Share News

Viral Video: వీరి తెలివి తెల్లారిపోనూ.. సబ్బు చోరీ కాకుండా వీళ్లు చేసిన నిర్వాకం చూస్తే..

ABN , Publish Date - Aug 14 , 2024 | 06:46 PM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో అనేక రకాల వ్యక్తులు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొందరు తెలివిగా ఆలోచిస్తే.. మరికొందరు అతి తెలివిగా ఆలోచిస్తూ ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. ఇంకొందరు చేసే పనులు చాలా సిల్లీగా అనిపిస్తుంటాయి. మొత్తానికి ...

Viral Video: వీరి తెలివి తెల్లారిపోనూ.. సబ్బు చోరీ కాకుండా వీళ్లు చేసిన నిర్వాకం చూస్తే..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో అనేక రకాల వ్యక్తులు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొందరు తెలివిగా ఆలోచిస్తే.. మరికొందరు అతి తెలివిగా ఆలోచిస్తూ ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. ఇంకొందరు చేసే పనులు చాలా సిల్లీగా అనిపిస్తుంటాయి. మొత్తానికి అంతా కలిసి వ్యూస్, లైక్‌ల కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. సబ్బు చోరీ కాకుండా కొందరు తీసుకున్న అతి జాగ్రత్తలు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు తదితరాల వద్ద కొందరు నీళ్ల ట్యాంక్‌ల వద్ద గ్లాసును గొలుసుతో కట్టడం చూస్తుంటాం. ఇలాంటి తెలివితేటలు చూసి ఇన్‌స్పైర్ అయ్యారో ఏమో గానీ.. కొందరు అతి తెలివిగా ఆలోచించారు. నీళ్ల ట్యాంక్ వద్ద ఉన్న సబ్బును ఎవరూ చోరీ చేయకుండా చేసేందుకు వింతగా ఆలోచించారు.

Viral Video: రైల్లో రీల్స్ చేస్తుండగా యువతికి షాకింగ్ అనుభవం.. డోరు వద్ద వేలాడుతుండగా..


చివరకు సబ్బు చోరీ కాకుండా మధ్యలో రంధ్రం చేసి, దానికి తాడు కడతారు. ఇలా ఆ తాడును (people tied rope to soap prevent from stolen) పక్కన ఉన్న ఇనుప ఊచకు బిగిస్తారు. ఇలా వీళ్లు సిల్లీగా ఆలోచించి సబ్బును ఎవరూ చోరీ చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. వీరి అతి తెలివితేటలు చూసిన వారంతా అంతా అవాక్కవుతున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: స్కూటీపై వెళ్తూ జారిపడ్డ వ్యక్తి.. వెనుక నుంచి దూసుకొచ్చిన లారీ.. చివరకు..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇండియాలో ఇలాంటి వారికి ఎలాంటి కొదవా లేదు’’.. అంటూ కొందరు, ‘‘తాడుతో కట్టినంత మాత్రాన.. లాగితే రాదా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 13 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: నరాలు తెగే ఉత్కంఠ.. సింహం, కుక్కల పోటాపోటీ.. సడన్‌గా తెరుచుకున్న గేట్.. చివరకు..

Updated Date - Aug 14 , 2024 | 06:46 PM