Viral: వివాహానికి ముందు వింత ఒప్పందం.. పెళ్లి తర్వాత కోరిక తీర్చలేకపోయిన భర్త.. చివరకు..
ABN , Publish Date - Jun 25 , 2024 | 03:29 PM
కొందరు వివాహాలకు ముందు వింత వింత కండీషన్లు పెట్టడం చూస్తుంటాం. వాటిని పాటించడంలో భార్యాభర్తల్లో ఎవరో ఒకరు విఫలమవడం, తద్వారా గొడవలు చోటు చేసుకోవడం జరుగుతుంటుంది. సాధారణంగా...
కొందరు వివాహాలకు ముందు వింత వింత కండీషన్లు పెట్టడం చూస్తుంటాం. వాటిని పాటించడంలో భార్యాభర్తల్లో ఎవరో ఒకరు విఫలమవడం, తద్వారా గొడవలు చోటు చేసుకోవడం జరుగుతుంటుంది. సాధారణంగా పెళ్లికి ముందు వధువు సిగరెట్లు, మద్యం తాగొద్దని కండీషన్లు పెడుతుంటుంది. ఒకవేళ అలవాట్లు ఉన్నా.. పెళ్లి తర్వాత వదిలిపెట్టాలని కూడా నిబంధన విధిస్తుంటారు. అయితే తాజాగా ఓ వధువు.. కాబోయే భర్తకు వింత కండీషన్ విధించింది. పెళ్లి తర్వాత భార్య కోరికను భర్త తీర్చలేకపోయాడు. దీంతో చివరకు ఏం జరిగిందంటే..
సోషల్ మీడియాలో ఓ వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. ఆగ్రాలో (Agra) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన యువతికి.. ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది. అయితే ఈ సందర్భంగా సదరు యువతి తన కాబోయే భర్తకు వింత కండీషన్ (strange condition) విధించింది. అతను స్వతహాగా జిమ్ ట్రైనర్ కావడంతో.. వివాహం తర్వాత తన బరువు తగ్గించాలని నిబంధన విధించింది. ఇందుకు అతను కూడా అంగీకరించడంతో గతేడాది వీరి వివాహం జరిగిపోయింది.
Viral video: ఇది కదా స్నేహమంటే.. పాము నుంచి సహచురుడిని కాపాడేందుకు.. ఈ ఉడుత చేసిన పని..
అయితే వివాహానంతరం అసలు సమస్య వచ్చి పడింది. భార్యకు ఇచ్చిన మాటను భర్త నెరవేర్చలేకపోయాడు. వివాహానికి ముందు ఆమె 75కిలోలు ఉండేది. వివాహం తర్వాత భర్త ఆమె బరువును ఏమాత్రం తగ్గించలేకోపోయాడు. దీంతో ఆమె కోపం కట్టలు తెంచుకుంది. ‘‘బరువు తగ్గిస్తానని చెప్పి కొంచెం కూడా తగ్గించలేకపోయావ్.. నీలాంటి వాడితో కొనసాగడం చాలా కష్టం’’.. అని చెప్పేసి పుట్టింటికి వెళ్లిపోయింది. తర్వాత ఏకంగా భర్తతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
Viral video: ఇది ఏనుగుల దండ‘యాత్ర’.. ఉదృతంగా ప్రవహిస్తున్న నదిని ఎలా దాటుతున్నాయో చూస్తే..
వధువు నిర్ణయంతో ఆమె భర్తతో పాటూ బంధువులంతా షాక్ అయ్యారు. చాలా మంది పెద్దలు కలుగజేసుకుని ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆమె మాత్రం అసలు వినిపించుకోలేదు. ప్రస్తుతం ఫ్యామిలీ కౌన్సిలర్లు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినా ఆమె మాత్రం తగ్గేదేలేదు అన్నట్లుగా ప్రవర్తిస్తోంది. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
Viral: ఖంగుతినిపించిన ఫోన్.. అంత్రకియలు నిర్వహిస్తుండగా బతికొచ్చిన వ్యక్తి.. అసలేం జరిగిందంటే..