Share News

Viral Video: కారును ఇలాక్కూడా క్లీన్ చేయొచ్చా.. ఈ డ్రైవర్ కక్కుర్తి మామూలుగా లేదుగా..

ABN , Publish Date - Apr 25 , 2024 | 07:40 PM

కొందరి తెలివితేటలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొందరి తెలివితేటలు చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇంకొందరేమో అతి తెలివి ప్రదర్శిస్తూ పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...

Viral Video: కారును ఇలాక్కూడా క్లీన్ చేయొచ్చా.. ఈ  డ్రైవర్ కక్కుర్తి మామూలుగా లేదుగా..

కొందరి తెలివితేటలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. మరికొందరి తెలివితేటలు చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. ఇంకొందరేమో అతి తెలివి ప్రదర్శిస్తూ పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ కారు డ్రైవర్ కక్కుర్తి చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘కారును ఇలాక్కూడా క్లీన్ చేయొచ్చా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాజధాని లక్నోలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ఓ ప్రాంతంలో రోడ్డు పక్కనే బ్రడ్జి పనులు జరుగుతున్నాయి. దీంతో వాహనాలన్నింటినీ ఇరుకు రోడ్డుపైకి మళ్లించారు. అయితే ఆ రోడ్డులో మట్టి పేరుకుపోవడంతో దుమ్ము లేస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దుమ్ము లేయకుండా ఉండేందుకు ఓ స్పింకర్ వాహనంలో నీటిని ఫోర్స్‌గా రోడ్డుపై చల్లుతున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే ఓ సరదా సంఘటన చోటు చేసుకుంది. అదే సమయంలో ఓ కారు అటుగా వచ్చింది. నీళ్లు కొడుతున్న వాహనాన్ని చూడగానే కారు యజమానికి (Car owner) కక్కుర్తి పుట్టింది.

Viral Video: మేనకోడలి పెళ్లిలో ఖుషీ ఖుషీగా డాన్స్ చేయబోతూ.. అంతలోనే..

‘‘డబ్బులు పెట్టి వాటర్ సర్వీసింగ్ చేయించే బదులు.. ఈ స్పింకర్ వాహనాన్ని సద్వినియోగం చేసుకుంటే పోలా’’.. అని అనుకుంటూ తన కారును రోడ్డుపై నీళ్లు కొడుతున్న వాహనం సమీపానికి పోనిచ్చాడు. దీంతో రోడ్డుపై పడాల్సిన నీరంతా ఫోర్స్‌గా కారుపై పడుతోంది. చాలా దూరం ఇలా కారును ఆ వాహనం వెనుకే పోనిచ్చాడు. దీంతో రూపాయి ఖర్చు లేకుండా కారు మొత్తం శుభ్రం అయిపోయిందన్నమాట. ఈ కారు యజమాని అతి తెలివితేటలు చూసి పక్కన ఉన్న వారంతా అవాక్కయ్యారు. ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! ఇతడి కక్కుర్తి మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయయ్యా.. ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 89వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఆటో డ్రైవర్‌పై మహిళకు అనుమానం.. వెనుక నుంచి చూడగా.. అతడు చేస్తున్న నిర్వాకం.. చివరకు..

Updated Date - Apr 25 , 2024 | 07:40 PM