Viral: వెతక్కుండానే దొరికేశాయోచ్..! వంట గదిలో మట్టి తవ్వుతుండగా.. జంటను వరించిన అదృష్టం..
ABN , Publish Date - Apr 27 , 2024 | 04:06 PM
వెతికితే దొరకనిదంటూ ఏమీ లేదు.. అన్న మాటను నిజం చేస్తూ మన కళ్ల ముందు చాలా ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అయితే కొన్నిసార్లు కొందరి విషయంలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. ఎక్కడా వెతకుండానే అదృష్టం వరిస్తుంటుంది. మట్టి పని చేసుకునే కూలీలకు ..
వెతికితే దొరకనిదంటూ ఏమీ లేదు.. అన్న మాటను నిజం చేస్తూ మన కళ్ల ముందు చాలా ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. అయితే కొన్నిసార్లు కొందరి విషయంలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతుంటుంది. ఎక్కడా వెతకుండానే అదృష్టం వరిస్తుంటుంది. మట్టి పని చేసుకునే కూలీలకు బంగారు నాణేలు దొరకడం, పాత ఇళ్లు కూలగొడుతుండగా.. పురాతన వస్తువులు బయటపడడం వంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు, ఫొటోలు, వీడియోలు.. నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ జంటకు ఎక్కడా వెతక్కుండానే అదృష్టం వరించింది. వంట గదిలో మట్టి తవ్వుతుండగా.. మధ్యలో షాకింగ్ దృశ్యం కనిపించింది.
సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ (Viral News) అవుతోంది. దక్షిణ ఇంగ్లాండ్‌లో (Southern England) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక వెస్ట్ డోర్సెట్ ప్రాంతానికి చెందిన ఓ జంట.. ఇదే ప్రాంతంలో 17వ శాతాబ్దానికి చెందిన ఓ ఇంటిని 2019లో కొన్నారు. ఇల్లు పాతగా ఉండడంతో ఇప్పటి టెక్నాలజీకి అనుగుణంగా ఇంటిని రీమోడల్ చేయాలని భావించారు. ఈ క్రమంలో తమ కిచెన్ గదిని కూడా తమ అభిరుచికి తగ్గట్టుగా డిజైన్ చేయించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం గదిలో కాంక్రీట్ ఫ్లోర్‌ను మొత్తం పీకించారు. అయితే నేలపై మట్టిని తొలగిస్తుండగా వారికి షాకింగ్ దృశ్యం కనిపించింది.
Viral Video: మట్టి తవ్వుతుండగా బయటపడ్డ రాయి.. వింతగా ఉండడంతో పగులగొట్టి చూడగా..
మట్టి తవ్వుతుండగా మధ్యలో వారికి ఓ కుండ కనపడింది. అందులో ఏముందా కొని పగులగొట్టిచూడగా.. రాజుల కాలం నాటి 1000 పురాతన నాణేలు (Ancient coins) బయటపడ్డాయి. ఈ నాణేలన్నీ 1642, 1644 కాలం నాటివని బ్రిటిష్ మ్యూజియం అధికారులు తెలిపారు. వీటిని ఏప్రిల్ 23న వేలం వేయగా.. ఔత్సాహికులు చాలా మంది హాజరయ్యారు. మొత్తం నాణేలను రూ.62.88లక్షల పలికాయి. 2019లోనే ఈ నాణేలు బయటపడగా.. అధికారులు వారికి సంబంధించిన నగదును ఈ ఏడాది అందజేశారు. ఆ నగదుతో ఇంటికి సంబంధించిన లోన్ కట్టుకుంటామని తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వార్త, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.