండలం కుమ్మరాపల్లె భారతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టదారు పాసుపుస్తకాల్లో సీఎం ఫోటో అంశంపై భారతిని వైసీపీ నేత భాస్కర్ రెడ్డి నిలదీశారు. భూముల పట్టాదారు పాసు పుస్తకాలపై సీఎం జగన్ రెడ్డి ఫోటో వేసుకోవడం తప్పంటూ సీఎం సతీమణికి వైసీపీ నేత తెలిపారు. తాతల కాలం నుంచి రైతుల సొంత భూముల పట్టాదారు పాసు పుస్తకాలపై ఆ రైతుల ఫోటోలు మాత్రమే ఉండాలని భారతికి భాస్కర్ రెడ్డి సూచించారు.
ప్రతి సమావేశంలో జగన్ రెడ్డి ‘‘నా ఎస్సీ.. నా బీసీ.. నా మైనారిటీ’’ అంటున్నారు తప్ప నా రైతన్న అని అనడం లేదని వైసీపీ నేత ప్రశ్నించారు. రైతు భరోసా క్రింద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.16 వేలలో సగం సొమ్ము కేంద్ర ప్రభుత్వానిదే అని ఆయన వెల్లడించారు. ‘‘నేను చెప్పిన సమస్యలను ఆయన సతీమణిగా జగన్ దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేయాలి’’ అని భారతిని భాస్కర్‌రెడ్డి కోరారు. అయితే అన్నీ విన్న వైఎస్ భారతి.. ఏమీ చెప్పకుండానే మౌనంగా వెనుదిరిగి వెళ్లిపోయారు.
ఇవి కూడా చదవండి...
160 సీట్లు మావే.. ఏపీ ఎన్నికలపై ఆంధ్రజ్యోతికి నారా లోకేశ్ ప్రత్యేక ఇంటర్వ్యూ
AP News: గుడివాడ గడ్డ - బెట్టింగ్ అడ్డా..
Read Latest AP News And Telugu News