Share News

Viral video: వధువును ముద్దు పెట్టుకున్న వరుడు.. ఆ వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్... ఏం జరిగిందని విచారించగా..

ABN , Publish Date - Jun 14 , 2024 | 08:35 PM

వివాహం కార్యక్రమం అంటేనే సరదాలు, సంతోషాలు, ఆప్యాయత, అనురాగాలకు నిలయంగా ఉంటుంది. అతిథులతో పాటూ వధూవరులు కూడా కలిసిపోయి సందడి చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు..

Viral video: వధువును ముద్దు పెట్టుకున్న వరుడు.. ఆ వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్... ఏం జరిగిందని విచారించగా..

వివాహం కార్యక్రమం అంటేనే సరదాలు, సంతోషాలు, ఆప్యాయత, అనురాగాలకు నిలయంగా ఉంటుంది. అతిథులతో పాటూ వధూవరులు కూడా కలిసిపోయి సందడి చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు తమాషా సంఘటనలు చోటు చేసుకుంటే.. మరికొన్నిసార్లు ఆశ్చర్యకర ఘటనలు చోటుచేసుకుంటుంటాయి. అయితే అప్పుడప్పుడూ షాకింగ్ ఘటనలు కూడా జరుగుతుంటాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. తన పెళ్లి జీవితాంతం గుర్తుండాలని ఓ వరుడు.. వేదికపై వధువును ముద్దు పెట్టుకున్నాడు. ఆ వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) హాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్లు ఇటీవల ఓకే రోజు జరిగాయి. వివాహాల సందర్భంగా ఇద్దరు వరుళ్లు తమ కుటుంబ సభ్యులు, బంధువులంతో కలిసి గ్రామానికి చేరుకున్నారు. అనుకున్నట్లుగా ఏర్పాట్లు కూడా ఎంతో ఘనంగా చేశారు. సాంప్రదాయ వస్త్రధారణలో వధూవరులంతా వేదికపైకి చేరుకున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. అక్క వివాహం సవ్యంగా సాగినా.. చెల్లెలి వివాహ సమయంలోనే సమస్య వచ్చి పడింది.

Viral video: నిప్పుతో చెలగాటమాడితే ఇలాగే ఉంటుంది మరి.. ఈ యువకుడికి ఏమైందో చూడండి..


తన వివాహం జీవితాంతం ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాలనే ఉద్దేశంతో వరుడు వెరైటీగా ప్లాన్ చేసుకున్నాడు. ఇందులో భాగంగా వేదికపై అందరి ముందు (Groom kissing the bride) వధువును ముద్దు పెట్టుకున్నాడు. దీంతో వధువు కుటుంబ సభ్యులకు కోపం కట్టలు తెంచుకుంది. కట్టుబాట్లు తప్పి అసభ్యకరంగా ప్రవర్తిస్తావా.. అంటూ అతడితో గొడవకు దిగారు. ఈ క్రమంలో వరుడు, వధువు కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది కాస్తా.. కాసేపటికి పెద్ద గొడవగా మారింది. ఈ క్రమంలో వరుడితో (Attack on groom) సహా చాలా మందిపై దాడి చేశారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురికి స్వల్పగాయాలయ్యాయి. వరుడు కూడా గాయపడడంతో వారందరినీ చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.

Viral video: బెడ్‌ బాగుందని కునుకు తీస్తున్నారా.. జాగ్రత్త..! ఇలాంటి ప్రమాదం కూడా పొంచి ఉండొచ్చు..


ఈ ఘటనతో వివాహ కార్యక్రమం ఆగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని విచారించారు. ఇరువైపు కుటుంబాలకు సర్దిచెప్పడంతో శాంతించారు. చివరకు గ్రామ పెద్దల సమక్షంలో అంతా కలిసి మరో ముహూర్థం ఖరారు చేసి, వివాహం జరిపించాలని నిర్థయించుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పెళ్లి నిజంగానే జీవితాంతం గుర్తుండిపోతుంది’’.. అంటూ కొందరు, ‘‘వధువును వరుడు ముద్దు పెట్టుకుంటే దాడులు చేయడమేంటీ’’... అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral video: ఇదేం చాటింపురా నాయనా..! పెళ్లిసంబంధం వస్తోందని చెప్పి.. ఎలాంటి షరతు పెట్టాడంటే..

Updated Date - Jun 14 , 2024 | 08:35 PM