Viral Video: వామ్మో.. భయానక ప్రమాదం నుంచి ఈమెలా బయటపడిందో చూడండి..
ABN , Publish Date - Dec 19 , 2024 | 08:07 AM
అనూహ్య ప్రమాదాల సమయంలో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు కొందరు పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి క్షేమంగా బయటపడుతుంటారు. మరికొందరు ప్రమాదాల నుంచి ఎంతో చాకచక్యంగా తప్పించుకుంటుంటారు. ఇలాంటి..
అనూహ్య ప్రమాదాల సమయంలో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు కొందరు పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి క్షేమంగా బయటపడుతుంటారు. మరికొందరు ప్రమాదాల నుంచి ఎంతో చాకచక్యంగా తప్పించుకుంటుంటారు. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ పెద్ద ప్రమాదం నుంచి చివరి క్షణంలో తప్పించుకుంది. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ (woman) రోడ్డుపై నడుస్తూ వెళ్తుంటుంది. దారి మధ్యలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్కన పార్క్ చేసిన కారు పక్కన నడుస్తూ వెళ్తుండగా.. ఎదురుగా ఓ కారు అత్యంత వేగంగా అటు వైపు వస్తుంది. కారు తన వైపు రావడాన్ని గమనించిన ఆమె.. చివరి క్షణంలో అప్రమత్తమై వేగంగా పక్కకు జరుగుతుంది.
Viral Video: ఈ ఏనుగుకు పద్ధతి కూడా తెలుసు.. దారి మధ్యలో వ్యక్తి అడ్డుగా ఉండడంతో..
వేగంగా దూసుకొచ్చిన ఆ కారు ఆమె పక్కన పార్క్ చేసి ఉన్న కారును ఢీకొని (Car Accident).. పల్టీలు కొడుతూ వెళ్లి రోడ్డు మధ్యలో పడిపోతుంది. ఢీకొన్న సమయంలో ఆమె చున్నీ కారుకు తగులుకుంటుంది. వెంట్రుకవాసిలో ప్రమాదం నుంచి బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అదృష్టమంటే ఈమెదే’’.. అంటూ కొందరు, ‘‘వెంట్రకవాసిలో ప్రమాదం తప్పిపోవడం అంటే ఇదే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 730కి పైగా లైక్‌లు, 87వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఇతడెవరో గానీ మరీ విచిత్రంగా ఉన్నాడే.. ఆటో పడిపోతున్నా.. ఆ పని మాత్రం ఆపలేదుగా..
ఇవి కూడా చదవండి..
Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..