Share News

Viral video: పాము కాటేసిందనే కోపంతో తల కొరికి మింగేశాడు.. చివరకు ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Jun 14 , 2024 | 08:43 PM

సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన అనేక వీడియోలు దర్శనమిస్తుంటాయి. కొన్నిసార్లు ఉన్నట్టుండి కంటబడే పాములు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. మరికొన్నిసార్లు ఊహించని విధంగా..

Viral video: పాము కాటేసిందనే కోపంతో తల కొరికి మింగేశాడు.. చివరకు ఏం జరిగిందంటే..
ప్రతీకాత్మక చిత్రం

సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన అనేక వీడియోలు దర్శనమిస్తుంటాయి. కొన్నిసార్లు ఉన్నట్టుండి కంటబడే పాములు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి. మరికొన్నిసార్లు ఊహించని విధంగా మనుషులు, జంతువులను కాటేసి ప్రాణాలు తీస్తుంటాయి. ఇలాంటి విషాదకర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పాము కాటేసిందనే కోపంతో ఓ వ్యక్తి దాని తలను కొరికి మింగేశాడు. దీంతో చివరకు ఏం జరిగిందంటే..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లా భెడియా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కోమ నేతం (32) అనే యవకుడు ఇటీవల ఓ రోజు రాత్రి ఇంటి ఆవరణలో నిద్రపోతున్నాడు. అయితే అర్ధరాత్రి సమయంలో ఓ పాము అతడిని కాటేసింది. దీంతో అతడికి మెలకువ వచ్చి చూశాడు. పాము తనను కాటేయడంతో అతడికి కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే ఆ పామును పట్టుకుని (man bit the snake head) తల కొరికేసి నమిలి మింగేశాడు.

Viral video: ఇదేం చాటింపురా నాయనా..! పెళ్లిసంబంధం వస్తోందని చెప్పి.. ఎలాంటి షరతు పెట్టాడంటే..


ఈ క్రమంలో అతడి కేకలు విని కుటుంబ సభ్యులు, చుట్టు పక్కల వారు పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు. విషయం తెలుసుకుని వారంతా షాక్ అయ్యారు. తర్వాత విషం బయటికి తీయాలనే ఉద్దేశంతో కాటేసిన ప్రాంతంలో కట్ చేసి, రక్తం బయటికి తీసేందుకు ప్రయత్నించారు. తర్వాత అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో.. ! ఎంత ఘోరం జరిగింది’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి పనులు ఎవరూ చేయొద్దు’’.. అంటూ మరికొందరు, షాకింగ్ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral video: వధువును ముద్దు పెట్టుకున్న వరుడు.. ఆ వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్... ఏం జరిగిందని విచారించగా..

Updated Date - Jun 14 , 2024 | 08:43 PM