Swati Maliwal: కేజ్రీ ఇంటి నుంచి కూల్‌గా వస్తోన్న స్వాతి మాలివాల్
ABN , Publish Date - May 18 , 2024 | 12:15 PM
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. బెయిల్ మీద బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికెళ్లానని స్వాతి మాలివాల్ వివరించారు. ఆ సమయంలో కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని సంచలన ఆరోపణలు చేశారు.
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్‌పై (Swati Maliwal) దాడి ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. బెయిల్ మీద బయటకు వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికెళ్లానని స్వాతి మాలివాల్ వివరించారు. ఆ సమయంలో కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని సంచలన ఆరోపణలు చేశారు. కుర్చీలో కూర్చొన్న తనపై బిభవ్ కుమార్ దాడి చేశారని, కాలితో తన్నారని ఆరోపించారు. ఆ తర్వాత బిభవ్ కుమార్‌పై పోలీసు స్టేషన్లో కేసు కూడా పెట్టారు. స్వాతి మాలివాల్ దాడి ఘటన ఆప్, బీజేపీ మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారితీసింది.
పావుగా మారిన స్వాతి
బీజేపీ చేతిలో స్వాతి మాలివాల్ పావుగా మారారని, అందుకే తమపై నిరాధారంగా ఆరోపణలు చేస్తున్నారని ఆప్ ఖండించింది. ఆ రోజు ఏం జరిగిందో చెప్పేందుకు ఓ వీడియోను విడుదల చేసింది. కేజ్రీవాల్ ఇంటి బయట రికార్డైన ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఆ వీడియోలో కేజ్రీవాల్ నివాసం నుంచి బయటకు వస్తోన్న స్వాతి మాలివాల్ స్పష్టంగా కనిపించారు. బయటకు వచ్చే సమయంలో మహిళ సెక్యూరిటీ సిబ్బంది ఆమె చేయి పట్టుకొని కనిపించారు. మెయిన్ రోడ్డు మీదకు వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. తర్వాత కూడా ఓ పోలీస్ అధికారి రాగా.. అతనితో స్వాతి మాలివాల్ మాట్లాడారు.
గాయాలు మాత్రం లేవు
ఆ ఫుటేజీలో స్వాతి మాలివాల్‌కు ఎలాంటి గాయాలు కనిపించలేదు. తనపై బిభవ్ దాడి చేశారని స్వాతి మాలివాల్ అంటున్నారు. వెంటనే బయటకు వస్తోన్న సమయంలో గాయాలు కనిపించడం లేదనే సందేహం కలుగుతుంది. స్వాతి మాలివాల్‌ను మహిళ అధికారి ఆపుతుండగా వదిలించుకుని వెళ్లినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సమయంలో ఎలాంటి గాయాలు లేవని.. తర్వాత గాయాలు ఎలా అయ్యాయని ఆప్ నేతలు ప్రశ్నిస్తున్నారు. స్వాతి మాలివాల్ వెనక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసు అని ఆప్ నేతలు విమర్శిస్తున్నారు.
Read Latest National News and Telugu News