Viral Video: ప్రయాణికులకు వెరైటీ వెల్కమ్ చెప్పిన ఇండిగో.. సీతారాముల వేషధారణలో..
ABN , Publish Date - Jan 13 , 2024 | 12:54 PM
అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఏర్పాట్లు పూర్తి చేసుకున్న మందిరం జనవరి 22న ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ కార్యక్రమానికి ..
అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఏర్పాట్లు పూర్తి చేసుకున్న మందిరం జనవరి 22న ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. రామ మందిర ప్రారంభ నేపథ్యంలో దేశంలో ఎక్కడ చూసినా రామనామసర్మణ మారుమోగుతోంది. ఇందులో భాగంగా పలు కంపెనీలు కూడా తమ కార్యకకాలపాల్లో రామ భక్తి ఇనుమడించేలా చూసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇండియో విమానయాన సంస్థ తమ కస్టమర్లకు సీతారాముల వేషధారణలో స్వాగతం పలుకుతోంది. వివరాల్లోకి వెళితే..
అయోధ్య రామ మందిర (Ayodhya Ram Mandir) ప్రారంభ కార్యక్రమాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా రామ నామస్మరణే కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఇండిగో కూడా తమ సిబ్బందిని సీతారాముల వేషధారణలో (Indigo crew dressed as Sitharam) పంపించింది. అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి అహ్మదాబాద్ నుంచి ఇండిగో (Indigo) సంస్థ వారానికి మూడు రోజుల చొప్పున విమానాన్ని నడపనున్నారు. ఈ విమానాన్ని గురువారం లఖ్నవరూ నుంచి యూపీ సీఎం యోగి ఆదిథ్యనాథ్.. పర్చువల్గా ప్రారంభించారు.
Viral Video: పార్టీలో పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేశాడు.. చివరకు చూస్తే ఇలా బుక్కయ్యాడు..
ఇదిలావుండగా, విమానాశ్రయంలో ఇండిగో సిబ్బంది సీతారాముల వేషధారణలో ప్రయాణికులకు స్వాగతం పలికారు. లక్ష్మణుడు, సీతారాముల వేషదారణలో ముగ్గురు నిలబడి ఉండగా.. పక్కనే మరో వ్యక్తి హనుమంతుడి వేషధారణలో మోకాలిపై నిలబడి అందరికీ స్వాగతం పలికారు. అయోధ్యకు వెళ్లే భక్తులంతా ఇండిగో సిబ్బందిని ఆసక్తిగా గమనించారు. ఇందులో మరో విశేషం ఏంటంటే.. వివిధ మతాలకు చెందిన వారితో ఈ వేషం వేయించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రయాణికులు సిబ్బందిని, ఇండిగో యాజమాన్యాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. మతసామరస్యాన్ని ఇనుపడింపజేశారంటూ కొనియాడారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.