Share News

Viral Video: సామాన్లు తరలించడం ఇంత ఈజీనా.. ఇతడి ట్రిక్ మామూలుగా లేదుగా..

ABN , Publish Date - Dec 04 , 2024 | 08:35 AM

పట్టణాలు, నగరాల్లో ఇళ్లు మారే సమయంలో సమాన్లు తరలించడం కొన్నిసార్లు పెద్ద తలనొప్పిగా మారుతుంటుంది. అదే రెండు, మూడు, నాలుగు ఇలా పై అంతస్తుల్లో ఉన్న వారికి ఇంకా పెద్ద సమస్య ఎదురవుతుంటుంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ వ్యక్తి పై అంతస్తులోని తన ఇంటి సామాన్లను తరలించేందుకు వినూత్నమైన ట్రిక్‌ను వాడాడు..

Viral Video: సామాన్లు తరలించడం ఇంత ఈజీనా.. ఇతడి ట్రిక్ మామూలుగా లేదుగా..

పట్టణాలు, నగరాల్లో ఇళ్లు మారే సమయంలో సమాన్లు తరలించడం కొన్నిసార్లు పెద్ద తలనొప్పిగా మారుతుంటుంది. అదే రెండు, మూడు, నాలుగు ఇలా పై అంతస్తుల్లో ఉన్న వారికి ఇంకా పెద్ద సమస్య ఎదురవుతుంటుంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ వ్యక్తి పై అంతస్తులోని తన ఇంటి సామాన్లను తరలించేందుకు వినూత్నమైన ట్రిక్‌ను వాడాడు. ఇతడి తెలివితేటలు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘సామాన్లు తరలించడం ఇంత ఈజీనా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన మూడో అంతస్తులోని ఇంటిని ఖాళీ చేయాల్సి వచ్చింది. అయితే ఇందుకోసం చిన్న చిన్న సామాన్లను (Moving goods) సైతం పైనుంచి కిందకు తీసుకురావడం అతడికి పెద్ద తలనొప్పిగా మారినట్లుంది. దీంతో చివరకు వినూత్నంగా ఆలోచించాడు. తన ఇంటి కిటికీ నుంచి కింద ఉన్న లగేజీ వాహనంలోకి పొడవాటి గుడ్డను కట్టాడు.

Viral Video: ఏనుగుకు తిక్కరేగితే ఇలాగే ఉంటుంది మరీ.. మొసలిని ఏం చేసిందో చూస్తే..


తర్వాత చిన్న చిన్న వస్తువులను కిటికీలో నుంచి గుడ్డలో వేయగా.. అవి జారుకుంటూ లగేజీ వాహనంలోకి వచ్చి పడ్డాయి. ఇలా తన ఇంట్లోని చిన్న సామాన్లన్నింటినీ వాహనంలోకి ఇలా సులభంగా తరలించేశాడు. సామాన్లను ఇలా విచిత్రంగా తరలించడం చూసి ఆ అపార్ట్‌మెంట్‌లో ఉన్న వారంతా అవాక్కయ్యారు.

Viral Video: ఓ వైపు పెళ్లి పెట్టుకుని మరోవైపు మంటపంలోనే ఈ వరుడు చేస్తున్న నిర్వాకం చూడండి..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘మూడో అంతస్తు నుంచి ఫన్ గేమ్ ఆడుతున్నాడు’’.. అంటూ కొందరు, ‘‘ఇండియాలో ఇలాంటి టాలెంట్‌కు కొదవే లేదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 32వేలకు పైగా లైక్‌లు, 1.5 మిలియన్‌కు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: బైకుపై అమ్మాయి ఉండాలే గానీ.. సింహం ఎదురొచ్చినా డోంట్ కేర్.. ఇతడు చేసిన నిర్వాకం చూడండి..


ఇవి కూడా చదవండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: బ్యాగు లాక్కెళ్తూ యువతి మనసు దోచుకున్న దొంగ.. చివరకు రోడ్డు పైనే..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 04 , 2024 | 08:35 AM