Share News

Viral Video: ఎలుగుబంటితో యువతి ఫొటోషూట్.. అది చేసిన నిర్వాకం చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

ABN , Publish Date - Sep 01 , 2024 | 08:09 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి ఎలుగుబంటితో ఫొటోలు దిగడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. గడ్డిలో ఉన్న ఓ భారీ ఎలుగుబంటి వద్దకు ఓ యువతి వెళ్తుంది. సమీపానికి వెళ్లడమే కాకుండా ...

Viral Video: ఎలుగుబంటితో యువతి ఫొటోషూట్.. అది చేసిన నిర్వాకం చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..

క్రూర జంతువులతో చెట్టాపట్టాలేసుకుని తిరిగే వారిని చూస్తుంటాం. కొందరు యువతులు కూడా వాటితో స్నేహం చేయడం, చిన్న పిల్లల్లా ఆడుకోవడం కూడా చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి ఏకంగా ఎలుగుబంటితోనే ఫొటో షూట్ ప్లాన్ చేసింది. ఈ క్రమంలో ఎలుగుబంటి నిర్వాకం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువతి ఎలుగుబంటితో ఫొటోలు దిగడం (young woman took photos with bear) చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. గడ్డిలో ఉన్న ఓ భారీ ఎలుగుబంటి వద్దకు ఓ యువతి వెళ్తుంది. సమీపానికి వెళ్లడమే కాకుండా ఏకంగా దాన్ని కౌగిలించుకుంటుంది. ఎలుగుబంటి కూడా యువతిని ఎంతో ప్రేమగా కౌగిలించుకుంటుంది.

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..


అంతటితో ఆగని ఆ యువతి ఎలుగుబంటితో వివిధ రకాలుగా ఫోజులు ఇస్తూ ఫొటోలు దిగుతుంది. ఆ తర్వాత దానికి యాపిల్ పండు తినిపిస్తుంది. పండు తిన్న ఎలుగుంటి.. యువతికి ముద్దులు పెడుతూ థ్యాంక్స్ కూడా చెబుతుంది. ఇలా ఆ యువతి చాలా సేపు ఎలుగుబంటితో ఫొటోలు, వీడియోలు తీసుకుంటుంది. ఎలుగుబంటి తన ప్రవర్తనకు పూర్తి భిన్నంగా అచ్చం మనుషుల్లాగే ప్రవర్తించడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Viral Video: ఎలుగుబంటికి ఎంత పవర్ ఉంటుందో తెలుసా.. పులిని ఎలా హడలెత్తించిందో చూస్తే..


చూస్తుంటే ఇదంతా నిపుణుల పర్యవేక్షణలో జరిగినట్లు అనిపిస్తున్నా.. వీడియో మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మనుషులు, జంతువుల మధ్య అనుబంధానికి నిదర్శనంగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘ఎంత శిక్షణ ఇచ్చినా ఎలుగుబంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.28లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఈ ఏనుగుకు హెల్పింగ్ నేచర్ ఎక్కువే.. హిప్పోను ప్రమాదం నుంచి ఎలా కాపాడిందో చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఇదేందయ్యా.. ఇదీ.. వడలను ఇతనెలా వడ్డిస్తున్నాడో చూడండి..

Viral Video: మెట్రోలో వెనుకే కూర్చుని.. యువకుడు చేస్తున్న నిర్వాకాన్ని పసిగట్టిన మహిళ.. చివరకు..

Viral Video: పార్క్ చేసిన బైకుపై కూర్చుంటున్నారా.. ఇతడికేమైందో చూడండి..

Viral Video: పిలవని పెళ్లిలో విందు ఆరగించిన యువకుడు.. చివరకు వధువుకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలిస్తే..

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 01 , 2024 | 08:13 PM