Viral Video: నీటిపై ఎగురుతున్న డ్రోన్.. నీటి నుంచి పైకొచ్చిన మొసలి.. చివరికి షాకింగ్ ట్విస్ట్..
ABN , Publish Date - Dec 19 , 2024 | 09:26 AM
మొసలి దాడికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. పెద్ద పెద్ద జంతువులను కూడా మొసళ్లు ఎంతో ఈజీగా వేటాడేస్తుంటాయి. నీటి ఒడ్డున ఉన్న జంతువులపై కూడా ఎంతో చాకచక్యంగా దాడి చేసి, నీటి లోపలికి లాక్కెళ్తుంటాయి. ఇలాంటి ..
మొసలి దాడికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. పెద్ద పెద్ద జంతువులను కూడా మొసళ్లు ఎంతో ఈజీగా వేటాడేస్తుంటాయి. నీటి ఒడ్డున ఉన్న జంతువులపై కూడా ఎంతో చాకచక్యంగా దాడి చేసి, నీటి లోపలికి లాక్కెళ్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ విచిత్ర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. నీటిపై డ్రోన్ ఎగురుతుండగా.. నీటి లోపలి నుంచి పైకి వచ్చిన మొసలి సడన్‌గా దాడి చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరు ఓ చెరువులోకి డ్రోన్ ఎగురవేశారు. నీటిపై డ్రోన్ అటూ, ఇటూ తిరుగుతుండగా.. ఓ పెద్ద మొసలి నీటి లోపలి నుంచి పైకి వచ్చింది. నీటి పైకి వచ్చిన మొసలి.. పైన ఎగురుతున్న డ్రోన్‌ను గమనిస్తుంది. డ్రోన్‌ను మొసలి సమీపానికి పంపగా.. అదేదో పక్షిగా భావించింది.
Viral Video: వామ్మో.. భయానక ప్రమాదం నుంచి ఈమెలా బయటపడిందో చూడండి..
ఈ క్రమంలో ఒక్కసారిగా నీటి నుంచి పైకి వచ్చిన మొసలి.. డ్రోన్‌ను నోటిలోకి లాగేసుకుంది. దాన్ని కొరికేడంతో (crocodile bit the drone) ఒక్కసారిగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. డ్రోన్‌లోని బ్యాటరీ పేలిపోవడంతో మొత్తం పొగ వ్యాపించింది. అయినా ఆ మొసలి అదేమీ పట్టించుకోకుండా డ్రోన్‌ను నమిలి మింగేసింది. అక్కడున్న వారు ఈ ఘటనను మొత్తం వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Viral Video: ఈ ఏనుగుకు పద్ధతి కూడా తెలుసు.. దారి మధ్యలో వ్యక్తి అడ్డుగా ఉండడంతో..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ మొసలిని చూస్తుంటే భయమేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలా చేయడం కరెక్ట్ కాదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 860కి పైగా లైక్‌లు, 2.49 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..