Viral Video: వేట కోసం నీటి ఒడ్డున నక్కిన మొసలి.. ఇంతలో వెనుక నుంచి దూసుకొచ్చిన జాగ్వార్.. చివరకు.. | jaguar attacking crocodile while hiding in the water for hunting Video is going viral kjr spl
Share News

Viral Video: వేట కోసం నీటి ఒడ్డున నక్కిన మొసలి.. ఇంతలో వెనుక నుంచి దూసుకొచ్చిన జాగ్వార్.. చివరకు..

ABN , Publish Date - Sep 07 , 2024 | 06:34 PM

నీళ్లలో ఉన్న మొసలికి ఎంత పవర్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏనుగు లాంటి పెద్ద పెద్ద జంతువులు కూడా నీళ్లలో మొసలికి చిక్కి ఉక్కిరిబిక్కిరి అయిన సందర్భాలను చూస్తుంటాం. అయితే అలాంటి మొసళ్లకూ కొన్నిసార్లు ఛేదు అనుభవాలు ఎదురువుతుంటాయి. ఇలాంటి..

Viral Video: వేట కోసం నీటి ఒడ్డున నక్కిన మొసలి.. ఇంతలో వెనుక నుంచి దూసుకొచ్చిన జాగ్వార్.. చివరకు..

నీళ్లలో ఉన్న మొసలికి ఎంత పవర్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏనుగు లాంటి పెద్ద పెద్ద జంతువులు కూడా నీళ్లలో మొసలికి చిక్కి ఉక్కిరిబిక్కిరి అయిన సందర్భాలను చూస్తుంటాం. అయితే అలాంటి మొసళ్లకూ కొన్నిసార్లు ఛేదు అనుభవాలు ఎదురువుతుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మొసలి వేట కోసం నీటి ఒడ్డున నక్కి నక్కి దాక్కుంది. అదే సమయంలో ఓ జాగ్వార్ వెనుక వైపు నుంచి దూసుకొచ్చింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

ABN ఛానల్ ఫాలో అవ్వండి

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ మొసలి నది ఒడ్డున వేట కోసం కాపుకాసి ఉంటుంది. అయితే ఎంత సేపు ఎదురుచూసినా సమీపంలో ఎలాంటి జంతువూ కనిపించదు. ఇంతలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. అప్పటికే ఆకలితో ఉన్న ఓ జాగ్వార్ ఆ నీటిలో ఏదైనా దొరుతుకుందా.. అని ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో దానికి మొసలి కంట పడింది. ఏదేమైనా ఈ పూటకు మొసలిని భోంచేయాలి.. అని అనుకుని మెల్లగా సమీపానికి వచ్చేసింది.

Viral Video: ఎయిర్‌పోర్టులో సూట్‌కేస్‌తో షాకిచ్చిన యువతి.. ఆమె తింటున్నదేంటో చూస్తే నోరెళ్లబెడతారు..


ఉన్నట్టుండి వెనుక నుంచి వచ్చిన జాగ్వార్.. (jaguar attacked crocodile) మొసలిపై ఎటాక్ చేసింది. ఊహించని ఈ దాడికి మొసలి షాక్ అయింది. జాగ్వార్ నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించింది. కానీ జాగ్వార్ మాత్రం మొసలిని పట్టిన పట్టు వదల్లేదు. మొసలి మెడ వద్ద గట్టిగా పట్టుకుని కొరికేయడంతో ఉక్కిరిబిక్కిరి అయింది. చివరకు ఈ పోటీలో జాగ్వారే విజయం సాధించింది. మొసలి చంపేసి తన ఆకలి తీర్చుకుంది. ఇదంతా బోటుల్లో ఉన్న పర్యాటకుల సమక్షంలోనే జరిగింది.

Viral Video: ప్లాట్‌ఫామ్‌పై రీల్ చేస్తున్న యువకుడు.. అప్పుడే రైలు దిగుతున్న వృద్ధుడు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..


ఈ ఘటనను వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! ఈ జాగ్వార్ వేట ఎంతో భయకంరగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘నీటిలోని మొసలిపై జాగ్వార్ దాడి చేయడం ఇప్పుడే చూస్తున్నాం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 43 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఆర్టీసీ బస్సును ఆపి.. యువకుడి వింత నిర్వాకం.. వీడియోపై సజ్జనార్ ఏమన్నారంటే..


ఇవి కూడా చదవండి..

Viral Video: మందు కొడుతుండగా నాగు పాము ఎంట్రీ.. చేతిలోకి తీసుకుని అతడు చేసిన నిర్వాకం చూస్తే..

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసంఇక్కడ క్లిక్ చేయండి..


Updated Date - Sep 07 , 2024 | 06:35 PM