Rains: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 5 రోజులు వర్షాలు.. మరోవైపు ఎండలు కూడా
ABN , Publish Date - May 21 , 2024 | 08:16 AM
దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు(rains) కురుస్తాయని, మరోవైపు ఉత్తర, తూర్పు రాష్ట్రాల్లో వేడిగాలుల ప్రభావం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఏయే ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉంది, ఎక్కడ ఎండల తీవ్రత ఉందనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
దక్షిణాది రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు(rains) కురుస్తాయని, మరోవైపు ఉత్తర, తూర్పు రాష్ట్రాల్లో వేడిగాలుల ప్రభావం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ నేపథ్యంలో వచ్చే ఐదు రోజులు కోస్తా ఆంధ్ర(AP), యానాం, తెలంగాణ(telangana), రాయలసీమ మీదుగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు వస్తాయని వాతావరణ అంచనా వేసింది. దీంతోపాటు తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్, కర్ణాటకలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షపాతం నమోదవుతుందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఈనెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు ఢిల్లీ(delhi)తో సహా ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాలు విపరీతమైన వేడిని కలిగి ఉన్నాయి. వాతావరణ శాఖ (IMD) ప్రకారం రాబోయే ఐదు రోజుల పాటు 'రెడ్ అలర్ట్' ప్రకటించారు. మంగళవారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్‌గా, కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. మరోవైపు మే 24న ఉష్ణోగ్రత 46 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.
స్కైమెట్ వెదర్ ప్రకారం సిక్కిం, లక్షద్వీప్‌తో పాటు ఉత్తరాఖండ్, ఈశాన్య భారతదేశంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా పశ్చిమ హిమాలయాలు, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, దక్షిణ మధ్యప్రదేశ్‌లలో తేలికపాటి వర్షం కనిపిస్తుంది. హర్యానా, ఢిల్లీ, యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో వేడిగాలులు వీస్తాయని అంచనా వేశారు.
ఇది కూడా చదవండి:
Mileage Tips: పెట్రోల్, డీజిల్ ఎంత పోయించుకుంటే బెటర్.. ఫుల్ ట్యాంక్ లేదా లీటర్
Iran President: ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి.. చమురు, గోల్డ్, స్టాక్ మార్కెట్‌పై ప్రభావం?
Read Latest National News and Telugu News