Share News

Viral Video: యాక్టింగ్ ఇరగదీశారు కదరా.. ప్రియురాలికి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికినా.. ఎలా ప్లేట్ మార్చారంటే..

ABN , Publish Date - Dec 01 , 2024 | 11:41 AM

సినిమాల్లో ఎలాగైతే ట్విస్ట్‌లు చోటు చేసుకుంటుంటాయో.. కొన్నిసార్లు నిజ జీవితంలోనూ అలాంటి ట్విస్ట్‌‌లనే చూస్తుంటాం. ప్రస్తుత సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా ఉండడంతో చాలా మంది అనేక సినిమా సీన్లను రియల్‌గా చేసి మరీ వీడియోలు తీస్తున్నారు. ఇలాంటి వీడియోలన్నీ నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నాయి. తాజాగా..

Viral Video: యాక్టింగ్ ఇరగదీశారు కదరా.. ప్రియురాలికి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికినా.. ఎలా ప్లేట్ మార్చారంటే..

సినిమాల్లో ఎలాగైతే ట్విస్ట్‌లు చోటు చేసుకుంటుంటాయో.. కొన్నిసార్లు నిజ జీవితంలోనూ అలాంటి ట్విస్ట్‌‌లనే చూస్తుంటాం. ప్రస్తుత సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా ఉండడంతో చాలా మంది అనేక సినిమా సీన్లను రియల్‌గా చేసి మరీ వీడియోలు తీస్తున్నారు. ఇలాంటి వీడియోలన్నీ నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట సందడి చేస్తోంది. ఓ వ్యక్తి యువతితో కలిసి గదిలో ఏకాంతంగా ఉండగా.. ప్రియురాలు సడన్‌ ఎంట్రీ ఇచ్చింది. దీంతో చివరకు వారిద్దరూ కలిసి చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘యాక్టింగ్ ఇరగదీశారు కదరా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన ప్రియురాలికి తెలీకుండా మరో యువతితో సరసాలు ఆడుతున్నాడు. గదిలో ఏకాంతంగా ఉన్న సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. తలుపు చప్పుడు వినబడడంతో ఇద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడతారు. అయితే తలుపు కొట్టేది తన ప్రియురాలే (Girlfriend) అని ముందుగానే ఊహించని ఆ వ్యక్తి మాస్టర్ ప్లాన్ వేస్తాడు. తన ఫోన్‌ను పక్కనున్న యువతికి ఇచ్చి వీడియో తీయమని చెబుతాడు. ఆ తర్వాత వెళ్లి తలుపు తీస్తాడు.

Viral Video: గోతిలో పడ్డ బండి తాళాలు.. గమనించిన పిల్లి ఎలా తెచ్చిపెట్టిందో చూస్తే..


తలుపు తీయగానే లోపలికి వచ్చిన ప్రియురాలు.. గదిలో తన ప్రియుడు వేరే యువతితో ఉండడం చూసి షాక్ అవుతుంది. అయితే ప్రియురాలు లోపలికి అడుగు పెట్టగానే.. అతను ఒక్కసారిగా యాక్టింగ్ స్టార్ట్ చేస్తాడు. ఆమెను కౌగిలించుకోవడానికి ప్రయత్నిస్తాడు. లోపల ఉన్న యువతి తనను వీడియో తీయడం చూసి, ప్రియుడు తనకు ఊహించని విధంగా స్వాగతం పలుకుతున్నాడని సంబరపడిపోతుంది. చివరగా తన ప్రియురాలిని కౌగిలించుకుని సంతోషపడతాడు.

Viral Video: ఆమ్లెట్ వేస్తున్నాడనుకుంటే పొరపాటే.. గుడ్డు నుంచి బయటకు తీస్తున్నదేంటో చూస్తే.. మైండ్ బ్లాకవ్వాల్సిందే..


ఇలా తన ప్రియురాలికి అనుమానం రాకుండా ఎంతో తెలివిగా వ్యవహరించిన ఇతడి చేష్టలు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఓరి మీ దుంపలు తెగ.. యాక్టింగ్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..


ఇవి కూడా చదవండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

Optical illusion: పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..

Optical illusion: మీ కంటి చూపు చురుగ్గా ఉందా.. అయితే ఈ చిత్రంలో అరటిపండు ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 01 , 2024 | 11:41 AM