Viral: పెళ్లి జరుగుతుండగా వేదిక వెనుక వైపు వెళ్లిన వరుడు.. అనుమానం వచ్చి వధువు కూడా వెళ్లగా.. చివరకు..
ABN , Publish Date - Jun 15 , 2024 | 07:42 PM
వివాహ కార్యక్రమాల్లో వినూత్న ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలకు పెద్ద పెద్ద గొడవలు జరగడం కూడా చూస్తుంటాం. ఇలాంటి సందర్భాల్లో..
వివాహ కార్యక్రమాల్లో వినూత్న ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలకు పెద్ద పెద్ద గొడవలు జరగడం కూడా చూస్తుంటాం. ఇలాంటి సందర్భాల్లో వధూవరులు షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటుంటారు. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పెళ్లి జరుగుతుండగా.. వరుడు ఉన్నట్టుండి వేదిక వెనుక వైపు వెళ్లాడు. కాసేపటికి అనుమానం వచ్చి వధువు చూడటానికి వెళ్లగా షాకింగ్ దశ్యం కనిపించింది. చివరకు ఏం జరిగిందంటే..
సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ (Viral News) అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) భదోహి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫత్తుపూర్ ప్రాంతానికి చెందిన షీలాదేవి కుమార్తె పింకీకి జౌన్‌పూర్ జిల్లా జయరాంపూర్‌కు చెందిన గౌతమ్‌తో వివాహం (marriage) నిశ్చయమైంది. గురువారం వివాహం ఉండడంతో బుధవారం రాత్రి వరుడు తన బంధువులతో సహా గ్రామానికి చేరుకున్నారు. అనంతరం వధూవరులు (bride and groom) ఇద్దరూ సాంప్రదాయ దుస్తుల్లో కళ్యాణమంటపానికి చేరుకున్నారు.
బంధువులు, స్నేహితులు, సన్నిహితులతో సందడిగా ఉన్న మంటపంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. వరుడు ఉన్నట్టుండి వేదిక వెనుక వైపు వెళ్లాడు. అయితే ఎంత సేపటికీ రాకపోవడంతో వధువుకు అనుమానం వచ్చింది. చాలా సేపటి తర్వాత ఆమె కూడా వేదిక వెనుక వైపు వెళ్లింది. తీరా అక్కడికి వెళ్లి చూడగా.. వరుడు తన స్నేహితులతో కలిసి మద్యం, గంజాయి (Groom consuming alcohol and ganja) సేవిస్తూ కనిపించాడు. దీంతో ఆమెకు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది. తనకు ఇలాంటి వ్యక్తి తనకు భర్తగా రావడం ఇష్టం లేదని చెప్పింది. దీంతో వరుడితో పాటూ బంధువులంతా షాక్ అయ్యారు.
Viral video: ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా.. మంటలను ఇతనెంత సింపుల్‌గా ఆర్పేశాడో చూడండి..
బంధువులంతా కలిసి నచ్చజెప్పాలి చూసినా వధువు వినిపించుకోలేదు. ఈ క్రమంలో వరుడు ఆమెను దుర్భాషలాడాడు. దీంతో గొడవ మరింత పెద్దదైంది. పెళ్లిని రద్దు చేసుకున్న వధువు కుటుంబ సభ్యులు.. తమకు నష్టపరిహారం కింద రూ.8లక్షలకు కట్టాలని డిమాండ్ చేస్తూ వరుడి కుటుంబ సభ్యులను బంధించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వధువు కుటుంబ సభ్యులు వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
Viral video: నిధి కోసం వెతుకుతుండగా బయటపడ్డ సంచి.. సడన్‌గా లోపలి నుంచి దూసుకొచ్చిన పాము.. చివరకు..