Share News

RSS: రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..

ABN , Publish Date - Apr 28 , 2024 | 02:32 PM

రిజర్వేషన్లపై(Reservations) అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య రోజు రోజుకీ మాటల యుద్ధం జరుగుతున్న వేళ ఆర్ఎస్ఎస్(RSS) చీఫ్ ఈ అంశంపై తమ వైఖరిని స్పష్టం చేశారు.

RSS: రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..

హైదరాబాద్: రిజర్వేషన్లపై(Reservations) అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య రోజు రోజుకీ మాటల యుద్ధం జరుగుతున్న వేళ ఆర్ఎస్ఎస్(RSS) చీఫ్ ఈ అంశంపై తమ వైఖరిని స్పష్టం చేశారు.

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్(Mohan Bhagwat) ఆదివారం హైదరాబాద్‌లోని ఓ విద్యా సంస్థలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. కొన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని సంఘ్ పరివార్ ఎప్పుడూ వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు అవసరమైతే వాటిని పొడిగించాలని సంఘ్ భావిస్తోందన్నారు.


‘‘ఆర్‌ఎస్‌ఎస్‌ రిజర్వేషన్‌‌లకు వ్యతిరేకమని, దీని గురించి బయట మాట్లాడలేమని ఓ వీడియో ద్వారా ప్రచారం చేస్తున్నారు. అది పూర్తిగా అబద్ధం. రాజ్యాంగం ప్రకారం అన్ని రిజర్వేషన్‌లకు సంఘ్‌ మొదటి నుంచి మద్దతు ఇస్తోంది. మాపై కొందరు కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగం ప్ర‌కారం అమల్లో ఉన్న రిజ‌ర్వేష‌న్ల‌కు తామెన్న‌డూ వ్య‌తిరేకంగా మాట్లాడ‌లేదు" అని మోహన్ చెప్పారు.

Hyderabad: అతి తక్కువ సెకండ్ హ్యాండ్ వస్తువులు.. వచ్చిన డబ్బుతో ఏం చేస్తారంటే

సమాజంలో వివక్ష ఉన్నంత కాలం రిజర్వేషన్లు కొనసాగించాలని ఆయన 2023లో నాగ్‌పూర్‌‌లో వ్యాఖ్యానించారు. సమాజంలో వివక్ష బయటకి కనిపించకపోయినా వేళ్లూనుకుందని అన్నారు.


రాహుల్ ఏమన్నారంటే..

ఇటీవల రిజర్వేషన్ సహా పలు అంశాలపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై విరుచుకుపడుతున్నారు. వాయనాడ్‌లో రాహుల్ మాట్లాడుతూ.. బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్ దేశంలోని వైవిధ్యాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.

భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు కాంగ్రెస్ పార్టీ వారిని అనుమతించదని చెప్పారు. మతం, కులం, ప్రాంత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడుకోవడం కాంగ్రెస్ కర్తవ్యం అని పునరుద్ఘాటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

Updated Date - Apr 28 , 2024 | 02:32 PM