Share News

Viral video: నరాలు తెగే ఉత్కంఠ.. జిరాఫీని చుట్టుముట్టిన సింహాలు.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..

ABN , Publish Date - Jun 26 , 2024 | 08:44 PM

సింహం వేటకు వెళ్తే ఖాళీ కడుపుతో తిరిగొచ్చే పరిస్థితి దాదాపు ఉండదనే చెప్పొచ్చు. ఎలాంటి జంతువునైనా తన పంజాతో ఇట్టే మరికరిపించగలదు. అందుకే దాన్ని అడవికి రాజు అని అంటూ ఉంటారు. అలాంటి..

Viral video: నరాలు తెగే ఉత్కంఠ.. జిరాఫీని చుట్టుముట్టిన సింహాలు.. చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్..

సింహం వేటకు వెళ్తే ఖాళీ కడుపుతో తిరిగొచ్చే పరిస్థితి దాదాపు ఉండదనే చెప్పొచ్చు. ఎలాంటి జంతువునైనా తన పంజాతో ఇట్టే మరికరిపించగలదు. అందుకే దాన్ని అడవికి రాజు అని అంటూ ఉంటారు. అలాంటి రాజుకూ కొన్నిసార్లు నిరాశే ఎదురవుతుంటుంది. అది కూడా చిన్న చిన్న జంతువుల చేతిలో పరాభవం ఎదురవుతుంటుంది. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. సింహాల గుంపు ఓ జిరాఫీని చుట్టు ముట్టింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. సింహాలన్నీ కలిసి వేట కోసం వెతుకుతుంటాయి. అయితే అదే సమయంలో ఓ జిరాఫీ అటుగా వెళ్తుంది. జిరాఫీని చూసిన సింహాలు.. తమ పంట పండిందనుకుంటూ మూకుమ్మడిగా దాడి చేస్తాయి. ముందుగా ఓ సింహం జిరాఫీపై దూకుతుంది. తన పంజాతో జిరాఫీని మట్టికరిపించాలని చూస్తుంది. అయినా జిరాఫీ మాత్రం ఎంతో ధైర్యంగా సింహాన్ని తిప్పికొడుతుంది.

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న మూడో తలను.. 30 సెకన్లలో గుర్తించగలరా..?


తన వెనుక కాళ్లతో గట్టిగా పంచ్‌లు ఇస్తూ ముందుకు దూసుకుపోతుంది. మరోవైపు సింహాలన్నీ మూకుమ్మడిగా జిరాఫీని చంపేయాలని చూస్తాయి. అయినా జిరాఫీ ఏమాత్రం భయపడకుండా అత్యంత వేగంగా పరుగెడుతూ.. కాళ్లతో సింహాలను తన్నుతూ వాటికి దొరక్కుండా (giraffe escaped from the lions) అత్యంత వేగంగా పరుగెడుతుంది. దీంతో సింహాలకు చివరకు నిరాశే ఎదురవుతుంది. అన్ని సింహాలు ప్రయత్నించినా జిరాఫీని చంపలేకపోతాయి.

Viral video: ఇలాంటివన్నీ ఇక్కడే జరుగుతుంటాయేమో.. ఈ మెట్రోలో ప్రేమికుల నిర్వాకం చూస్తే..


ఈ ఘటనను ఫారెస్ట్ రైడింగ్‌లో ఉన్న పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘జిరాఫీ పవర్.. మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఈ జిరాఫీని చూసి ఎంతో నేర్చోవాల్సి ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral video: సిమెంట్ మూటను ఇలా ఎవరైనా ఎత్తగలరా.. ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా..

Updated Date - Jun 26 , 2024 | 08:44 PM