Viral Video: మట్టి తవ్వుతుండగా బయటపడ్డ రాయి.. వింతగా ఉండడంతో పగులగొట్టి చూడగా.. | ancient jewelery coming out of stone video is going viral kjr spl
Share News

Viral Video: మట్టి తవ్వుతుండగా బయటపడ్డ రాయి.. వింతగా ఉండడంతో పగులగొట్టి చూడగా..

ABN , Publish Date - Apr 26 , 2024 | 07:43 PM

మట్టి తవ్వకాల్లో కొన్నిసార్లు చిత్రవిచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఒకదానికోసం మట్టి తవ్వుతుంటే ఇంకో వస్తువు బయటపడడం, పొలాల్లో మట్టి పనులు చేస్తుంటే వజ్రాలు బయటపడడం వంటి ఘటనల గురించి రోజూ వింటూనే ఉంటాం. ఇలాంటి ...

Viral Video: మట్టి తవ్వుతుండగా బయటపడ్డ రాయి.. వింతగా ఉండడంతో పగులగొట్టి చూడగా..

మట్టి తవ్వకాల్లో కొన్నిసార్లు చిత్రవిచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఒకదానికోసం మట్టి తవ్వుతుంటే ఇంకో వస్తువు బయటపడడం, పొలాల్లో మట్టి పనులు చేస్తుంటే వజ్రాలు బయటపడడం వంటి ఘటనల గురించి రోజూ వింటూనే ఉంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట తెగ సందడి చేస్తుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతోంది. మట్టి తవ్వుతుండగా ఓ రాయి బయటపడింది. అయితే ఆ రాయి విచిత్రంగా ఉండడంతో పగులగొట్టారు. లోపల దృశ్యం చూసి అంతా షాక్ అయ్యారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి మట్టిలో దేని కోసమో తవ్వుతుంటాడు. అయితే అతడికి మధ్యలో ఓ రాయి కనిపిస్తుంది. దాని బటయికి తీసి చూడగా.. ఏదో విచిత్రంగా అనిపిస్తుంది. దీంతో సుత్తి, ఇనుప మొల సాయంతో దాన్ని బద్దలుకొడతాడు. దీంతో ఆ రాయి చివరకు రెండుగా చీలిపోతుంది. అయితే అందులో ఆశ్చర్యకరంగా (Jewels were found in the stone) పురాతన ఆభరణాలు బయటపతాయి.

Viral Video: సింహానికి ఝలక్ ఇచ్చిన దున్నపోతు.. చంపాలని శక్తికొద్దీ పరుగెత్తినా.. చివరకు..


గొలుసులు, ఉంగరాలు తదితర అనేక ఆభరణాలు అందులో కనిపిస్తాయి. రాయిలో ఆభరణాలు బయటపడడం చూసి అంతా షాక్ అయ్యారు. కాగా, ఇది చూసేందుకు కావాలని చేసినట్లుగా అనిపిస్తున్నా కూడా.. వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో..! ఇలా జరగడం నిజంగా సాధ్యమా’’.. అంటూ కొందరు, ‘‘ఇదంతా వ్యూస్, లైక్‌ల కోసం కావాలనే చేశారు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 14వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral: వరుడి లోపాన్ని తెలివిగా బయటపెట్టిన వధువు.. దండలు మార్చుకుంటుండగా.. ఆమె చేసిన పనికి.. చివరకు..

Updated Date - Apr 26 , 2024 | 07:43 PM