Share News

Viral Video: మొసలి నోట్లోనే చేయి పెట్టిన వ్యక్తి.. చివరకు రెప్పపాటు కాలంలో ఏం జరిగిందో మీరే చూడండి..

ABN , Publish Date - Sep 03 , 2024 | 06:19 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ స్విమ్మింగ్‌ఫూల్ లాంటి ప్రదేశంలో చాలా మొసళ్లు నీటిలో ఈదుతుంటాయి. వాటిలో ఓ మొసలి ఒడ్డున ఉండగా.. దాని వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి వినూత్నం విన్యాసం చేశాడు. మొసలి నోరు తెరిచి చూస్తుండగా.. ఆ వ్యక్తి దాని ఎదురుగా కూర్చుని..

Viral Video: మొసలి నోట్లోనే చేయి పెట్టిన వ్యక్తి.. చివరకు రెప్పపాటు కాలంలో ఏం జరిగిందో మీరే చూడండి..

సమీపానికి వెళ్తేనే నోటికి పని చెప్పే మొసళ్లు.. ఇక వాటి మీద చేయి వేస్తే ఏం చేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే కొందరు మాత్రం మొసళ్లతో చిత్రవిచిత్రమైన ఆటలు ఆడటం చూస్తుంటాం. వాటిని చిన్న పిల్లల్లా లాలిస్తూ గోరు ముద్దలు తినిపించినట్లుగా మాంసం ముక్కలను తినిపించడం, వడిలో పడుకోబెట్టుకుని లాలించడం వంటివి చేస్తుంటారు. ఇంకొందరు యువతులు వాటిని చిన్న కర్రతో బెదిరించడం, మరికొందరు వాటి మధ్య నడుస్తూ వెళ్లడం చేస్తుంటారు. ఇలాంటి వీడియోలను సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి మొసలి ఎదురుగా కూర్చోవడమే కాకుండా ఏకంగా దాని నోట్లోనే చేయి పెట్టాడు. దీంతో చివరకు రెప్పపాటు కాలంలో ఏం జరిగిందో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ స్విమ్మింగ్‌ఫూల్ లాంటి ప్రదేశంలో చాలా మొసళ్లు నీటిలో ఈదుతుంటాయి. వాటిలో ఓ మొసలి ఒడ్డున ఉండగా.. దాని వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి వినూత్నం విన్యాసం చేశాడు. మొసలి నోరు తెరిచి చూస్తుండగా.. ఆ వ్యక్తి దాని ఎదురుగా కూర్చుని మూతిపై చేయి పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తాడు. ఇలా కొన్నిసార్లు ప్రెస్ చేసిన తర్వాత తన చేయిని.. (man put his hand in crocodile mouth) ఏకంగా మొసలి నోట్లోకి పెడతాడు.

Viral Video: ఐదు రూపాయల ఐస్‌క్రీంను లొట్టలేసుకుని తింటున్నారా.. ఈ వీడియో చూస్తే.. ఆలోచనలో పడతారు..


మొసలి నోరు మధ్యలో చేయి పెట్టగానే సెకన్ల వ్యవధిలో మొసలి ఎంతో వేగంగా టప్ మని నోరును మూసేస్తుంది. అయితే ఆ యువకుడు అంతకంటే వేగంగా తన చేయిని పక్కకు తీసేస్తాడు. ఇదంతా చూస్తుంటే సందర్శకుల సమక్షంలో వీరంతా మొసళ్లతో వివిధ రకాల విన్యాసాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇలా ఈ యువకుడు చిన్న పిల్లలు ఆడుకునే చందంగా మొసలి నోట్లో చేయి పెట్టి ఆడుకోవడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Optical illusion: ఇక్కడ కనిపిస్తున్న ‘Real’ మధ్యలో ‘Reel’ ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మొసలితో ఆటలు మామూలుగా లేవుగా’’., ‘‘ఇతడి టాలెంట్ బాగుంది.. కానీ మొసళ్లతో జాగ్రత్త’’., ‘‘మృత్యువును తాకి తిరిగి రావడం అంటే ఇదేనేమో’’., ‘‘వినోదం కోసం ఏ జంతువునూ వేధించకూడదు’’., ‘‘ఈ మొసలి ఒక్కసారైనా గెలవాలి అని అనుకుంటోంది’’., ‘‘మరీ ఇంత అజాగ్రత్తగా ఉండకు బ్రదర్.. ఇలాగైతే ఏదో ఒక రోజు సమస్య తప్పదు’’.. అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 19 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: మొసలి దవడలు ఎంత బలంగా ఉంటాయో తెలుసా.. తాబేలు నోట్లోకి వెళ్లగానే ఏం జరిగిందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: మొసలి దవడలు ఎంత బలంగా ఉంటాయో తెలుసా.. తాబేలు నోట్లోకి వెళ్లగానే ఏం జరిగిందో చూస్తే..

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 03 , 2024 | 06:19 PM