Viral Video: రోడ్డుపై సింహం.. అయ్యో పాపం అంటున్న జనం..
ABN , Publish Date - Nov 30 , 2024 | 12:28 PM
సింహం అంటేనే అడవి జంతువులకు హడల్. దూరంగా సింహం వస్తుందంటే చాలు.. మిగతా జంతువులన్నీ తలో దారిన పారిపోతుంటాయి. ఒకవేళ వాటికి ఎదురుపడితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే సింహాలను అడవికి రాజుగా పిలుస్తుంటారు. అయితే అలాంటి సింహాలకూ కొన్నిసార్లు గడ్డు పరిస్థితులు ఎదురువుతుంటాయి. అలాంటి..
సింహం అంటేనే అడవి జంతువులకు హడల్. దూరంగా సింహం వస్తుందంటే చాలు.. మిగతా జంతువులన్నీ తలో దారిన పారిపోతుంటాయి. ఒకవేళ వాటికి ఎదురుపడితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే సింహాలను అడవికి రాజుగా పిలుస్తుంటారు. అయితే అలాంటి సింహాలకూ కొన్నిసార్లు గడ్డు పరిస్థితులు ఎదురువుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న సింహాలు.. చిన్న చిన్న జంతువులకూ లోకువ అవుతుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న సింహాన్ని చూసి అంతా.. ‘‘అయ్యో పాపం’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైలర్ అవుతోంది. సాధారణంగా సింహం వేటకు దిగిందంటే తిరుగు ఉండదు. అయితే అప్పుడప్పుడూ సింహాలకూ షాకింగ్ అనుభవాలు ఎదురవడం చూస్తుంటాం. చిన్న చిన్న జంతువుల చేతిలో ఘోరంగా ఓడిపోవడం కూడా చూస్తుంటాం. ఇక వయసు పైబడిన సింహాల (old lion) పరిస్థితి కొన్నిసార్లు మరింత దయనీయంగా ఉంటుంది.
పక్కనే జంతువు ఉన్నా కూడా వేటాడలేని పరిస్థితి ఉంటుంది. కొన్ని వృద్ధ సింహాలైతే బక్కచిక్కిపోయి నడవడానికీ ఇబ్బంది పడుతుంటాయి. తాజాగా, ఓ సింహానికీ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. వయసు పైబడిన ఓ సింహం.. రోడ్డుపై నీరసంగా (old lion walking on the road) నడుస్తూ వెళ్తోంది. దాన్ని చూసిన వాహనదారులు ఒక్కసారిగా చలించిపోయారు. బక్కచిక్కిన ఆ సింహం.. నీరసంగా నడుస్తూ వెళ్లడం అందరినీ అయ్యో పాపం.. అనిపించేలా చేసింది.
Viral Video: ఆహా.. తెలివంటే నీదేనయ్యా.. పోలీసులకు దొరక్కుండా ఈ లారీ డ్రైవర్ వాడిన ట్రిక్ చూస్తే..
కొందరు వాహనదారులు ఈ సింహాన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో పాపం.. ఈ సింహానికి ఎంత కష్టమొచ్చిందీ’’.. అంటూ కొందరు, ‘‘సింహానికీ వృద్ధాప్య సమస్యలు తప్పడం లేదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లు, 19.2 మిలియన్లకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: కారుకు పెట్రోల్ కొట్టిన మహిళకు ఊహించని షాక్.. డబ్బుల కోసం ముందు డోరు వద్దకు వెళ్లగా..
ఇవి కూడా చదవండి..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
Viral Video: ఆటోను చూసి అవాక్కవుతున్న జనం.. ఇతడు చేసిన ప్రయోగమేంటో మీరే చూడండి..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..