Share News

Viral Video: కోతి ముందు పిల్ల చేష్టలు చేస్తే.. ఇలాగే ఉంటుంది మరి.. ఈ బాలిక పరిస్థితి చూస్తే..

ABN , Publish Date - Aug 14 , 2024 | 07:32 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ జూలో పర్యాటకులు సంచరిస్తుండగా ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పెద్ద బోనులో ఉన్న కోతులను చూసేందుకు చాలా మంది నిలబడి ఉన్నారు. వారిలో ఓ బాలిక ఇనుప ఊచల దగ్గరికి వెళ్లి..

Viral Video: కోతి ముందు పిల్ల చేష్టలు చేస్తే.. ఇలాగే ఉంటుంది మరి.. ఈ బాలిక పరిస్థితి చూస్తే..

కుక్కలు, కోతులు సాధారణంగా మనుషుల జోలికి రావు. అయితే వాటిని కెలికితే మాత్రం పరిస్థితి దారుణంగా ఉంటుంది. అంతవరకూ సైలెంట్‌గా ఉన్న ఆ జంతువులు.. ఆ తర్వాత ఒక్కసారిగా చెలరేగిపోతుంటాయి. ఇలాంటి ఘటనలకు నిదర్శనంగా అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ బాలిక కోతి ముందు పిచ్చి చేష్టలు చేసింది. చివరకు ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ జూలో పర్యాటకులు సంచరిస్తుండగా ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పెద్ద బోనులో ఉన్న కోతులను చూసేందుకు చాలా మంది నిలబడి ఉన్నారు. వారిలో ఓ బాలిక ఇనుప ఊచల దగ్గరికి వెళ్లి కోతిని వీడియో తీస్తోంది. ఊచలకు వేలాడుతున్న కోతి కూడా ఆ బాలికను గమనిస్తోంది. అయితే ఈ క్రమంలో ఆ బాలిక ఓ అడుగు ముందుకేసి కోతి ముందు పిచ్చి చేష్టలు చేసింది. చేత్తో కొడుతూ దాన్ని దూరంగా తరిమికొట్టేందుకు ప్రయత్నిస్తుంది.

Viral Video: స్కూటీపై వెళ్తూ జారిపడ్డ వ్యక్తి.. వెనుక నుంచి దూసుకొచ్చిన లారీ.. చివరకు..


ఇలా చాలా సేపు కోతి దగ్గరగా చేయి విసురుతుంది. దీంతో అప్పటిదాకా సైలెంట్‌గా ఉన్న కోతి.. ఒక్కసారిగా రెచ్చిపోతుంది. చేయి ఊచల మధ్యలో (monkey attacked the girl) నుంచి బయటికి పెట్టి బాలిక జుట్టును పట్టుకుంటుంది. దీంతో ఆ బాలిక ఒక్కసారిగా ఖంగుతింటుంది. కోతి నుంచి విడిపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. అయినా కోతి మాత్రం ఆమెను వదలకుండా జుట్టును గట్టిగా పట్టుకుంటుంది.

Viral Video: వీరి తెలివి తెల్లారిపోనూ.. సబ్బు చోరీ కాకుండా వీళ్లు చేసిన నిర్వాకం చూస్తే..


ఈ ఘటనతో పక్కన ఉన్న వారు అలెర్ట్ అవుతారు. దగ్గరికి వెళ్లి కోతిని మందలిస్తూ దూరంగా పంపించే ప్రయత్నం చేస్తారు. అయితే అప్పటికీ ఆ కోతికి కోపం తగ్గదు. అలాగే బాలికను గట్టిగా పట్టుకుని దగ్గరికి లాగుతూ ఉంటుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో కోతికి కోపం వస్తే ఇలా ఉంటుందా’’.. అంటూ కొందరు, ‘‘కోతి ముందు పిచ్చి చేష్టలు చేస్తే ఇలాగే ఉంటుంది మరి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: నరాలు తెగే ఉత్కంఠ.. సింహం, కుక్కల పోటాపోటీ.. సడన్‌గా తెరుచుకున్న గేట్.. చివరకు..

Updated Date - Aug 14 , 2024 | 07:32 PM