Share News

Viral Video: ఇది మామూలు కారు కాదుగా..! తలకిందులుగా ఎలా వెళ్తోందని చూస్తే.. షాకింగ్ ట్రిక్..

ABN , Publish Date - Apr 26 , 2024 | 03:35 PM

వింత వింతగా ఉన్న వాహనాలను నిత్యం చాలా చూస్తుంటాం. కొందరు తమ తెలివితేటలకు పదును పెట్టి వినూత్న డిజైన్లలో వాహనాలను తయారు చేస్తుంటారు. పాత కార్లను కొందరు హెలీకాప్టర్ల తరహాలో మారుస్తుంటారు. ఇంకొందరు...

Viral Video: ఇది మామూలు కారు కాదుగా..! తలకిందులుగా ఎలా వెళ్తోందని చూస్తే.. షాకింగ్ ట్రిక్..

వింత వింతగా ఉన్న వాహనాలను నిత్యం చాలా చూస్తుంటాం. కొందరు తమ తెలివితేటలకు పదును పెట్టి వినూత్న డిజైన్లలో వాహనాలను తయారు చేస్తుంటారు. పాత కార్లను కొందరు హెలీకాప్టర్ల తరహాలో మారుస్తుంటారు. ఇంకొందరు మూలన పడేసిన కార్లను సైతం మళ్లీ సరికొత్తగా మార్చి వాడుకలోకి తెస్తుంటారు. ఇలాంటి వినూత్న వాహనాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. తలకిందులుగా వెళ్తున్న కారును చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చివరకు అసలు విషయం తెలుసుకుని అంతా అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. అమెరికా (America) వీధుల్లో రయ్యిన దూసుకెళ్తున్న ఓ వినూత్న కారును (Innovative car) చూసి అంతా అవాక్కవుతున్నారు. అందులో విశేషం ఏముందీ అనుకుంటున్నారా... ఈ కారు మిగతా వాహనాల్లా కాకుండా తలకిందులుగా వెళ్తోంది. ఈ కారును చూడగానే అంతా.. ‘‘అరే..! ఇదేంటీ కారు తిరగబడినా కూడా వెళ్తోంది’’.. అని అశ్చర్యం వ్యక్తం చేశారు. వింతగా అనిపిస్తుండడంతో అంతా దాని తదేకంగా చూడసాగారు. కారు తిరగబడితే ఎలా ఉంటుందో.. టైర్లు ఇంజిన్ సహా మిగతా భాగాలన్నీ అచ్చం అలాగే ఉన్నాయి.

Viral Video: కారును ఇలాక్కూడా క్లీన్ చేయొచ్చా.. ఈ డ్రైవర్ కక్కుర్తి మామూలుగా లేదుగా..

అయితే సమీపానికి వెళ్లి తీక్షణంగా పరిశీలించగా.. కారు తయారీదారు తెలివితేటలు బయటపడ్డాయి. కారును అలా డిజైన్ చేశారని తెలిసిపోతుంది. అయితే కింద టైర్లు కనపడకుండా జాగ్రత్తపడ్డారు. దీంతో కారు వెళ్తుండడం చూస్తే.. తిరబడిన కారు ముందుకు వెళ్తు్న్నట్లు కనిపిస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్..! ఈ కారు మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘స్పీడ్ బ్రేకర్లు వస్తే పరిస్థితి ఏంటీ’’,, అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఎండ వేడి భరించలేక.. లారీ నడుపుతూనే ఈ డ్రైవర్ చేసిన నిర్వాకం చూస్తే..

Updated Date - Apr 26 , 2024 | 03:35 PM