Viral Video: రైల్లో రీల్స్ చేస్తుండగా యువతికి షాకింగ్ అనుభవం.. డోరు వద్ద వేలాడుతుండగా..
ABN , Publish Date - Aug 13 , 2024 | 08:52 PM
బైకులు, బస్సులు, రైళ్లలో వెళ్తూ రీల్స్ చేయడం ప్రస్తుతం సర్వసాధారణమైంది. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు వారు ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. ఇంకొన్నిసార్లు వీరి పరిస్థితి.. చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా తయారవుతుంటుంది. ఇలాంటి...
బైకులు, బస్సులు, రైళ్లలో వెళ్తూ రీల్స్ చేయడం ప్రస్తుతం సర్వసాధారణమైంది. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు వారు ప్రమాదంలో పడడమే కాకుండా ఎదుటి వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. ఇంకొన్నిసార్లు వీరి పరిస్థితి.. చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా తయారవుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. రైల్లో రీల్స్ చేస్తున్న యువతికి చివరకు పెద్ద షాక్ తగిలింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన థాయ్‌లాండ్ (Thailand) ఫత్తాలుంగ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆగస్టు 4న చోటు చేసుకుంది. 19 ఏళ్ల ఓ యువతి రైల్లో వెళ్తూ (young woman doing reels on train) వినూత్నంగా రీల్స్ చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం వివిధ రకాలుగా ఆలోచించి చివరకు డోరు వద్ద వేలాడుతూ వీడియో చేయాలని వెళ్లింది. ఆమె స్నేహితుడు వీడియో తీస్తుండగా బోగీ డోరు వద్దకు వెళ్లిన యువతి.. రెండు వైపులా ఉన్న ఇనుప రాడ్లను పట్టుకుని వెనక్కు వేలాడింది.
Viral Video: వరద నీటిలో బైకుపై వెళ్తున్నారా.. అయితే ఇలాక్కూడా జరగొచ్చు.. జాగ్రత్త..
అయితే ఇలా కాస్త దూరం వెళ్లగానే ఆమె తల స్తంభానికి తగులుకుంటుంది. దీంతో ఆమె కొద్ది సేపు అలాగే ఉండిపోతుంది. తర్వాత ప్లాట్‌ఫామ్‌పై పడిపోతుంది. ఇంతలో వీడియో తీస్తున్న వ్యక్తి పరుగెత్తుకుంటూ వెళ్లి చూసి షాక్ అవుతాడు. అయితే రైలు నెమ్మదిగా వెళ్తుండడంతో ఆమె స్వల్పగాయాలతో బయటపడింది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. స్కానింగ్ తీసిన వైద్యులు ప్రాణాపాయం ఏమీ లేదని చెప్పారు. దీంతో ప్రాథమిక చికిత్స అనంతరం యువతిని డిశ్చార్జి చేశారు. పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
Viral Video: ఛీ.. ఛీ.. యవ్వనంగా కనిపించేందుకు ఈమేంటీ ఇలా చేసిందీ.. ముఖానికి ఏం రాసుకుందో తెలిస్తే..
ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు ఎవరూ చేయొద్దని రైల్వే అధికారులు హెచ్చరించారు. కాగా, ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘తెలిసి తెలిసి ఇలాంటి తప్పులు ఎందుకు చేస్తారో అర్థం కావడం లేదు’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ప్రమాదకర విన్యాసాలను ఎవరూ ప్రయత్నించకండి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 15 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.