Share News

Viral Video: చివరికి హిప్పో కూడా రూటు మార్చిందిగా.. స్విమ్మింగ్‌ఫూల్‌లో అది చేస్తున్న నిర్వాకం చూడండి..

ABN , Publish Date - Sep 01 , 2024 | 09:34 PM

కుక్కలు, కోతులు, గొరిల్లాలు, చింపాంజీలు తదితర జంతువులు మనుషులను అనుకరిస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. కొన్నిసార్లు వాటి ప్రవర్తన చూస్తే అలాగే చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంటుంది. అయితే ఏనుగులు, నీటి ఏనుగులు ఇలా ప్రవర్తించడం చాలా అరుదుగా చూస్తుంటాం. తాజాగా..

Viral Video: చివరికి హిప్పో కూడా రూటు మార్చిందిగా.. స్విమ్మింగ్‌ఫూల్‌లో అది చేస్తున్న నిర్వాకం చూడండి..

కుక్కలు, కోతులు, గొరిల్లాలు, చింపాంజీలు తదితర జంతువులు మనుషులను అనుకరిస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. కొన్నిసార్లు వాటి ప్రవర్తన చూస్తే అలాగే చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంటుంది. అయితే ఏనుగులు, నీటి ఏనుగులు ఇలా ప్రవర్తించడం చాలా అరుదుగా చూస్తుంటాం. తాజాగా, ఓ హిప్పో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. స్విమ్మింగ్‌ఫూల్‌లో దాని నిర్వాకం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘చివరికి హిప్పో కూడా రూటు మార్చిందిగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. మనుషులను అనుకరించే కోతులు, చింపాజీలను చూసి హిప్పో (Hippo) కూడా తన మనసు మార్చుకున్నట్లుంది. నీటిలో మనుషుల తరహాలోనే స్విమ్మింగ్ (Swimming) చేయాలని నిర్ణయించుకున్నట్లుంది. ఇందుకోసం చివరకు ఆ హిప్పో ఓ స్విమ్మింగ్‌ఫూల్‌ను సెలెక్ట్ చేసుకుంది.

Viral Video: ఎలుగుబంటితో యువతి ఫొటోషూట్.. అది చేసిన నిర్వాకం చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..


మనుషులు ఈత కొట్టడాన్ని బాగా గమనించిన హిప్పో.. అందులో దానికి ఇష్టమైన ఫీట్ చేసేందుకు సిద్ధమైంది. స్విమ్మింగ్‌ఫూల్‌లో కాసేపు ఈత కొట్టిన హిప్పో.. తర్వాత చివరకు వెళ్లి గోడ రెయిలింగ్‌ను పట్టుకుని (hippo swimming like human in Swimmingfool) మనుషుల తరహాలోనే నీటిలోకి వెనక్కు దూకేసింది. ఇలా పదే పదే అచ్చం మనుషుల్లాగే చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Optical illusion: ఇక్కడ కనిపిస్తున్న ‘Real’ మధ్యలో ‘Reel’ ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం..


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘ఈ హిప్పోను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘అచ్చం మనుషుల్లాగానే చేస్తోందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..

Updated Date - Sep 01 , 2024 | 09:34 PM