Share News

Viral video: ఇది మామూలు టాలెంట్ కాదు.. సైకిల్‌పై ఇతడు చేసిన విన్యాసం చూస్తే..

ABN , Publish Date - Jun 14 , 2024 | 09:33 PM

కొందరు చేసే సాహసాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అనితర సాధ్యం అనిపిస్తుంది. మరికొందరు చేసే సాహసాలు చూస్తే.. అనితర సాధ్యం అనిపిస్తుంది. ఇలాంటి..

Viral video: ఇది మామూలు టాలెంట్ కాదు.. సైకిల్‌పై ఇతడు చేసిన విన్యాసం చూస్తే..

కొందరు చేసే సాహసాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అనితర సాధ్యం అనిపిస్తుంది. మరికొందరు చేసే సాహసాలు చూస్తే.. అనితర సాధ్యం అనిపిస్తుంది. ఇలాంటి విచిత్ర విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి సైకిల్‌పై చేసిన విన్యాసం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘వామ్మో..! ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ యవకుడు సైకిల్‌పై (bicycle) గడ్డి మోపుతో వెళ్తుంటాడు. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా.. అతడు సైకిల్ నడిపే విధానం చూసి అంతా షాక్ అవుతున్నారు. సాధారణంగా ఎవరైనా సైకిల్ వెనుక లగేజీ పెట్టుకుని వెళ్తారు. కానీ ఇతను మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా గడ్డిమోపును నెత్తిపై పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా సైకిల్ హ్యాండిల్ ముట్టుకోకుండానే సైకిల్ తొక్కుతూ వెళ్లాడు.

Viral video: పాము కాటేసిందనే కోపంతో తల కొరికి మింగేశాడు.. చివరకు ఏం జరిగిందంటే..


అది కూడా అత్యం వేగంగా వెళ్లడమే కాకుండా టర్నింగ్స్ వద్ద కూడా ఎంతో చాకచక్యంగా బ్యాలెన్స్ చేస్తూ వెళ్తాడు. ఇతడు సైకిల్ తొక్కే విధానం చూస్తే.. ఎక్కడ కిందపడిపోతాడేమో అని భయమేస్తోంది. కానీ ఇతను మత్రం ఎంతో నేర్పుగా సైకిల్ నడిపాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ! ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి విన్యాసాలను ఎవరూ అనుకరించవద్దు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral video: వధువును ముద్దు పెట్టుకున్న వరుడు.. ఆ వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్... ఏం జరిగిందని విచారించగా..

Updated Date - Jun 14 , 2024 | 09:33 PM