Share News

Viral video: చిరుత కన్నేస్తే ఇలాగే ఉంటుంది మరి.. నీటిలోని మొసలిని ఎలా వేటాడిందో చూస్తే..

ABN , Publish Date - Jun 26 , 2024 | 03:39 PM

మామూలుగానే చిరుత వేట భయంకరంగా ఉంటుంది.. అలాంటిది ఇక ఆకలితో ఉన్న చిరుత వేట ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పులులు, సింహాల వేటకు సంబంధించిన అనేక..

Viral video: చిరుత కన్నేస్తే ఇలాగే ఉంటుంది మరి.. నీటిలోని మొసలిని ఎలా వేటాడిందో చూస్తే..

మామూలుగానే చిరుత వేట భయంకరంగా ఉంటుంది.. అలాంటిది ఇక ఆకలితో ఉన్న చిరుత వేట ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పులులు, సింహాల వేటకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే వాటిలో కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యం కలిగితే.. మరికొన్ని వీడియోలను చూస్తే గూజ్‌బమ్స్ తెప్పించేలా ఉంటాయి. అలాంటి గూజ్‌బమ్స్ తెప్పించే వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆకలితో ఉన్న చిరుతకు నీటిలో మొసలి కనిపిస్తుంది. దీంతో నీటిలోకి దూకిన చిరుతు... చివరకు దాన్ని వేటాడిన విధానం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ చిరుత పులి.. వేట కోసం ఎదురు చూస్తుంటుంది. అడవిలో అటూ, ఇటూ తిరుగుతున్న క్రమంలో దానికి ఓ నది నీటిలో పెద్ద మొసలి కనిపిస్తుంది. సాధారణంగా నీటిలో ఉన్న మొసలి సమీపానికి వెళ్లడానికి కూడా ఏం జంతువూ సాహసించదు. అయితే ఈ చిరుత మాత్రం అదేమీ పట్టించుకోకుండా మొసలిని టార్గెట్ చేసింది. నది ఒడ్డున నడుస్తూ మొసలిని అనుసరిస్తుంది.

Viral video: ఒంట్లో శక్తి లేకున్నా సింహాలకు ఎదురుగా వెళ్లి భయపెట్టిన హైనా.. చివరకు ఏం జరిగిందో చూడండి..


ఈ క్రమంలో మొసలి ఒడ్డుకు రాగానే (Leopard attack on crocodile) ఒక్కసారిగా దానిపైకి దూకేసింది. చిరుత మెరుపుదాడికి షాక్ అయిన మొసలి.. దానిపై ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నించింది. దీంతో మరింత రెచ్చిపోయిన చిరుత.. చివరకు దాని మెడ పట్టుకుంది. అయినా మొసలి మధ్యలో తప్పించుకుని నీటిలో మునుగుతుంది. కానీ చిరుత దాన్ని వదలకుండా తాను కూడా నీటిలోకి మునిగి చాలా సేపు శ్రమించి, ఎట్టకేలకు మొసలిని మళ్లీ గట్టిగా పట్టుకుని ఒడ్డుకు లాక్కొస్తుంది.

Viral video: చూసేందుకు స్కూల్ పిల్లలే అయినా.. రోడ్డుపై ఈ బాలికల నిర్వాకం చూస్తే..


అంతవరకూ చిరుత నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన మొసలి.. చివరకు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మొసలికి ఆహారమైపోతుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇలాంటి భయంకరమైన వేట ఎన్నడూ చూడలేదు’’.. అంటూ కొందరు, ‘‘చిరుతపులి వేట మామూలుగా లేదుగా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral video: సిమెంట్ మూటను ఇలా ఎవరైనా ఎత్తగలరా.. ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా..

Updated Date - Jun 26 , 2024 | 03:39 PM